జగన్ మాటను ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదా..?

జగన్ మాటను ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదా..?

సీఎం వైఎస్ జగన్ రెడ్డి నియంతృత్వ పోకడలు ఆ పార్టీని పుట్టిముంచేలా ఉన్నాయి. ఇప్పటికే వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీథర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి పార్టీ అధినేతపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆ నలుగురు జగన్ రెడ్డికి ఝలక్ ఇచ్చారు. పార్టీ అధినేత ఆదేశాలను ఖాతరు చేయలేదు. దీంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లోనూ టీడీపీ అభ్యర్థి గెలవడం, అది కూడా వైసీపీ సభ్యుల సహకారంతో గెలవడంతో జగన్ రెడ్డి టీం అయోమయంలో పడిపోయింది. ఇప్పటి వరకు నేను చెప్పిందే వేదం అన్నట్టు వ్యవహరించిన జగన్ రెడ్డి ఎమ్మెల్యేలు, మంత్రులకు సరైన గౌరవం ఇవ్వలేదు. నాలుగేళ్లలో ఒక్కసారి కూడా తమ నియోజకవర్గ సమస్యలు చెప్పుకునేందుకు సీఎం జగన్ రెడ్డి అపాయిట్మెంట్ ఇవ్వకపోవడంతో వారంతా లోలోన రగిలిపోతున్నారు. బయటపడి విమర్శలు చేస్తే అక్రమ కేసులు పెడతారని భయపడి ఇన్నాళ్లూ మిన్నకుండి పోయారు. నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం జగన్ రెడ్డిపై తీవ్ర విమర్శలకు సైతం వెనకాడటం లేదు. ఇక పట్టభద్రులు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం మిగలడంతో నైరాశ్యంలో ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు రెచ్చిపోయే అవకాశం ఉంది.

నాలుగేళ్లలో జగన్ ప్రభుత్వ పనీ తీరు చూసిన ప్రజలకు.. కనీసం తమ పట్టణాలు, గ్రామాల్లో అభివృద్ధి జరగక పోవడంతో.. ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయడం మొదలు పెట్టారు. అయినా ఫలితం లేకుండా పోయింది. నియోజకవర్గంలో కనీసం ఒక్క సిమెంటు రోడ్డు కూడా వేయించలేని పరిస్థితుల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కనీసం వాలంటీరుకు ఉన్న గౌరవం కూడా వైసీపీ ఎమ్మెల్యేలకు దక్కడం లేదు. దీంతో వారు నియోజకవర్గాల్లో తిరగడం మానేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 60 మంది గెలిచే పరిస్థితి లేదని ఐ ప్యాక్ టీం సర్వే రిపోర్టులు బయటకు వచ్చాయి. వారందరికీ క్లాస్ పీకిన జగన్ రెడ్డి, వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదనే సంకేతాలు ఇచ్చారు. టికెట్ రాకుంటే వారంతా చేతులు కట్టుకుని కూర్చంటారనుకోవడం భ్రమే అవుతుంది. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీలో దాదాపు 90 మంది రెబల్స్ తయారయ్యే అవకాశం కనిపిస్తోంది. టికెట్ ఇస్తే సరి లేదంటే ప్రతిపక్షాలకు సహకరిస్తామని లేదా పార్టీ నిలబెట్టిన అభ్యర్థిని ఓడిస్తామని.. అంతరంగిక సమావేశాల్లో.. తమ సన్నిహితులతో చెబుతున్నారు. ఇవన్నీ 2024 సాధారణ ఎన్నికల్లో .. వైసీపీ విజయావకాశాలను .. దారుణంగా దెబ్బతీస్తాయని.. రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇటీవల ఏపీలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో .. టీడీపీ ఘన విజయంతో .. వైసీపీ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని.. జనం అనుకుంటున్నారు. వై నాట్ 175 పక్కన పెడితే, పులివెందుల్లోనే వైసీపీకి ఎదురు గాలి వీస్తోంది. నేల విడిచి సాము చేస్తున్న జగన్ రెడ్డికి పట్టభద్రులు.. కోలుకోలేని తీర్పు ఇచ్చారు. రాబోయే కాలంలో ఈ సంఖ్య మరింత పెరగే అవకాశం కనిపిస్తోంది. వైసీపీలో ఎమ్మెల్యేల అసంతృప్తికి.. జగన్ పెడ పోకడలే కారణంగా చెప్పవచ్చు. ఏది ఏమైనా ఏపీలో వైసీపీ మరలా గెలిచే పరిస్థితులు ఏ మాత్రం కనిపించడం లేదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

Related post

శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

హిందువులకు అత్యంత ముఖ్యమైన ఆరాధ్య దైవం విఘ్నేశ్వరుడు. సకల శుభంకరుడు.. సకల గణాలకు నాయకుడు గణేశుడు. అంతే కాదు.. లయకారుకుడైన ఆదిశంకరుడు, జగన్మాతల ముద్దుబిడ్డ వినాయకుడు. శివుని ఆదేశాలతో…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…
చంద్రబాబు అరెస్ట్ తో వైసీపీలో ముసలం..?

చంద్రబాబు అరెస్ట్ తో వైసీపీలో ముసలం..?

ఏపీలో టీడీపీ, జనసేన పొత్తుతో వైసీపీ నేతల్లో కలవరం మొదలైంది. 2014 ఎన్నికల నాటి ఫలితాలు రిపీట్ అవుతాయనే విశ్లేషణలు సాగుతున్నాయి. ఈనేపథ్యంలో చంద్రబాబును అరెస్ట్ చేసి జగన్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *