విరూపాక్షతో లైఫ్ టర్నింగ్

విరూపాక్షతో లైఫ్ టర్నింగ్

కష్టపడ్డవాడు.. ఎప్పటికైనా .. జీవితంలో రాణిస్తాడనేది పెద్దల మాట. కానీ.. ఆ కష్టానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. కొందరైతే.. అనుకున్న లక్ష్యం చేరేవరకు శ్రమిస్తూనే ఉంటారు. ఆ కోవలోకి చెందినవాడే.. బుల్లి తెర స్టార్ హీరో రవికృష్ణ. బుల్లితెర నటుడిగా ఎన్నో సీరియల్స్ లో నటిస్తూ.. అందరినీ మెప్పిస్తూ.. ఇంటిల్లీపాదిని ఆకట్టుకుంటూ.. బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేసే రవికృష్ణ.. పడిన కష్టం అంతాఇంతా కాదు. విజయవాడకు చెందిన రవికృష్ణ .. తండ్రి ఆర్టీసీ ఉద్యోగి.. తల్లి గృహిణి.. డిగ్రీ వరకు విజయవాడలోనే చదివిన రవికృష్ణ.. ఆతర్వాత..చెన్నై వెళ్లి సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు. హీరోగా తొలినాళ్లలో పెద్ద అవకాశాలేమీ రాలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. కలసి రాకపోవడంతో.. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏదీ.. ఏదైనా మనం ఎంచుకున్న ఫీల్డ్ లో .. నెగ్గుకు రావాలంటే.. టాలెంట్ మాత్రమే కాదు అదృష్టం కూడా ఉండాలని చాలా మంది చెబుతుంటారు. అక్షరాలా.. రవికృష్ణ కెరీర్ లో కూడా అదే జరిగింది.

తెలుగు ఇండస్ట్రీ తొలినాళ్లలో అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం అందుకున్నారు. ఆ తర్వాత.. రవి కృష్ణకు విజేత, బొమ్మరిల్లు, వరూధిని పరిణయం వంటి సీరియల్స్ లో నటించారు. అయితే మొగలిరేకులు సీరియల్ మంచి హిట్ అందించింది. ఆ సీరియల్ లో నటించిన చాలా మంది నటీనటులు.. ఇప్పుడు కెరీర్ ముగిసిపోయి ఎక్కడెక్కడో ఉన్నారు. కానీ ఆ సీరియల్ లో నటించిన .. రవికృష్ణ.. ఎప్పటికప్పుడు.. తన రేంజ్ ను పెంచుకుంటూ వెళ్లారు. ఇప్పటికి అలాగే మన ముందు .. ఏదో ఒక సీరియల్ లో కనిపిస్తూనే ఉంటాడు. మొగిలి రేకులు సీరియల్ ఘన విజయం సాధించడంతో.. అనేక సీరియల్స్ లో రవికృష్ణకు చాలా అవకాశాలు వెంట వెంటనే వచ్చేశాయి.

ఎన్నో సీరియల్స్ లో నటించిన రాని గుర్తింపు మాత్రం .. అతడికి మొట్ట మొదటిసారి బిగ్ బాస్ రూపం లో వచ్చింది. బిగ్ బాస్ షో లో పాల్గొన్న తర్వాత .. రవికృష్ణ కెరీర్ మాత్రం అమాంతం టాప్ గేర్ లో పడింది. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చి.. మళ్లి అవే రొటీన్ సీరియల్స్ లో నటించడం ఇష్టం లేక కొన్ని రియాలిటీ షో లలో.. పండగ స్పెషల్ ఎపిసోడ్స్ లో కనిపిస్తూ వచ్చాడు. అలా మూడేళ్ల సమయం గడిచిపోయింది. కాని లైఫ్ బోర్ కొడుతున్న సమయంలో.. ఇన్నేళ్ల అతని కష్టానికి ప్రతిఫలం దక్కింది. బుల్లి తెర స్టార్ హీరో.. రవి కృష్ణకు విరూపాక్ష సినిమాలో.. దర్శకుడు కార్తీక్ దండు.. తొలి అవకాశం కల్పించారు.

మొదటిసారి వెండితెరపై విరుపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా మొదటి సినిమాతో అద్భుతమైన నటన కనబరిచి .. సినీ పరిశ్రమ పెద్దల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకున్నారు. ఇలా ఈ సినిమా ద్వారా తన సత్తా ఏంటో నిరూపించుకొని .. నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకున్నారు. విరూపాక్ష సినిమాలో తన పాత్రకు వస్తున్న ఆదరణ చూసి.. రవికృష్ణ ఎంతో సంతోషపడ్డారు. విరూపాక్ష మంచి సక్సెస్ సాధించడం తో హీరో సాయిధరమ్ తేజ్, సంయుక్త తర్వాత.. మంచి పేరు దక్కించుకున్న పాత్రగా రవికృష్ణ పాత్ర వుంది. ఇక ఈ చిత్రం థియేటర్స్ లో మంచి వసూళ్లను సాధిస్తూండటంతో.. ప్రస్తుతం చాల మంది నిర్మాతలు రవి కృష్ణ డేట్స్ కోసం అడుగుతున్నారు.ఇలా ఒక్క పాత్ర అతడి జీవితాన్ని మంచి టర్న్ తీసుకునేలా చేసింది. దీంతో రవికృష్ణ కెరియర్ మలుపు తిరిగి.. తెలుగు సినీ ఇండస్ట్రీలో బిజీగా మారారు. ఏ నటుడికి అయినా కావాల్సింది ఇలాంటి ఒక క్యారెక్టర్ మాత్రమే. అలా అదృష్టం వెన్ను తట్టినప్పుడు.. ఇలా సద్వినియోగం చేసుకుంటే.. ఇదిగో జీవితం.. రవికృష్ణలా ఉంటుంది. విరూపాక్ష తర్వాత .. రవికృష్ణ కెరీర్ కూడా .. మరో హైరేంజ్ లో ఉండాలని ఆశిద్దాం.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *