అమ్మ పొట్టలో ఉన్నప్పుడే “అఖిల్ ” అల్లరి చేసేవాడు

అమ్మ పొట్టలో ఉన్నప్పుడే “అఖిల్ ” అల్లరి చేసేవాడు

అక్కినేని అఖిల్ కి ఇప్పటివారు మంచి హిట్ పడలేదని చెప్పాలి తన టాలెంట్ కి ఇప్పటికే స్టార్ హీరో పొసిషన్ లో ఉండాలి కానీ కాలేదు , ఐతే ఇప్పుడు అఖిల్ నటించిన భారీ యాక్షన్ అడ్వెంచర్ – ఏజెంట్ ఈనెలలో విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్సకత్వం లో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా కేటగిరీలో అత్యంత భారీగా విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఏ .కే ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించింది. తాజాగా వరంగల్ ప్రచార వేదికపై కింగ్ నాగార్జున మాట్లాడుతూ అఖిల్ అల్లరితనం గురించి చెప్పారు .

అమ్మ పొట్టలో ఉన్నప్పుడే అఖిల్ అల్లరి బయటపడింది. చిన్న వయసులోనే కంగారు పెట్టేవాడు. అయితే డాక్టర్లు తనని పూర్తిగా మట్టి నేలపై పడుకోబెట్టండి అని అన్నారు… అంటూ అఖిల్ లోని ఎనర్జీ స్పీడ్ గురించి నాగార్జున ఈ వేదికపై చెప్తుంటే అందరు ఆలా చూస్తుంది పోయారు.

అంతేకాదు ఇప్పుడు ఏజెంట్ గా అతడి అల్లరి స్పీడ్ తెరపై అద్భుతంగా పండిందని ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీలా ఉంటుందని తెలిపారు. సురేందర్ రెడ్డి ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారని తాను కూడా వెయిట్ చేస్తున్నానని నాగార్జున ఎగ్జయిట్ అవుతూ చెప్పేసారు . అంతేకాదు.. ఈ సినిమా విషయంలో తాను అనవసంగా ఇన్వాల్వ్ కాలేదని తనకు కథ కూడా తెలియదని అప్పుడప్పుడు అఖిల్ ఇంట్లోనే తనకు సినిమా గురించి చెప్పేవాడని నాగార్జున అన్నారు.

ఏజెంట్ గా అఖిల్ మేకోవర్ అద్భుతం. ఇటీవల ప్రమోషన్స్ లోను ఎంతో వైవిధ్యం పాటిస్తున్నాడు. ఇటీవల ఓ భారీ భవంతి పై నుంచి రోప్ ల సాయంతో అఖిల్ చేసిన అడ్వెంచర్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నిజానికి తొలి సినిమా నుంచి అఖిల్ ఎంతో ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. కానీ కెరీర్ పరంగా ఆశించినంత పెద్ద బ్లాక్ బస్టర్ ని దక్కించుకోవడంలో తడబడ్డాడు. అన్నిటికీ ఏజెంట్ సమాధానంగా నిలుస్తుందని అక్కినేని అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

ఏజెంట్ చిత్రాన్ని హిందీలో ఘనంగా విడుదల చేయడమే గాక.. స్ట్రెయిట్ గా కరణ్ బ్యానర్ లోనే అఖిల్ తదుపరి మూవీ చేయబోతున్నాడని కూడా భావిస్తున్నారు. వరుసగా హిందీ చిత్రాల్లో నటిస్తూ బాక్సాఫీస్ రేంజును విస్తరించే ఆలోచనలో అఖిల్ ఉన్నాడని కథనాలొస్తున్నాయి.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్
ఫొటోస్ : నిధి అగర్వాల్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : నిధి అగర్వాల్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : నిధి అగర్వాల్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *