
వివేకా హత్య గురించి అందరికన్నా జగన్ రెడ్డికి ముందే తెలుసు..!
- Ap political StoryNewsPolitics
- May 18, 2023
- No Comment
- 24
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా హత్య జరిగిన రోజు తెల్లవారు ఝామున.. ఆయన మరణ వార్తను.. జగన్ మోహన్ రెడ్డి తనకు చెప్పారంటూ.. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం వెల్లడించారు. ఇటీవల అంత:పుర రహస్యం అంటూ వచ్చిన కథనాల నేపథ్యంలో అజయ్ కల్లాం ప్రెస్‌మీట్ పెట్టి మరీ వివరణ ఇచ్చుకున్నారు.
ఆరోజు తనతో పాటు.. జగన్ వ్యక్తిగత కార్యదర్శి కృష్ణ మోహన్ రెడ్డి, దువ్వూరు కృష్ణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నారని ఆయన ఒప్పుకున్నారు. అయితే.. వివేకా మరణం గురించి తెల్లవారు ఝామునే జగన్ తమకు చెప్పారన్న అజయ్ కల్లాం.. టైమ్ మాత్రం గుర్తు లేదని చెప్పటం గమనార్హం. దీనికి సంబంధించి సీబీఐ అధికారులు తనను ప్రశ్నించిన విషయం కూడా వాస్తవమే అని ఆయన అంగీకరించారు.
తనతో ఆరోజు ఉన్న మిగిలిన వారిని సీబీఐ విచారించిందో లేదో తనకు తెలియదని కల్లాం చెప్పుకొచ్చారు. ఇక.. వివేకా హత్య జరిగిన రోజు తెల్లవారుఝామునే ఆయన మరణం గురించి జగన్ స్వయంగా చెప్పారని అజయ్ కల్లాం చెప్పటంతో.. వివేకా మరణ సమాచారం అందరికన్నా ముందే జగన్ కు తెలిసిందనే విషయం స్పష్టం అవుతోంది. మరి గొడ్డలి పోటును గుండెపోటుగా జగన్ అండ్ కో ఎందుకు చెప్పారు..? అనేది తేలాల్సి ఉంది.
మొత్తం మీద.. ఆ నలుగురులో ఒకరైన అజయ్ కల్లాం బయటకు వచ్చి సంచలన విషయాలు చెప్పటంతో.. వివేకా హత్య కేసులో కీలక పరి