అక్కినేని అఖిల్ కెరీర్ కు దారేది..

అక్కినేని అఖిల్ కెరీర్ కు దారేది..

హిట్‌ సినిమా మానియా నుంచి డైరెక్టర్లు బయటకు రాలేకపోతున్నారా… అప్పట్లో పూరిని పోకిరి వెంటాడినట్లు… ఇప్పుడు సురేందర్‌ రెడ్డిని వెంటాడుతున్న.. సినిమా ఏంటీ? వక్కంతం వంశీ కథలో పవర్‌ లేదా.. లేక డైరెక్టర్‌లో పస తగ్గిందా? ఏజెంట్‌ ఫెయిల్యూర్‌ ఎవరికి తలనొప్పిగా మారింది? అఖిల్‌ కెరీర్‌ డైలామాలో పడిందా? మాస్ యాక్షన్‌ ఇమేజ్‌కు అక్కినేని ఫ్యామిలీ టాటా చెప్పాలా?

సురేందర్‌ రెడ్డి .. స్టైలీష్ టేకింగ్‌ అండ్‌ స్క్రీన్‌ ప్లే కు కేరాఫ్‌ అడ్రస్‌. టాలీవుడ్‌కు సూపర్‌ డూపర్‌ హిట్స్‌ ఈ డైరెక్టర్‌ ఈ మధ్య కాస్త వెనుక పడ్డారనే చెప్పాలి. 2016 ధృవ తరువాత హిట్‌ సురేందర్‌ ఖాతాలో హిట్‌ పడలేదు. మెగాస్టార్‌తో మెగా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఊయ్యాలవాడ నరసింహ రెడ్డి స్టోరీని సైరాగా పాన్‌ ఇండియా రేంజ్‌ లో తెరక్కెకించాడు. ధృవ టేకింగ్‌ చూసి ఫిదా అయిన చరణ్‌ మెగా ప్రెస్టేజియస్‌ మూవీ సురేందర్‌ చేతిలో పెట్టాడు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర ఘోర పరాజయం చవిచూసింది. నిర్మాత చరణ్‌కు అంతులేని నష్టాలు మిగిల్చింది.

2021లో హాలీవుడ్‌ సిరీస్ ఆధారంగా అక్కినేని హీరోకు మాస్‌ ఇమేజ్‌ ఇవ్వడానికి అఖిల్‌ని ఏజెంట్‌ మార్చాడు. రీసెంట్ గా రిలీజ్‌ అయిన సినిమా చూసి పబ్లిక్‌ పరేషాన్‌ అవుతున్నారు. తలాతోక లేని కథలకు కోట్లు ఖర్చుపెట్టి నిర్మాత నష్టాలు పాలు చేస్తున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. సురేందర్‌ రెడ్డికి ధృవ కిక్‌ ఇంకా తగ్గలేదని సెటైర్లు వేస్తున్నారు. ఏజెంట్‌లో కూడా చాలా వరకు ధృవ ఛాయలు కనిపించాయి అంటున్నారు.

రీసెంట్‌గా రిలీజ్‌ అయిన ఏజెంట్‌ బాక్సాఫీస్‌ దగ్గర ఘోరంగా ఫెయిల్‌ అయిందని సినీ వర్గాలు అంటున్నాయి. ఏజెంట్‌తో అక్కినేని ఫ్యామిలీకి.. మాస్‌ ఇమేజ్ వస్తుందని అభిమానులు ఫీల్ అయ్యారు. కానీ వాళ్ళ ఆశలు అడియాశలు అయ్యాయి. రొటీన్‌ యాక్షన్‌ డ్రామకు మెరుగులు అద్దడంలో .. డైరెక్టర్‌ ఫెయిలైయ్యాడని అంటున్నారు. అఖిల్‌ లుక్‌ మార్చి బాడి పుటాప్‌ చేసి… మైండ్‌ బ్లాక్‌ చేశాడు. అదే ఎఫర్ట్ కథ వినడంలో పెట్టి.. మంచి స్టోరీ సెలెక్ట్‌ చేసుకుంటే బాగుంటుందని అంటున్నారు. కలిసిరాని మాస్‌ యాక్షన్‌ ఫార్మూలాతో చేతులు కాల్చుకోవడంకంటే.. అక్కినేని లవర్‌ బాయ్‌ ఇమేజ్ నమ్ముకోవడం బెటర్‌ అని అంటున్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *