సమంతకు గుడి కట్టిన వీరాభిమాని…

సమంతకు గుడి కట్టిన వీరాభిమాని…

అభిమానానికి హద్దులు ఉండవనేది మనం చూస్తూనే ఉన్నాం , తన అభిన హీరో ఆర్ హీరోయిన్ ఒక్కసారైనా చూడాలి మాట్లాడని అని చాల మంది అనుకుంటారు , సాధారణంగా సినీ తారలను ఎవరైనా ఇష్టపడతారు. వారిపై అభిమానాన్ని పెంచుకుని అనేక రూపాల్లో దాన్ని ప్రదర్శిస్తుంటారు. ఐతే గుడికంటి దేవతల ఆరాధించటం అందరివల్ల కాదు కానీ ఎప్పుడు సమంతకు వీరాభిమాని అయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడు ఒకరు.. ఆమెకు గుడి కట్టించడం విశేషం.

ఐతే తమ ఫేవరెట్ హీరోయిన్లకు గుడి కట్టించే ట్రెండ్ తమిళనాడులో ఎక్కువ. ‘ఖుష్బు, నమిత, హన్సిక, నిధి అగర్వాల్’ వంటి తారలకు వారి వీరాభిమానులు గతంలో ఇలా చేశారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ , బాపట్ల జిల్లాకు చెందిన యువకుడు సైతం అభిమాన హీరోయిన్‌‌ సమంత కోసం తన ఇంటి ప్రాంగణంలోనే గుడి నిర్మించాడు. చుండూరు మండలం, ఆలపాడు గ్రామానికి చెందిన తెనాలి సందీప్ .. సమంతకు వీరాభిమాని . తనలో ఉన్న అభిమానాన్ని ప్రేమను మాటల్లో చెప్పలేక దేవతల తన హృదయంలో ఉన్న సమంతకు గుడి కట్టించాడు , ఇలా గుడికట్టించటానికి కారణం సమంత కేవలం హీరోయిన్ అవ్వటం వాళ్ళ మాత్రమే కాదట ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఆమె చేపట్టిన సేవా కార్యక్రమాల వాళ్ళ మరింత అభిమానం పెంచుకున్నాడు. చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ వారి ప్రాణాలు కాపాడుతున్న సామ్ కోసం ఏదో ఒకటి చేయాలని ఆలోచించి.. గుడి నిర్మాణానికి పూనుకున్నాడు.

ఇంటి ఆవరణలోనే ప్రత్యేకంగా కేటాయించిన స్థలంలో టెంపుల్ నిర్మించాడు సందీప్. ప్రస్తుతం ఆమె విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతుండగా.. ఈ నెల 28న గుడి ప్రారంభించనున్నట్లు తెలిపాడు. ఇదిలా ఉంటే ఈ నిర్మాణానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదే క్రమంలో కనిపించిన ఒక ఫ్లెక్సీ మరింత ఆకట్టుకుంది. ‘సమంత గారు మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్నందున తిరుపతి, చెన్నై, నాగపట్నం, కడప దర్గా దైవ క్షేత్రములకు మొక్కుబడి యాత్ర’ అని రాయించిన ఫ్లెక్సీని ఈ సందర్భంగా సందీప్ ప్రదర్శించాడు. ఇది అభిమానం అనాలా పిచ్చి అనాలా లేక పిచ్చి అభిమానం అనాలా , ఇప్పుడు సమంత విగ్రహానికి పూజలు చేసి రోజు ప్రసాదం పెడతాడా .. ఏది ఏమైనా హీరోయిన్స్ కి గుడి కట్టే కల్చర్ ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చేసింది.

సమంత విషయానికొస్తే.. ఆమె తాజా చిత్రంర ‘శాకుంతలం’ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. గుణశేఖర్ రూపొందిన ఈ మైథలాజికల్ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో గ్రాండ్ స్కేల్‌లో నిర్మించగా.. మేకర్స్‌కు నష్టాలను మిగిల్చింది. కాగా.. సామ్ ప్రస్తుతం హిందీలో ‘సిటడెల్’ వెబ్ సిరీస్ షూటింగ్‌లో పాల్గొంటోంది. రాజ్ అండ్ డీకే నిర్మిస్తున్న ఈ సిరీస్‌లో ఆమె వరుణ్ ధావన్‌తో కలిసి నటిస్తోంది. దీంతో పాటు రౌడీ హీరో విజయ్ దేవరకొండతో జంటగా ‘ఖుషి’ చిత్రంలోనూ నటిస్తోంది సామ్. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *