విజయవాడ అమ్మవారి  సన్నిధిలో అక్రమార్కుల తిష్ట..!

విజయవాడ అమ్మవారి సన్నిధిలో అక్రమార్కుల తిష్ట..!

బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం అక్రమార్కులకు నిలయంగా మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది మొదలు అమ్మవారి గుడిలో అవినీతి అనకొండలు తిష్ఠవేశాయి. ప్రభుత్వ పెద్దల సహాకారంతోనే అక్రమార్కులు దుర్గగుడిలో చెలరేగిపోతున్నారు. నాలుగేళ్లలో ఎనిమిది మంది ఈవోలను మార్చినా దుర్గ గుడిలో అవినీతిని మాత్రం కట్టడి చేయలేకపోయారు.

తాజాగా దుర్గగుడి అధికారి నగఏష్ ఇంట్లో ఏసీబీ అధికారులు గుట్టలు గుట్టలుగా నగదు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది. అసలు అమ్మవారి గుడిని మింగుతోన్న తిమింగలాలు ఎవరు? ఎవరి అండతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు.

బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి ఎంతో విశిష్ఠత ఉంది. సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వరస్వామి చెల్లెలుగా అమ్మవారు బెజవాడలో కొలువైఉన్నారు. దేశంలోనే అతి ముఖ్యమైన అమ్మవారి ఆలయాల్లో బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం ఒకటి. అయితే అమ్మవారి ఆలయంలో అక్రమార్కులకు నిలయంగా మారుతోంది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజయవాడ తూర్పు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కు దేవాదాయ శాఖ అప్పగించారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే అమ్మవారి ఊరేగింపు రథంలోని వెండి సింహాలను మాయం అయ్యాయి. నిత్యం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండాల్సిన దేవాలయంలో చోరీ జరిగిన రోజే సీసీ కెమేరాలు పనిచేయలేదు . అంటే వెండి సింహాల మాయం వెనుక ఇంటి దొంగలున్నారని స్పష్టం అవుతోంది. వెండి సింహాల దొంగతనం ఇంత వరకు తేల్చలేకపోవడం వైసీపీ ప్రభుత్వ ఘోర వైఫల్యంగా చెప్పవచ్చు.

భక్తుల మొక్కులు తీర్చే బెజవాడ దుర్గమ్మ ఆలయం నాలుగేళ్లుగా అవినీతి వార్తలతోనే ప్రచారంలోకి వస్తోంది. దేవాలయంలో టికెట్ల అమ్మకాల నుంచి ప్రసాదాల తయారీ వరకూ ఏ ఒక్కటీ వదలకుండా అక్రమార్కులు, ఆదాయ మార్గంగా మలచుకున్నారు. దుర్గగుడి అంతరాలయ దర్శనం టికెట్ 500 రూపాయలు చేశారు. అయినా అమ్మవారిని దగ్గరగా దర్శించుకోవాలని చాలా మంది టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. భక్తులకు ఇచ్చే టికెట్లు మరలా కౌంటర్లోకి తీసుకు వచ్చి వాటిని సర్కులేట్ చేయడం గతంలో పెద్ద వివాదానికి దారితీసింది.

ఇక విలువైన చీరలు కాజేయడంలో దుర్గగుడి సిబ్బంది, పాలక మండలికి మించిన వారు లేరని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అమ్మవారికి భక్తులు సమర్పించిన వేలాది రూపాయల విలువైన చీరలు మాయం చేయడం, లేదంటే అతి తక్కువ ధరకే కొట్టేయడంలో పాలకమండలి, అధికారులు ఆరితేరిపోయారనే కథనాలు పత్రికల్లో వస్తున్నాయి

బెజవాడ దుర్గగుడి ఆలయంలో అవినీతిపై అనేక ఆరోపణలు రావడంతో 2021లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆ తనిఖీలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. లడ్డు.. పులిహూర తయారీలోనూ అక్రమార్కులు బరితెగించారని ఏసీబీ అధికారులు గుర్తించారు. చీరల విక్రయాల్లోనూ అవకతవకలు వెలుగుచూశాయి. 2021లోనే 12 కోట్ల అవినీతి వెలుగులోకి రావడంతో 15 మంది దేవాలయ సిబ్బందిపై వేటు వేశారు.

అమ్మవారికి కానుకగా వచ్చే చీరలను ఆక్షన్ వేయాల్సిన అప్పటి ఈవో సురేష్ బాబు సొంత నిర్ణయాలు తీసుకుని అయిన వారికి అతి తక్కువ ధరకు కట్టబెట్టారని ఏసీబీ తనిఖీల్లో తేలడం కలకలం రేపింది. ఆ తరవాత అయినా పాలకమండలి, సిబ్బందిలో మార్పు రాకపోగా.. మరింత ఎక్కువ అయ్యిందనే విమర్శలు వస్తున్నాయి. అమ్మవారి ఆలయానికి కూతవేటు దూరంలో తాడేపల్లి ప్యాలెస్ లో ఉండే సీఎం జగన్ రెడ్డి ఏ మాత్రం పట్టించుకోకపోవడం వల్లే దుర్గగుడి పాలకమండలి, సిబ్బంది ఈ విధంగా చెలరేగిపోతున్నారని భక్తులు అభిప్రాయపడుతున్నారు.

తాజాగా దుర్గగుడి వివాదం సీఎం జగన్ రెడ్డి వద్దకు చేరింది. ఈవోపై దుర్గగుడి ఛైర్మన్ కర్నాటి రాంబాబు ఫిర్యాదు చేయడం వివాదానికి దారితీసింది. గుడిలో అవకతవకలు జరిగితే దేవాదాయశాఖా మంత్రిగా తనకు ఫిర్యాదు చేయాలని.. అంతా తామే అన్నట్టుగా వ్యవహరించడం సరికాదని ఆ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించటం వివాదాస్పదం అవుతోంది. ఈవో కు.. మంత్రి కొట్టు సత్యనారాయణ అండదండలు ఉన్నాయని.. అవినీతి సొమ్ము పంచుకునే విషయంలో ఈవోకు, పాలకమండలి ఛైర్మన్ కు తేడాలు వచ్చాయని అందుకే రోడ్డున పడ్డారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నగేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు కట్టలు కట్టలు అవినీతి సొమ్మును పట్టుకున్నారు.

ఈ వ్యవహారంలో ఈవో ఏసీబీ అధికారుల తనిఖీలనే తప్పు పట్టటం కొసమెరుపు. ఏసీబీ అధికారులు ఎన్నిసార్లు దాడులు చేసి అవినీతికి పాల్పడుతున్న సిబ్బందిని సస్పెండ్ చేసినా వారి తీరు మార్చుకోవడం లేదు. దేవాలయంలో అవినీతిపై మంత్రిని కాదని సీఎంకు ఫిర్యాదు చేసినా, చివరకు పంచాయతీ తన వద్దకే వస్తుందంటూ దేవాదాయశాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

రాష్ట్రంలోనే నాలుగు ప్రముఖ దేవాలయాల్లో ఒకటిగా వెలుగోందుతోన్న బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అవినీతి చీడపురుగులు చేరాయి. వీటిని నివారించాల్సిన పెద్దలు పట్టించుకోక పోవడంతో వారు మరింత పేట్రేగిపోతున్నారు. భక్తులకు సౌకర్యాల పేరుతో కోట్ల రూపాయలు అవినీతి జరుగుతున్నా పట్టించుకునే దిక్కు లేదు. నాలుగేళ్లుగా దుర్గగుడిలో ఏదొక అవినీతి కుంభకోణాలతో పాలకమండలి, అధికారులు రచ్చకెక్కడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *