
ఏజెంట్ దెబ్బకు పొన్నియిన్ 2… నిలిచేనా ?
- EntertainmentMoviesNews
- April 25, 2023
- No Comment
- 33
అక్కినేని ప్రిన్స్ అఖిల్ హీరోగా రూపొందిన ‘ఏజెంట్’ చిత్రం ఎట్టకేలకి ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. అదే రోజున మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియిన్ సెల్వన్ 2 కూడా విడుదల కాబోతుంది. తమిళనాట పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాకు అంతా సైడ్ అయ్యి మరీ రూట్ క్లియర్ చేశారు. కానీ ఇతర భాషల్లో పొన్నియిన్ సెల్వన్ 2 కి అంత బజ్ క్రియేట్ కాలేదు.
ఇదిలా ఉంటె పొన్నియన్ సెల్వన్ 1 తెలుగు రాష్ట్రాల్లో మినిమం కలెక్షన్స్ ను కూడా రాబట్టలేకపోయింది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా లేదనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. మొదటి పార్ట్ నిరాశ పరిచినా కూడా తెలుగు రాష్ట్రాల్లో పార్ట్ 2 యొక్క పబ్లిసిటీ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఏజెంట్ సినిమాకు ఇప్పటివరకు అఖిల్ కెరియర్ లోనే బారి బడ్జెట్ మూవీ కావటం తో కథ బాగా వచ్చింది కాబట్టే అంత బడ్జెట్ పెట్టాం అని నిర్మాతలు చెప్తున్నారు ఒకవేళ ఏజెంట్ మూవీ కి పాజిటివ్ టాక్ వస్తే పొన్నియిన్ సెల్వన్ ను జనాలు పట్టించుకునే అవకాశాలు లేవు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఏజెంట్ సినిమాను ఏకంగా రూ.80 కోట్ల బడ్జెట్ తో రూపొందించినట్లుగా మేకర్స్ చెబుతున్నారు. ట్రైలర్ విడుదల తర్వాత ఏజెంట్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ప్రమోషన్ కార్యక్రమాలు కాస్త ఆలస్యంగా మొదలు పెట్టినా కూడా విడుదల సమయంకు అన్ని వర్గాల దృష్టిని ఏజెంట్ ఆకర్షించాడు అనడంలో సందేహం లేదు.
అఖిల్ ఇప్పటి వరకు కమర్షియల్ సక్సెస్ దక్కించుకోలేదు. ఈ సినిమా తో అఖిల్ ఆ లోటును భర్తీ చేస్తాడని అభిమానులు చాలా నమ్మకంగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో పొన్నియిన్ సెల్వన్ 2 వల్ల ఏమైనా సమస్య క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏజెంట్ సినిమా ఏమాత్రం పాజిటివ్ టాక్ దక్కించుకున్నా కూడా వార్ వన్ సైడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పొన్నియిన్ సెల్వన్ 2 కి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఏజెంట్ వైపు ప్రేక్షకులు ఆకర్షితులు అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ టాలీవుడ్ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఏజెంట్ సినిమాకు పాజిటివ్ టాక్ రావాలని ఇప్పటికైనా అఖిల్ కి మంచి బ్లాక్ బస్టర్ పడాలని ఫిలిం నగర్ టాక్ నడుస్తుంది..