
తెలంగాణ యువతకు జగన్ బంపరాఫర్.. ఒక్క దెబ్బకు 15 వేల ఉద్యోగాలు..!
- NewsTelangana Politics
- May 6, 2023
- No Comment
- 32
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తూరు జిల్లా నుంచి తరిమేసిన అమర్ రాజా బ్యాటరీ ఇండస్ట్రీకి.. తెలంగాణలో ఘనంగా భూమి పూజ జరిగింది. సుమారు తొమ్మిదిన్నర వేల కోట్ల భారీ పెట్టుబడితో.. అమర్ రాజా సంస్థ లిథియం అయాన్ బ్యాటరీ ఇండస్ట్రీని తెలంగాణలో ఏర్పాటు చేస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా లోని దివిటిపల్లిలో ఏర్పాటు చేస్తున్న ఈ పరిశ్రమకు తెలంగాణ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఘనంగా భూమి పూజ నిర్వహించారు.
ప్రత్యక్షంగా సుమారు 10 వేల మందికి.. పరోక్షంగా మరో 5 వేల మందికి ఈ ఫ్యాక్టరీ ద్వారా ఉపాధి దొరకనుంది. దేశంలో పలు రాష్ట్రాలు కోరినా.. అమర్ రాజా సంస్థ తెలంగాణలో తమ యూనిట్ ఏర్పాటు చేయటం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తమ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించే పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
అయితే.. పొరుగునే ఉన్న ఏపీలో మాత్రం జగన్ సర్కార్ అమర్ రాజా కంపెనీపై విపరీతమైన వేధింపులకు పాల్పడింది. దీంతో.. ఏపీలో తమ విస్తరణ కార్యక్రమాలకు స్వస్థి పలికిన అమర్ రాజా సంస్థ.. తెలంగాణ వైపు అడుగులు వేసింది. వాస్తవానికి.. దేశంలోనే ప్రముఖ బ్యాటరీ తయారీ సంస్థల్లో ఒకటిగా అమర్ రాజా గ్రూపు గుర్తింపు పొందింది. ఆమాటకొస్తే.. ఏపీలోని చిత్తూరు జిల్లాకు అమర్ రాజా కంపెనీ మణిహారంగా వెలుగొందుతోంది.
అటువంటి అమర్ రాజా కంపెనీ బ్యాటరీ ఫ్యాక్టరీ కోసం దాదాపు 8 రాష్ట్రాలు పోటీ పడ్డాయి. అయితే.. చివరగా తెలంగాణ ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీని దక్కించుకుంది. పూర్తిగా కాలుష్య రహిత పరిశ్రమగా లిథియం అయాన్ బ్యాటరీ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది. జీరో లిక్విడ్ డిశ్చార్జీతో పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఏపీ నుంచి అమర్ రాజా కంపెనీని తరమేసిన ఘనత అధికార వైసీపీకే దక్కుతుంది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.. ప్రభుత్వ సలహాదారు సజ్జల పుణ్యమా అని.. అమర్ రాజా కంపెనీ ఏపీ నుంచి తెలంగాణకు తరలిపోయింది. దీంతో ఏపీ యువతకు దక్కాల్సిన 15 వేలకు పైగా ఉద్యోగాలు.. తెలంగాణ యువతకు దక్కనున్నాయి. రాజకీయ కారణాలతో అమర్ రాజా కంపెనీని టార్గెట్ చేసిన జగన్ రెడ్డి.. కాలుష్యం పేరుతో సంస్థను మూసివేయటానికి ప్రయత్నించారు. తీరా అది కుదరక పోవటంతో.. రక రకాలుగా వేధించారు.
ఈ వేధింపులు భరించలేక అమర్ రాజా యాజమాన్యం ఏపీకి దండం పెట్టేసి.. తెలంగాణకు వెళ్ళి పోయింది. అమర్ రాజా వెళ్ళి పోవటం వల్ల సీఎం జగన్ రెడ్డికి.. సజ్జలకు ఎలాంటి నష్టం లేకపోయినా.. ఏపీ యువత మాత్రం ఉద్యోగ అవకాశాలను కోల్పోయారనే అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతోంది.