యువనేతను కలిసిన ఆదోని బైపాస్ రోడ్డు బాధితులు

యువనేతను కలిసిన ఆదోని బైపాస్ రోడ్డు బాధితులు

ఆదోని బైపాస్ రోడ్డు బాధితులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

నేషనల్ హైవే 167 లో భాగంగా ప్రతిపాదించిన ఆదోని బైపాస్ రోడ్డు ఎలైన్ మెంట్ -2 ఆదోని పట్టణ మాస్టర్ ప్లాన్ కు విరుద్దమైనది.

దీనివల్ల 40సంవత్సరాల క్రితం ఆమోదించిన లేఅవుట్లు, ఆవాసాలు దెబ్బతిని, 40 ఏళ్లనుంచి ఉంటున్న 400 కుటుంబాలను ప్రభావితం చేస్తుంది.

కేవలం కొద్దిపాటి వ్యవసాయ భూములు మాత్రమే ప్రభావితమయ్యే ఎలైన్ మెంట్ -3ని పరిగణనలోకి తీసుకొని బైపాస్ రోడ్డు నిర్మాణం చేయాలి.

స్థానిక ఎమ్మెల్యే, ఆయన మనుషులకు చెందిన భూములకు విలువ పెంచుకునేందుకు, ఆభూములకు సమీపం గుండా జాతీయరహదారి వెళ్లేలా ఎలైన్ మార్పులు చేస్తున్నారు.

ఆదోని పట్టణంలో 4దశాబ్ధాలుగా నివసించే ప్రజలకు నష్టం జరగకుండా ఎలైన్ మెంట్ -3 ప్రకారం బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలి.

యువనేత నారా లోకేష్ స్పందిస్తూ…

వైసిపి నేతలు వారి స్వార్థం కోసం ఎన్ని వందలమంది ప్రయోజనాలైనా దెబ్బతీయడానికి వెనకాడటం లేదు.

ఎమ్మెల్యే, ఆయన అనుచరుల భూములు రేట్లు పెంచుకునేందుకు ప్రజలను ఇబ్బంది పెట్టడం దారుణం.

అదోని మాస్టర్ ప్లాన్ కు విరుద్దంగా ఎలైన్ మెంట్ మార్పుపై హైవే అథారిటీకి లేఖరాస్తాం.

ఆదోని బైపాస్ రోడ్డు బాధితులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా నిలుస్తాం.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *