
ఆదిపురుష్ మూవీ రివ్యూ
- EntertainmentMoviesNews
- June 16, 2023
- No Comment
- 25
నటీనటులు : ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్త, సోనాల్ చౌహన్, తృప్తి తోరదమల్ తదితరులు.
దర్శకుడు : ఓం రౌత్
నిర్మాత : భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్
సంగీతం : సంచిత బల్హారా, అంకిత్ బల్హారా
పాటలు : అజయ్-అతుల్, సాఛేత్ పరంపర
మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘ఆదిపురుష్’ మూవీ వరల్డ్‌వైడ్‌గా నేడు భారీ స్థాయిలో రిలీజైంది. శ్రీరామ చంద్రుడిగా ప్రభాస్, సీతమ్మ గా కృతి సనన్ నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. టి సిరీస్ బ్యానర్‌పై ఓం రౌత్ దర్శకత్వంలో భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా 9000కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కడ చూసినా ‘ఆదిపురుష్’ హడావుడి కనిపిస్తుంది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. మరి ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ :
దశరథ మహారాజు వృద్ధాప్యం రావడంతో తన పెద్ద కొడుకు శ్రీ రాఘవుడు (ప్రభాస్ ) కు అయోధ్య నగర మహారాజుగా పట్టాభిషేకం చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. అయితే దానికి రాఘవుడు సవతి తల్లి కైకేయి ఒప్పుకోదు. తన కుమారుడు భరతునికి పట్టాభిషేకం చేయాలని అంతేకాదు రాఘవుడుని 14 సంవత్సరాలు వనవాసం చేయాలని పట్టుబడుతుంది కైకేయి దానితో శ్రీ రాఘవుడు(ప్రభాస్) , సీత (కృతి సనన్), లక్ష్మణుడు (సన్నీ సింగ్)తో కలిసి వనవాసానికి వెళతాడు. వనవాసానికి వెళ్లిన రాముడు ని చూసిన సూర్పణఖ మనసు పారేసుకుంటుంది. తన భర్తగా ఆహ్వానిస్తుంది. దానికి శ్రీ రాముడు ‘నేను వివాహితుడిని. క్షమించండి’ అని వెళ్ళిపోతాడు. దానికి ఎలాగైనా సీతను చంపాలని విఫల యత్నం చేస్తుంది. ఆ సమయమం లో సూర్పణఖ (తృప్తి) ముక్కుకు లక్ష్మణుడు వేసిన బాణం తగులుతుంది. ఆ అవమానంతో లంకకు వెళ్లిన సూర్పణఖ అన్నయ్య అయిన లంకేశుడు (సైఫ్ అలీ ఖాన్) దగ్గర సీత అందం గురించి గొప్పగా వర్ణిస్తుంది. సాధువు వేషధారణలో వెళ్లిన లంకేశుడు… సీతను అపహరించి లంకకు తీసుకొస్తారు. సీతని తీసుకు రావటానికి వానర సైన్యంతో కలిసి రాముడు చేసిన యుద్ధం ఎలా ఉంది? ఆ తర్వాత ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ:
రామయణం వెండితెరపై మనం చాలాసార్లు చూసాం. మరి కొత్తగా మళ్ళీ ఎందుకు చూడాలి అంటే… ఫస్ట్ రీజన్ ప్రభాస్. డ్లారింగ్ కట్ అవుట్‌కి ఇలాంటి పాత్రలు బాగా సెట్ అవుతాయి. ఎప్పటి లాగే రెబల్ స్టార్ట్ చాలా సాఫ్ట్ గా కూల్‌గా రాఘవుడుగా అదరగొట్టాడు. సీతగా నటించిన కృతిసనన్ చాలా బాగుంది. ప్రభాస్ కృతి మధ్య ఇంకొన్ని సీన్స్ ఉంటే బాగుండు అన్న ఫీల్ కలిగింది. రామయణం కథ అందరికి తెలుసు కాబట్టి రెగ్యూలర్‌గా కాకుండా కొంచెం కమర్షియల్ టచ్ ఇచ్చి ఇతిహాసాని మొదలు పెట్టాడు. టైటిల్స్ పడేటప్పుడే కైకేయి రాముడు అరణ్యవాసం వెళ్ళమని అడగడం.. అడువులకి వెళ్ళడం జరిగిపోయింది. వనవాస ఘట్టం నుంచి సినిమా మొదలౌతుంది.
కమర్షియల్ యాంగిల్‌లో రాఘవుడుకు ఓ ఇంట్రో సీన్… తరువాత ఓ పాట రావణుడుకి కూడా ఓ ఇంట్రో సీన్ ఇలా ఫార్మలా మూవీలా ప్లాన్ చేశాడు ఓం రానౌత్. రావణుడుగా సైఫ్ అలీఖాన్ చేశాడు. సినిమాలో కాస్త ఇబ్బంది కలిగించిన క్యారెక్టర్ కూడా ఇదే. రాక్షససంతకి చెందిన వాడు అన్న విషయం కోసం మరి దేనికో తెలియదు గాని రావణుడు గెటప్ అంతగా సెట్ అయిన ఫిల్ లేదు.. హలీవుడ్ మూవీ సెటప్‌లా ట్రై చేశాడు అది ఆర్టిఫిషియల్‌గా ఉన్నాయి. పదితలల రావణుడు ఎప్పుడు మనం చూసే విధంగా కాకుండా కొత్తగా ట్రై చేశారు డైరెక్టర్ అది బెడిసికొట్టిందనే చెప్పాలి. అజయ్ అతుల్, అండ్ సంచిత్, అంకిత్ బల్హార్స్, ఇచ్చిన మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ సినిమాకు బాగా ప్లేస్ అనే చెప్పాలి.
ఫస్టాఫ్ అంతా యాక్షన్ అండ్ ఎమోషనల్ సీన్‌తో సినిమా చకచక నడిచిపోయాయి. రావణుడు శివుడుకు పూజా చేస్తున్న ఎంట్రీ సీన్, సీత కోసం జఠాయువు వచ్చే సీన్స్ ఎంగేజింగా అనిపిస్తాయి. కానీ సెకండ్ ఆఫ్ మొత్తం వార్ కోసం వాదిలేయడంతో సినిమా సాగుతున్నట్లు అనిపిస్తుంది. గ్రాఫిక్స్ మరి అంత గొప్పగా లేవు అలా అని వరెస్ట్‌గా లేవు. ఒకే అనిపిస్తాయి తప్ప ఎక్సస్టీమ్‌గా లేవు. కొన్ని వార్ ఎపిసోడ్స్‌లో వానరులు ఫైటింగ్ సీన్ అవి అంత గొప్పగా ఉండవు. సినిమాలో భజరంగా క్యారెక్టర్ ఒకటి ఒన్ ఆప్ ది హైలెట్. ఆదిపురుష్ ప్రధాన మైనస్ పాయింట్ అంటే కథనమే. అలాగే సినిమాలో పాత్రల గెటప్ లు అండ్ సెటప్ కూడా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కావు. దర్శకుడు ఓం రౌత్ 3డి విజువల్స్ మీద పెట్టినంత ఫోకస్ స్టొరీ అండ్ స్క్రీన్ ప్లే పెడితే ఇంకా మంచి అవుట్ కామ్ వచ్చేది.
ఓరల్‌గా సినిమా ఒకే అవరేజ్ మూవీ.. ఈ మధ్యకాలంలో మైథాలాజీ స్టోరి రాలేదు. ఓసారి చూడోచ్చు. అంతేకాదు ఈ మూవీ 3డి చూస్తే కొంచెం ఏగ్జైటింగ్‌గా ఫీల్ అవుతారు. రామయణం మనకు తెలిసిన టెక్నాలజీతో కొత్తగా చెప్పే ప్రయత్నం బాగుంది. అవెంజర్స్ టాక్ రావడానికి రావణుడు కోట, వానరులు యుద్ధం చేసే విజువుల్స్ కాస్త మార్వేల్ సీరిస్‌లో చూసినట్లు అనిపిస్తుంది. పిల్లలకు ఈ మూవీ బాగా నచ్చుతుంది.
చివరగా : పిల్లల రామాయణం
రేటింగ్ – 2.25/5