
తగలబడిపోతోన్న అల్బెర్టా ప్రావిన్స్..వైల్డ్ లైఫ్ ఎమర్జెన్సీగా ప్రకటన
- Ap political StoryNewsPolitics
- May 8, 2023
- No Comment
- 39
కెనడా అల్బెర్టా ప్రావీన్స్ లోని అటవీప్రాంతం దగ్ధమవుతోంది. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దావనంలా వ్యాపిస్తూ, పశ్చిమ కెనడా ప్రావిన్స్‌కు విస్తరిస్తున్నాయి. దాంతో, స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. దాదాపు 25,000 మందిని అక్కడి నుంచి వేరేచోటకు పంపించారు.
అల్బెర్టా ప్రావిన్స్ లోని 100కుపైగా ప్రదేశాల్లో అగ్నికీలలు విరుచుకుపడుతున్నాయి. ప్రజలు ఎవరైనా ఆ ప్రాంతంలో ఉంటే తక్షణమే ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బలమైన గాలుల కారణంగా ఈ మంటలు శరవేగంగా వ్యాపిస్తున్నాయి. మంటలను అదుపు చేయడం సాధ్యం కాకపోవడంతో అధికారులు తలపట్టుకుంటున్నారు. ప్రావిన్స్ లో వైల్డ్ లైఫ్ ఎమర్జెన్సీని ప్రకటించారు.
ఈ ఏడాది వేసవిలో వేడి, పొడి వాతావరణం ఎక్కువగా ఉండటం మంటలకు అనుకూలంగా మారినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, ప్రపంచంలోనే చమురు అత్యధికంగా ఉత్పత్తి చేసే ప్రదేశాల్లో అల్బెర్టా కూడా ఒకటి. ఇప్పటి వరకు చమురు ఉత్పత్తికి ఎటువంటి ఆటంకం ఎదురు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. దాదాపు 20 కమ్యూనిటీలను పూర్తిగా ఖాళీ చేయించారు. ఇప్పటికే 1,22,0000 హెక్టార్ల అటవీప్రాంతం దగ్ధమైంది. అల్బెర్టా చుట్టు పక్కల ప్రాంతాల ప్రావిన్స్‌లకు అంటుకునే ప్రమాదం ఉండడంతో…సహాయక చర్యల నిమిత్తం పడవలు, హెలికాప్టర్లను మోహరించారు.