మంచు బ్రదర్స్ మధ్య గొడవేంటి..?

మంచు బ్రదర్స్ మధ్య గొడవేంటి..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా.. మంచు మోహన్ బాబు ఫ్యామిలీలోని అన్నదమ్ముల వివాదాలు రచ్చకెక్కాయి. మంచు మనోజ్, విష్ణు మధ్య విభేదాలున్నాయంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ గొడవల కారణంగానే కుటుంబం నుంచి విడిపోయి మనోజ్ వేరుగా ఉంటున్నారన్న గుసగుసలూ వినిపించాయి. ఇప్పుడీ అనుమానాలకు తెరపడింది. మంచు మనోజ్ దగ్గర పని చేసే సారథి అనే వ్యక్తి ఇంటికెళ్లి మంచు విష్ణు గొడవ పడ్డారు. అతనిపై దాడి చేసేందుకూ ప్రయత్నించినట్టు సమాచారం. చాలా కాలంగా మంచు కుటుంబంతో సన్నిహితంగా ఉంటున్న సారథి…మనోజ్‌ దగ్గర పనిచేయడంపై విష్ణు ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన ఇంటికెళ్లి మరీ గొడవ పడ్డారని ప్రచారం జరుగుతోంది.

ఇటీవల మనోజ్ పెళ్లిలోనూ విష్ణు పెద్దగా జోక్యం చేసుకున్నట్టు కనిపించలేదు. అంటీముట్టనట్టుగానే ఉన్నారు. ఇప్పుడు విష్ణు..సారథి ఇంటికి రావడంతో వీళ్ల మధ్య విభేదాలు నిజమే అని ఓ క్లారిటీ వచ్చింది. విష్ణు ఇలా పదేపదే ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నాడంటూ మనోజ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు. మంచు విష్ణు గొడవ పడ్డ వీడియోని పోస్ట్ చేశాడు. మంచు సోదరులకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇళ్లల్లోకి వచ్చి ఇలా దాడికి దిగుతుంటారంటూ నటుడు మనోజ్‌షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది.

ఇళ్లల్లోకి వచ్చి మా వాళ్లను బంధువులను ఇలా కొడుతుంటారండి. ఇది ఇక్కడి పరిస్థితి అంటూ మనోజ్‌ చెబుతుండగా.. మంచు విష్ణు ఆగ్రహంగా ఉన్నట్లు కనిపించారు. వాడు ఏదో అన్నాడు కదా ఒరేయ్‌ గిరేయ్‌ అని అంటూ విష్ణు ఎవరిపైనో కేకలు వేస్తుండగా అక్కడే ఉన్న ఇద్దరి వ్యక్తులు ఆయన్ని ఆపే ప్రయత్నం చేశారు. అయితే.. విష్టు ఎవరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. మరోవైపు ఈ వీడియోను మంచు మనోజ్‌ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్‌ చేసిన కాసేపటికే డిలీట్‌ చేశారు. అయితే..ఈ వివాదంపై మోహన్‌ బాబు సీరియస్ అయిన్టటు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఏంటీ గొడవ అని మందలించినట్టు సమాచారం.

Related post

శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

హిందువులకు అత్యంత ముఖ్యమైన ఆరాధ్య దైవం విఘ్నేశ్వరుడు. సకల శుభంకరుడు.. సకల గణాలకు నాయకుడు గణేశుడు. అంతే కాదు.. లయకారుకుడైన ఆదిశంకరుడు, జగన్మాతల ముద్దుబిడ్డ వినాయకుడు. శివుని ఆదేశాలతో…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…
ఫొటోస్ : రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోస్

ఫొటోస్ : రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోస్

ఫొటోస్ : రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *