ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం బూటకం: ఆలపాటి రాజా

ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం బూటకం: ఆలపాటి రాజా

జగన్‌ తీసుకొచ్చిన ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం ఎందుకూ పనికిరాదని, వైద్యరంగాన్ని పూర్తి గా నిర్వీర్యంచేసిన వైసీపీప్రభుత్వం, 4ఏళ్ల నుంచీ ప్రభుత్వ ఆసుపత్రుల్ని నిర్లక్ష్యంచేసి, తగినంత మంది వైద్యులు, సిబ్బందిని నియమిం చకుండా కాలయాపన చేసిందని, పీ.హెచ్‌.సీలు ఉన్నాయో లేవో అనే అనుమానం ప్రజల్లోఉందని టీడీపీ సీనియర్‌ నేత, మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. మంగళగిరి లోని పార్టీ జాతీయకార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రభుత్వాసుపత్రుల్లో కనీససౌకర్యాలు కల్పించలేని జగన్‌ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్‌ అనే కామెడీ ప్రోగ్రామ్‌ కు శ్రీకారంచుట్టింది.

ప్రజల్ని కాపాడటానికే 2,875మంది వైద్యులతో వైద్య సేవలు అందించడానికే కార్య క్రమం చేపట్టామని చెప్పడం పచ్చి బూటకం. ప్రభుత్వ వైద్యశాలలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ఎలాంటి వసతులు, సౌకర్యాలు కల్పించకుండా, తగినంత సిబ్బందిని నియమించకుండా, మందులు, ఇతరసామగ్రి అందించ కుండా ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తామని చెప్పడం సిగ్గుచేటు. పేదలకు ఎంతోఉపయోగపడే ఆరోగ్యశ్రీ వ్యవస్థను కూడా జగన్‌ నిర్వీ ర్యం చేశాడు. ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లిం చకపోవడంతో ప్రైవేట్‌ యాజమాన్యాలు పేదలకు వైద్యసేవల్ని నిరాకరిస్తున్నాయి.

ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ప్రభుత్వా సుపత్రుల్లో తగినంత సిబ్బందిని, వైద్యపరికరాలు, మందుల్ని అందించలేని ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్‌ వ్యవస్థతో ప్రజలప్రాణాలు కాపాడుతుందా? చంద్రబాబు హాయాంలో ప్రజలకు అందిన వైద్యసేవలెన్నో, ఇప్పుడురాష్ట్రంలో అమలవుతున్న సేవలు ఏమిటో ప్రభుత్వంచెప్పగలదా? తల్లీబిడ్డ ఎక్స్‌ ప్రెస్‌, 108, 104 వాహనసేవలు, గిరిజ నప్రాంతాల్లో మొబైల్‌ వాహనేసేవలు చంద్రబాబు హయాంలో నిర్విరామంగా పేదలకు అందు బాటులో నిలిచాయి. చంద్రబాబు ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించడనికి తీసుకొచ్చిన అనేకపథకాల్ని జగన్‌ రాగానే రద్దు చేశాడని అన్నారు.

Related post

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జ్‌ ,మాజీమంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రమాదేవి కలిసి పలు చోట్ల.. వినాయక స్వామివారిని…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…
చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం..  విడుదల అయ్యేంత వరకు పోరాటం

చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం.. విడుదల అయ్యేంత వరకు పోరాటం

నాలుగున్నర దశాబ్దాల పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవినీతికి తావు లేకుండా.. టీడీపీ అధినేత చంద్రబాబు పరిపాలన చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం.. నిరంతరం అభివద్ధే ధ్యేయంగా పని చేసిన చంద్రబాబుపై…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *