
ముచ్చటగా మూడో పెళ్లికి రెడీ అయినా అమీర్ ఖాన్ ..?
- EntertainmentMoviesNews
- May 30, 2023
- No Comment
- 23
ఆమీర్ ఖాన్ కమర్షియల్ సినిమాకు ఫుల్‌స్టాప్ పెట్టి…. కంటేంట్ ఉన్న కథల పైనే ఫోకస్ పెట్టాడు. బాక్సాఫీస్ రికార్డులు తిరగరాశాడు. ఈ మధ్య సరైన హిట్ లేక చాలా డల్ అయ్యాడు. థగ్స్ ఆఫ్ హిందూస్థాన్, లాల్ సింగ్ చెద్దాలు డిజాస్టర్స్ తరువాత కొత్త కథలు పైనే ఫోకస్ పెట్టాడు. బీటౌన్‌లో ఆమీర్ ఖాన్ ముచ్చటగా మూడోసారి పెళ్ళికి రెడీ అవుతున్నాడంటు గుసగుసలు వినిపిస్తున్నాయి. దంగల్‌లో ఆమీర్‌తో కలిసి తన పెద్ద కూతురుగా నటించిన ఫాతిమా సన షేక్‌తో రిలేషన్ షిప్‌లో ఉన్నాడంటు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
థగ్స్ ఆఫ్ హిందుస్థాన్‌లో కూడా ఫాతిమా ఆమీర్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. అప్పటీ నుంచి పార్టీలకు పలకరింపులకు ఈ ఇద్దరు కలిసి అటెండ్ అవ్వడంతో రూమార్స్‌కు మరింత బలంగా వినిపిస్తున్నాయి. ఈ బ్యూటీ ఎప్పుడు ముంబాయికి వచ్చిన ఆమీర్ ఇంట్లో ఉంటుందనే మాట కూడా వినిపిస్తుంది. ఇప్పుడు ఆమీర్ వయసు 58 ఏళ్ళు ఫాతిమా ఏజ్ 31..ఇద్దరి మధ్య గ్యాప్ దాదాపుగా 27 ఏళ్ళు ఉండటంతో.. కూతరు వయసు ఉన్న అమ్మాయిని పెళ్ళి చేసుకుంటున్నాడని నెట్టింట్లో బాగా ట్రోల్ చేస్తున్నారు.
రీనా దత్‌తో 2002లో విడిపోయాయిన ఆమీర్, కిరణ్‌రావ్‌ని పెళ్ళి చేసుకున్నాడు. 15 ఏళ్ళు కలిసి ఉన్న ఈ ఇద్దరు 2021లో డివోర్స్ తీసుకున్నారు. కిరణ్ ఫాతిమా కారణంగానే అమీర్ నుంచి విడిపోయిందని టాక్. రిసెంట్‌గా ఫాతిమా సన షేక్ ఆమీర్ ఇద్దరు పికిల్ బాల్ ఆడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానికి పైన ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ కమలర్ ఖాన్ ట్వీట్ చేశాడు. తన కూతురు వయసున్న అమ్మాయి ఫాతిమాని ముచ్చటగా మూడోసారి పెళ్ళి చేసుకోబోతున్నాడు.
ఇద్దరు చాలా రోజుల నుంచి డేటింగ్ లో ఉన్నారని అంటున్నాడు. ఆమీర్ కూతరు ఐరా ఖాన్ వయసు 26. నెక్ట్స్ తాను పెళ్ళి చేసుకోబోతున్న ఫాతిమా కూడా తన కూతరు వయసే ఉంటుందని ఆమీర్ ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయం పై ఆమీర్ కానీ ఫాతిమా సన షేక్ కానీ రియాక్ట్ అవ్వడం లేదు. ఈ మ్యాటర్‌లో నిజనిజాలు తెలియాలంటే వాళ్ళు రిస్పాండ్ అయితే కానీ క్లారీటి రాదు అంటున్నారు. ఈ వీడియో పై మీ కామెంట్‌ని కామెంట్ సెషన్‌లో పోస్ట్ చేయండి..