కృతిసనన్.. కొండపై ఆ పనేంటి ?

కృతిసనన్.. కొండపై ఆ పనేంటి ?

తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఆ కార్యక్రమం ముగిశాక చిత్రబృందం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అనంతరం గుడి బయట జరిగిన ఓసంఘటన వివాదాస్పదంగా మారింది. దర్శకుడు ఓం రౌత్, కృతిసనన్ కి హగ్ ఇవ్వడంతో పాటు కిస్ చేయడం దుమారం రేపుతోంది. కొండపై ఆ ముద్దులు, కౌగిలి ఏంటా రాజా అంటూ డైరెక్టర్, హీరోయిన్ పై మండిపడుతున్నారు భక్తులు. ఓం రౌత్ తిరుమల శ్రీవారి సన్నిధిలో చేసిన పనిపై హిందూత్వ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఓం రౌత్ తీరును కొన్ని ధార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, బిజెపి నేతలు, ఆర్‌ఎస్ఎస్ కార్యకర్తలు, శ్రీవారి భక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శ్రీవారి సన్నిధిలో ఇలాంటి పనులు చేయకూడదు. సీతమ్మ తల్లి పాత్ర వేసిన నటికి స్లీవ్‌ లెస్‌ జాకెట్ వేశారు. దర్శకుడికి ఆ మాత్రం ఆలోచన లేదా?’’ అంటూ మరికొందరు తిట్టిపోస్తున్నారు.

తిరుమల ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం. టూరింగ్ స్పాట్, పిక్‌నిక్ స్పాట్, షూటింగ్ స్పాట్ లలో వ్యవహరించడం తగదు. కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి. సాక్షాత్తూ ఆయన అర్చన సేవలో పాల్గొని, ఇలాంటి వెకిలి చేష్టలు చేయడమేంటని బిజెపి నేత భాను ప్రకాశ్ రెడ్డి ఫైర్ అయ్యారు. అసలు వారిది భక్తి కాదు.. భక్తిని అమ్ముకోవడమే వారి పని అనేలా ఆదిపురుష్ టీమ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *