
ఆ మంత్రి గారికి కోపం వచ్చిందంటే..?
- Ap political StoryNewsPolitics
- March 27, 2023
- No Comment
- 109
ఐటీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ కు ఈ మధ్య ఇద్దరు అధికారులపై తీవ్రమైన కోపం వచ్చిందట. అనకాపల్లిలోని నూకాలమ్మ దేవాలయం జాతర మొదటి రోజు ఉత్సవాల్లో పాల్గొనేందుకు మంత్రి గుడివాడ అమర్నాథ్ వచ్చారు. మంత్రి గారు వచ్చిన సమయంలో నైవేద్యం కోసం అధికారులు కాసేపు దర్శనాలు నిలిపివేశారు. దీంతో మంత్రిగారు 45 నిమిషాలు వెయిట్ చేయాల్సి వచ్చింది.
తనకు ముందుగా దర్శన సమయాలు ఎందుకు తెలియజేయలేదంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ దేవాదాయ శాఖ అధికారులపై విరుచుకుపడ్డారు. అంతటితో ఆగలేదు. నూకాలమ్మ దేవాలయ ఇన్ ఛార్జి బుద్ద నగేష్, దేవాలయ ఈవో చంద్రశేఖర్ పై బదిలీ వేటు వేయించారు. మంత్రికి కోపం తెప్పిస్తే ఇలాగే ఉంటుంది మరి.