అఖిల్ అక్కినేని..  ఏజెంట్  అప్డేట్

అఖిల్ అక్కినేని.. ఏజెంట్ అప్డేట్

ఏజెంట్ ఏజెంట్ ఏజెంట్ ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్న మూవీ, అఖిల్ అక్కినేని నుంచి త్వరలో రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఏజెంట్. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాను ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు హిప్ హాప్ తమిళ మ్యూజిక్ అందించారు.

ఇప్పటివరకు చాల రిలీజ్ డేట్స్ మారాయి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుండి ఈ ఏజెంట్ షూటింగ్ చేస్తూనే ఉన్నాడు , ఫైనలా గా ఇప్పుడు ఏప్రిల్ 28న రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమాకు ఇంకా ఒక సాంగ్ పెండింగ్ ఉంది. అయినా సరే సాంగ్ పూర్తి చేసి అనుకున్న డేట్ కి రిలీజ్ చేయాలని చూస్తున్నారు చిత్ర యూనిట్. సినిమా 2021 డిసెంబర్ లో రిలీజ్ అనుకోగా దాదాపు రెండేళ్ల పాటు సినిమా వాయిదా పడుతూ వచ్చింది.

నేడు అఖిల్ బర్త్ డే సందర్భంగా ఈరోజు నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా స్టార్ యాంకర్ సుమ ఏజెంట్ అఖిల్ తో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. సినిమా ఏజెంట్ హై యాక్షన్ ఎలిమెంట్స్ తో వస్తుందని చెప్పారు తప్ప సినిమాకు సంబంధించి ఎలాంటి హింట్స్ ఇవ్వలేదు. కానీ ఏజెంట్ అంటే మనకి తెలిసింది జేమ్స్ బాండ్ తరహాలో యాక్షన్ ఉంటుంది అని.

ఇక ఈ సినిమా కోసం అఖిల్ ఉప్పు కారం మసాలాలు ఆయిల్ ఇలా లేకుండా కంప్లీట్ గా డైట్ పాటించాడట. మొదటి 3 నెలలు కొద్దిగా కష్టం అనిపించినా ఆ తర్వాత అలవాటైందని అన్నారు. తన ట్రాన్స్ ఫర్మేషన్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని అన్నారు అఖిల్. సినిమాలో మమ్ముట్టి పాత్ర అద్భుతంగా ఉంటుందని. ఆయన్ను మరొక కొత్త యాంగిల్ లో చూపిస్తున్నామని అన్నారు అఖిల్. సినిమాలో రొమాన్స్ పాళ్లు చాలా తక్కువ కానీ ఉన్నంతవరకు ఇంప్యాక్ట్ బాగుంటుందని అన్నారు. సురేందర్ రెడ్డి ఏజెంట్ కోసం తను చాలా కష్టపడ్డానని డైరెక్టర్ గా ఆయన తన ఫుల్ ఎఫర్ట్స్ పెట్టేశాడని అఖిల్ చెప్పారు.

ఇక ట్రైలర్ రిలీజ్ డేట్ ని భారీగా ఎనౌన్స్ చేస్తామని.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా ఉండబోతుందని అన్నారు. నాగార్జునకి కానీ నాగ చైతన్యకు కానీ ఈ సినిమా గురించి అసలు ఏమి తెలియదని ఇంట్లో మా మధ్య అసలు సినిమా డిస్కషన్స్ ఉండవని.. మిగతా విషయాలు మాట్లాడుతామని అన్నారు అఖిల్. చైతన్య సైలెంట్ కిల్లర్ అని.. ఏది ఎక్కడ వదలాలో బాగా తెలుసని.. కానీ నేను మాత్రం డే అండ్ నైట్ సినిమాలు తప్ప వేరే ఆలోచన లేదని అన్నారు. బర్త్ డే స్పెషల్ ఏమి లేదని ఏజెంట్ రిలీజై హిట్ కొట్టాక ఆరోజు తన బర్త్ డే పార్టీ చేసుకుంటానని అన్నారు అఖిల్.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *