
హాలీవుడ్ లో సలార్ విడుదల ఫిక్స్
- EntertainmentMoviesNews
- March 24, 2023
- No Comment
- 102
కన్నడ నుంచి మొదలైన కేజీఎఫ్ దర్శకుడి సక్సెస్ యాత్ర.. అమాంతం ఇంటర్నేషనల్ వరకు సాగింది. ఒక్క చిత్రంతోనే.. తనేంటో.. తన స్టామినా ఏంటో నిరూపించేశాడు… యువ దర్శకుడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ ఒక్కటే కదా.. పెద్ద హిట్ కొట్టాడు అనుకుంటే.. కేజీఎఫ్ -2 మాత్రం.. అన్ని భాషా చిత్రాల్లో రికార్డులను తిరగరాసి కలెక్షన్ల సునామీ సృష్టించింది. సినిమా తీస్తే… ఇలాగే తీయాలి.. అనే డిక్షన్ తో .. డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో .. ఆకట్టుకుని ప్రేక్షకుల మదిలో ప్రశాంత్ నీల్ చెరగని ముద్ర వేశాడు.. ఇప్పుడు ప్రశాంత్ నీల్ అంటే కేవలం ఒక దర్శకుడు మాత్రమే కాదు.. ఒక బ్రాండ్.. ఇప్పుడు ఈయన పేరు చెబితే.. దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఊగి పోతున్నారు.
ఆ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకునే.. ప్రశాంత్ నీల్ కు .. రెబల్ స్టార్ ప్రభాస్ తన సినిమాలన్ని పక్కన పెట్టి.. అవకాశం ఇచ్చాడు. మరి ప్రశాంత్ నీల్ కేజీయఫ్ చాప్టర్ 2 రికార్డులు బద్దలు కొట్టేస్తాడా? బాహుబలి రికార్డులను ప్రభాస్ రీ క్రియేట్ చేస్తాడా? ఈ ప్రశ్నలకు సమాధానం పక్కన పెడితే.. డార్లింగ్ అభిమానుల ఆశలు మాత్రం..ఆకాశాన్ని దాటి పోతున్నాయి. ఎప్పుడు డార్లింగ్ ప్రభాస్ సినిమా విడుదలవుతుందా.. అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ .. షూటింగ్ లోనే సంచలనాలు సృష్టిస్తున్న విషయం.. అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీ లో శృతి హాసన్ … ప్రభాస్ కి జోడిగా నటిస్తూ ఉండగా … జగపతి బాబు … పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మూవీ లో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ మూవీ కి రవి బుస్రుర్ సంగీతం అందిస్తున్నాడు.
ఇది ఇలా ఉంటే మొదట ఈ మూవీ ని ఈ చిత్ర బృందం పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నట్లు ప్రశాంత్ నీల్ ప్రకటించారు. సలార్ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అయింది. ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే చాలా భాగం పూర్తయినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ ఇంకా కేవలం 15 నుండి 20 రోజులు మాత్రమే పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మరో 15 నుండి 20 రోజుల్లో ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్లు … ఆ తర్వాత ఈ మూవీ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఈ మూవీ యూనిట్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
సలార్ మూవీ పై దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్లో భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలసి చేస్తున్న సలార్ మీద దేశం మొత్తం కన్నేసింది. ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ సైతం హాలీవుడ్ బాట పట్టేస్తున్నాడు. ఈ సినిమాను ఇంగ్లీష్ భాషలోనూ విడుదల చేయబోతున్నారనే విషయం.. అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఇంగ్లీష్ వర్షెన్‌లో మాత్రం పాటలు, కామెడీ ట్రాక్‌ను తీసేయాలని ప్రశాంత్ నీల్ ఫిక్స్ అయ్యాడట. తెలుగులో దాదాపు రెండున్నర గంటలు ఉంటే.. ఇంగ్లీష్‌లో మాత్రం రెండు గంటల నిడివి ఉంటుందట. బాహుబలితో ప్రభాస్‌కు ఇంటర్నేషనల్ వైడ్‌గా క్రేజ్.. కేజీయఫ్ సినిమాలతో ప్రశాంత్ నీల్ పేరు కూడా ఇంటర్నేషనల్ మార్కెట్‌లో వినిపించింది. అందుకే.. సలార్ సినిమాను ఇంగ్లీష్ భాషలోనూ విడుదల చేసేందుకు.. ఫిక్స్ అయ్యారు.
ఇంగ్లీష్ వర్షెన్‌లో మాత్రం చాలా మార్పులు చేర్పులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలుగు ఒరిజినల్ వర్షన్ కంటే ఇంగ్లీష్ వర్షెన్‌లో ఓ అర్దగంట నిడివి తక్కువగా ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ నిర్ణయం అయితే హాలీవుడ్ వరకు కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే హాలీవుడ్ ఆడియెన్స్‌కు పాటలు, కామెడీ ట్రాక్ అనేది సెట్ కాదు. సినిమా అంతా ఒకే మూడ్‌లో ఉండాలని కోరుకుంటారు. ఇండియాలో రిలీజ్ అయ్యే సినిమా మాత్రం పక్కా కమర్షియల్ మీటర్‌లో ఉంటుందని తెలుస్తోంది. మాస్ ఆడియెన్స్‌కు ఎలాంటి స్టఫ్ కావాలో అలానే సలార్ ఉంటుందని తెలుస్తోంది. అసలే ఈ సినిమా మీద హైప్స్ అంచనాలు మించి ఉన్నాయి.. బాహుబలి తరువాత మళ్లీ అసలు సిసలు మాస్ ఎంటర్టైనర్ ఇదే కావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ సైతం .. ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.