
ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ తింటున్నారా..? అయితే మీ ప్రాణాలు గోవిందా..!!
- News
- May 8, 2023
- No Comment
- 27
మీరు డైలీ కూరల్లో అల్లం, వెల్లుల్లి పేస్ట్ వాడుతున్నారా..? నాన్ వెజ్ కర్రీల్లో మంచి టేస్ట్ కోసం.. కిరాణా షాపు నుంచి ఏదో ఒక అల్లం వెల్లుల్లి ప్యాకెట్ కొని తెచ్చుకుంటున్నారా..? అయితే ఒక్కసారి ఆగండి..! మీరు కొన్న అల్లం వెల్లుల్లి పేస్ట్.. మీ ఆరోగ్యానికి ముప్పు తీసుకు రావచ్చు… మీ టైమ్ బాగోలేక పోతే.. మీ ప్రాణాలను కూడా తీసేయొచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటి..? ప్రాణాలు తీయటం ఏంటి..? అనుకుంటున్నారా…?
ఈరోజుల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా ఏ కూరలూ వండలేని పరిస్థితి. సో.. మార్కెట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రముఖ కంపెనీలు అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నా.. వాటి రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. దీంతో.. తక్కువ రేటులో దొరికే అల్లం వెల్లుల్లి పేస్ట్ వైపే వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. సరిగ్గా ఈ పాయింటే.. కల్తీరాయుళ్ల పంట పండిస్తోంది. కుళ్ళిపోయిన అల్లం.. నాశిరకం వెల్లుల్లితో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి.. సొమ్ము చేసుకుంటున్నారు.
అల్లం వెల్లుల్లి పేస్ట్ ముసుగులో.. కాలకూట గరళాన్ని మించిన విషాన్ని తయారు చేసి.. ప్రజల ఆరోగ్యాలను గుల్ల చేస్తున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తో పాటు రెండు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో ఈ నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ దందా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఆరోగ్య శాఖ అధికారుల తనిఖీలు లేకపోవటంతో.. ఈ నకిలీ భాగోతం. మూడు ప్యాకెట్లు.. ఆరు బాటిళ్ళు అన్న చందంగా సాగుతోంది.
యాంకర్3:
ఇక.. హైదరాబాద్ కాటేదాన్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నారన్న సమాచారంతో.. ఎస్‌ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో కళ్ళు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగు చూశాయి. అక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు అవుతున్న తీరు చూస్తే.. ఎవరికైనా కడుపులో తిప్పేస్తుంది. అలా ఉంది అక్కడ పరిస్తితి. మొత్తం కుళ్ళిపోయిన అల్లం వెల్లుల్లితో డబ్బాలకు డబ్బాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నారు. వీటి తయారీకి మురుగు నీటిని వినియోగిస్తున్నారు.
ఎక్కువ రోజులు నిలువ ఉండటానికి ఎసిటిక్ యాసిడ్‌తొ పాటు ప్రమాదకరమైన రసాయనాలను వాడుతున్నారు. అసలే కుళ్ళిన స్థితిలోఉన్న అల్లం, వెల్లుల్లిపాయలను కనీసం పొట్టు కూడా తీయకుండా..ఈ దుర్మార్గులు పేస్ట్ గా చేసి అమ్మేస్తున్నారంటే.. ప్రజల ప్రాణాలకు ఎంత హాని చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. కాటేదాన్ లో తయారు అవుతున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్.. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలకు వెళుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
కాటేదాన్‌లో కుళ్ళిన అల్లం,వెల్లుల్లితో తయారౌతున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తింటే.. ఆరోగ్యాలు పోవటం ఖాయమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి కల్తీగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు.. కాటేదాన్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో కల్తీ అల్లం తయారు చేస్తున్న ముఠాను అరెస్టు చేసిన పోలీసులు.. ఇటువంటి వారి కదలికలపై సమాచారం ఉంటే ఇవ్వాలని కోరుతున్నారు.