
దాస్ కా ధమ్కీ కలెక్షన్స్ ..
- MoviesNews
- March 24, 2023
- No Comment
- 101
డైనమిక్ హీరో విశ్వక్ సేన్ ఎంతో గట్స్ ఉన్న హీరో అని చెప్పాలి ఎందుకంటే హీరో గా చేస్తూ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గా కూడా తన టాలెంట్ ని నిరూపించుకుంటున్నాడు , ఇప్పుడు తన తొలి పాన్ ఇండియా చిత్రం దాస్కా ధమ్కీ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందింన ఈ చిత్రం ఉగాది రోజున మార్చి 22వ తేదీన విడుదల అయింది. అయితే ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన నివేదా పేతురాజ్ నటించింది.
భారీ బడ్జెట్తో యాక్షన్ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్స్తో దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 8.8 కోట్లు వసూలు చేసింది. ఇంకా వసూళ్లు వేటలో కొనసాగుతూనే ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.4.08 కోట్లు వసూళ్లును రాబట్టింది. రూ.8.20 గ్రాస్ వసూళ్లను సాధించింది. అయితే సినిమా మొత్తం వాల్యూడ్ బిజినెస్ రూ.7.50 కోట్లు కాగా.. బ్రేక్ ఈవెన్ రూ.8 కోట్లు. సినిమా బ్రేక్ ఈవెన్ ను సాధించాలంటే మరో రూ.3.92 కోట్ల రూపాయలు కావాలి. మరి చూడాలి విశ్వక్ సేన్ దాస్కా ధమ్కీ ఏ రోజు బ్రేక్ ఈవెన్ ను సాధించి ఎంత మేర లాభాలను రాబట్టగల్గుతుందో. అయితే వారం రోజుల్లో బ్రేక్ ఈవెన్ ను సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
విశ్వక్ సేన్ హీరోగా డైరెక్టర్ వచ్చిన ఈ సినిమా విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రమోషనల్ ఈవెంట్కు నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ రావడంతో ఈ సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. దాంతో ఈ సినిమాను తెలంగాణలో 220 స్క్రీన్లు ఆంధ్రాలో 220 స్క్రీన్లు ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో 210 స్క్రీన్లు ఓవర్సీస్ లో కలిపి మొత్తంగా 650 స్క్రీన్లలో ఈ చిత్రం రిలీజ్ అయింది.