దిక్కు మాలిన బ్రాండ్లతో చావగొడుతున్న జగన్ సర్కార్…

దిక్కు మాలిన బ్రాండ్లతో చావగొడుతున్న జగన్ సర్కార్…

ఏపీలో అంతా బూమ్ బూమ్ పాలనే నడుస్తోంది. మందు ముట్టుకుంటే షాక్ కొట్టేలా చేస్తామన్న జగన్, చెప్పినట్టే చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసేవిధంగా కంకణం కట్టుకున్నారు. ఏ మద్యాన్ని అయితే బ్యాన్ చేస్తానని చెప్పి గద్దెనెక్కారో, దాన్నే తనకు ఆదాయ వనరుగా మార్చుకున్నారు సీఎం జగన్. విచ్చలవిడిగా రేట్లు పెంచేసి జనాన్ని జలగలా పీడిస్తున్నాడు. ఊరు పేరు లేని, ఎన్నడూ మచ్చుకైనా చూడని మహా “మాయ బ్రాండ్లు” తీసుకొచ్చి పేద ప్రజల ఉసురు తీస్తున్నారు. ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్స్ రిజర్వ్, బూమ్ బూమ్, స్పెషల్ స్టేటస్ ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని పనికి మాలిన, దరిద్రపుగొట్టు బ్రాండ్లు రాష్ట్రమంతా దర్శనమిస్తాయ్.

సైకో సర్కార్ నాసిరకం లిక్కర్ బ్రాండ్లను తీసుకొచ్చి డబ్బులు దండుకోవడమే గాకుండా, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. జేబుకు చిల్లు పడినా, కనీసం నచ్చిన సరుకైనా దొరుకుతుందా అంటే..మద్యంప్రియులకు ఆ సంతోషం కూడా లేకుండా పోయింది. తాము పోసిందే తాగాలన్నట్టుగా “జే బ్రాండ్స్” మాఫియా శాసిస్తోంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో మందుబాబులు ఏదో ఒకటి అన్నట్టుగా తాగేస్తున్నారు. దానివల్ల లివర్, కిడ్నీలు పాడైపోయి మంచాన పడుతున్నారు. నిత్యం ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇవన్నీ ప్రభుత్వ లెక్కల్లోకి రానప్పటికీ.. ఆ మరణాలన్నంటికీ ముమ్మాటికీ జగనే బాధ్యుడని విపక్షాలు మండిపడుతున్నాయి. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఓట్లు వేయించుకొని.. మా తాళి బొట్లు తెంచుతావా..? అంటూ బాధిత మహిళలు జగన్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంతకన్నా మోసం ఎక్కడైనా ఉంటుందా…? మా ఖర్మ కాకపోతే..? మాకీ దౌర్భాగ్యం ఏంటి..? అని రాష్ట్ర ప్రజలు గుండెలు బాదుకుంటున్నారు.

దేశంలో అమ్మే ప్రముఖ బ్రాండ్లు జగన్ షాపుల్లో ఎక్కడా దొరకవు. ఇక్కడ అమ్మే దరిద్రపుగొట్టు బ్రాండ్లు దేశంలో ఎక్కడా ఉండవు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న మద్యం వ్యాపారాన్ని జగన్ ప్రభుత్వం వచ్చాక తన చేతుల్లోకి తీసుకుంది. అప్పటివరకూ ఏటా నిర్వహించే మద్యం షాపుల వేలాన్ని రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా షాపుల్లో సిబ్బందిని నియమించి మరీ అమ్మకాలు సాగిస్తోంది.గతంలో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ప్రముఖ బ్రాండ్లకు బదులుగా నాసిరకం మద్యం బ్రాండ్లు దర్శనమిస్తుండటంతో వాటిని తాగలేక జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కల్తీసారా తాగి మరీ ప్రాణాలమీదకు తెచ్చుకున్నారు కూడా. జగన్ సర్కార్ సాగిస్తున్న లిక్కర్ దందా వల్ల, ఏటేటా రాష్ట్రంలో మరణాల సంఖ్య పెరిగిపోతోంది. కిడ్నీలు, లివర్లు పాడైన అనేక మంది అర్దాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఎంపీ రఘురామ కృష్ణం రాజు చేయించిన ల్యాబ్ టెస్టుల్లో సైతం జగన్ సర్కార్ అమ్మే లిక్కర్ యమ డేంజరని తేలింది. జగన్ సర్కార్ అమ్ముతున్న మద్యం.. మందుబాబుల పాలిట మరణ శాసనం రాస్తోంది. దీంతో ఈ పీడ ఎప్పుడు విరగడవుతుందోనని మహిళలు ఎదురుచూస్తున్నారు.

నకిలీ మద్యంతో ప్రభుత్వం మాఫియా నడిపిస్తోందంటూ ప్రతిపక్ష టీడీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది.ఆరోపణలు చేయడమే కాదు పక్కా లెక్కలతో ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్ రూపొందించింది. కిల్లర్‌ జేబ్రాండ్స్‌.కామ్‌ పేరుతో ప్రజల కోసం వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అధికార పార్టీ తీరును ఎండగట్టేందుకు డిజిటల్ ఉద్యమం చేపట్టింది. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చాక తీసుకువచ్చిన నాసిరకం మద్యం బ్రాండ్ల వివరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.. మొత్తం మీద జగన్ సర్కార్ అమ్ముతున్న జే బ్రాండ్స్.. ఏపీలో డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఈ పీడ తమకు ఎప్పుడు విరగడ అవుతుందా..? అని మద్యం వినియోగదారులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

Related post

బీజేపీ, జగన్ కు షాక్ ఇచ్చిన పవన్..?

బీజేపీ, జగన్ కు షాక్ ఇచ్చిన పవన్..?

ఏపీలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తో వైసీపీ అధినేత జగన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటివరకు ఎవరి రాజకీయం వారు చేసిన…
బాబుతో మాట్లాడతారనే భయంతో.. కోడికత్తి శ్రీనును విశాఖకు తరలింపు

బాబుతో మాట్లాడతారనే భయంతో.. కోడికత్తి శ్రీనును విశాఖకు తరలింపు

కోడికత్తి కేసు నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ ను మరో చోటకు షిఫ్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న శ్రీనివాస్ ను…విశాఖకు తరలించినట్లు తెలుస్తోంది.…
జగన్ మాస్టర్ ప్లాన్ మిస్ ఫైర్ అయ్యిందా..?

జగన్ మాస్టర్ ప్లాన్ మిస్ ఫైర్ అయ్యిందా..?

ఏపీలో ముఖ్యమంత్రి జగన్ ఎన్ని జగన్నాటకాలు ఆడాలో అన్ని ఆడేస్తున్నారు. ఇప్పటికే దొంగలా టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తోన్న జగన్ అండ్ కో… 2024 ఎన్నికల్లో గెలవలేమనే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *