అమరావతి భూముల్లో ఆగని అరాచకం..!

అమరావతి భూముల్లో ఆగని అరాచకం..!

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో అరాచకానికి జగన్ సర్కార్ తెర తీస్తోంది. సీఆర్డీఏ చట్టాన్ని తుంగలో తొక్కుతూ… రైతుల నుంచి సేకరించిన భూముల్లో పేదల ఇళ్ళ స్థలాల పేరిట రాజకీయ కుట్రలకు పాల్పడుతోంది. ఇటీవల జీవో నెంబర్ 45 పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటానికి హైకోర్టు నిరాకరించింది. అయితే.. ఫ్లాట్ల కేటాయింపు తమ తుది నిర్ణయానికి అనుగుణంగా ఉండాలని పేర్కొంది. కానీ.. జగన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం.. అత్యుత్సాహంతో ముందుకు వెళుతోంది. ల్యాండ్ పూలింగ్ విధానంలో గత ప్రభుత్వం సమీకరించిన భూములను… ఇతరులకు పందేరం చేయటానికి రంగం సిద్ధం చేస్తోంది.

ఏపీ కలల రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసేందుకు జగన్ సర్కార్.. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచీ ప్రయత్నిస్తూనే ఉంది. దీంట్లో భాగంగా అమరావతిని శ్మశానంగా కొంత మంది మంత్రులు అభివర్ణించగా.. మరికొంత మంది వైసీపీ నేతలు… అమరావతిని ఓ ముంపు ప్రాంతంగా చిత్రీకరించారు. అమరావతిలో రాజధాని నిర్మాణం శుద్ధ దండగ అంటూ.. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాటకు తెరతీశారు.

అమరావతి ఉనికిని దెబ్బ తీయటానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు. చివరకు.. వచ్చే సెప్టెంబర్‌లో విశాఖకు తట్టా..బుట్టా సర్దుకుని కాపురం వెళ్ళి పోతున్నానని సైతం ఇటీవలే ప్రకటించారు. అయితే.. వెళుతూ వెళుతూ.. అమరావతి రైతులకు.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 48 వేల మంది ప్రజలకు చిచ్చురాజేస్తున్నారు. దీంట్లో భాగంగా.. అమరావతి మాస్టర్ ప్లాన్‌లో కొత్తగా R5 జోన్ క్రియేట్ చేసి.. పేదల ఇళ్ళ పట్టాల పేరుతో కొత్త నాటకానికి తెర తీశారు. అయితే.. ఏపీ హైకోర్టు కూడా పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వటాన్ని ఆపలేమంటూనే… ప్రభుత్వ నిర్ణయం తమ తుది తీర్పునకు అనుగుణంగా ఉండాలంటూ కండిషన్ పెట్టింది.

కానీ.. సీఆర్డీఏ నిబంధనలు, రైతులతో చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘిస్తూ జగన్ రెడ్డి సర్కార్ దూకుడుగా ముందుకు వెళుతోంది. R5 జోన్‌లో 48 వేల మందికి పైగా గుంటూరు, విజయవాడ, మంగళగిరి ప్రాంత ప్రజలకు పట్టాలు ఇవ్వటానికి రంగం సిద్దం చేసున్నారు. పట్టాల పేరుతో యుద్ధ ప్రాతిపదికన భూమి చదును చేసే పనులు చేపడుతున్నారు.

ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఉన్న సరిహద్దు రాళ్ళను సైతం తొలగిస్తున్నారు. దీంతో.. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఫ్లాట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే జగన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం.. అమరావతి విధ్వంసమే లక్ష్యంగా.. ముందుకు వెళుతోంది. దీనిపై సుప్రీం కోర్టు తీర్పు ఎలా వస్తుందన్న దానిపై.. అమరావతి రైతుల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *