తీవ్ర ఇబ్బందుల్లో అమరావతి రాజధాని రైతులు

తీవ్ర ఇబ్బందుల్లో అమరావతి రాజధాని రైతులు

అమరావతిని .. ఏకైక రాజధానిగా కొనసాగించి అభివృద్ధి చేయాలనే డిమాండ్‌తో స్థానిక రైతులు, మహిళలు, ప్రజలు చేస్తున్న ఉద్యమం మార్చి 31 నాటికి 1200 రోజులకు చేరుకోనుంది. రాష్ట్ర విభజన తరువాత అప్పటి టీడీపీ ప్రభుత్వం అన్ని ప్రాంతాలను పరిశీలించి అమరావతిని రాజధానిగా ప్రకటించింది. 29 గ్రామాల నుంచి 33 వేల ఎకరాల భూములను రైతుల నుంచి సమీకరించారు. రైతులు కూడా తమ రాష్ట్రానికి రాజధాని వస్తుందని ఉచితంగా భూములు ఇచ్చారు. రైతులిచ్చిన భూమికి ప్రతిగా అభివృద్ధి చేసిన ప్లాట్లు వారికి అప్పగించాల్సి ఉంది. అయితే 2019 ఏప్రిల్ వరకు అమరావతిలో పనులు పరుగులు తీశాయి. 90 శాతం మంది రైతులకు అప్పటి ప్రభుత్వం ప్లాట్లు పంపిణీ చేసింది. కొందరు రైతులు గత ఎన్నికలకు ముందు మంచి ధరకు స్థలాలు అమ్ముకున్నారు. అయితే చాలా మంది రైతులు రాజధాని డెవలప్ అయితే భూముల ధరలు మరింత పెరుగుతాయిని ఆశించారు.

2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత మూడు రాజధానుల ప్రకటన చేయడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. రాజధానిలో భూములు కొనేవారు కరవయ్యారు. అమరావతి కాదు… కమ్మరావతి అంటూ కొందరు మంత్రులు అవమానకరంగా, వ్యంగ్యంగా రైతులను విమర్శించారు. ఉద్యమం చేస్తున్న రాజధాని రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ మరికొందరు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పట్టు చీరలు కట్టుకుని బెంజికార్లు, ఆడికార్లలో తిరుగుతున్నారంటూ అమరావతి రాజధాని మహిళా రైతులను విమర్శించారు. వైసీపీ నేతలు చేసిన ఆరోపణలు పఠాపంచలయ్యాయి. రాజధానికి రైతులిచ్చిన భూమిలో పంటలు పండించుకోవడం సాధ్యం కాకపోవడం, మరోవైపు రాజధాని అభివృద్ధి అటకెక్కడంతో, భూముల ధరలు పడిపోయాయి. ఒకప్పుడు పది మంది కూలీలకు ఉపాది కల్పించిన రైతులు నేడు కూలీ పనులు వెతుక్కుంటూ దూర ప్రాంతాలకు వలసలు పోతున్నారు.

2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని గ్రామాల్లో గజం భూమి ధర 40 వేలు పలికింది. సీఎం జగన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేయడంతో ఆ భూముల ధరలు అమాంతం పడిపోయాయి. నేడు గజం 15 వేలకు కూడా కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. భూములు అమ్ముకుని జీవనం సాగిద్దామని చూస్తున్నా ఎవరూ కొనడానికి ముందుకు రావడం లేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అమరావతి రాజధానికి భూములిచ్చిన గ్రామాల్లో గతంలో ఏటా మూడు పంటలు పండేవి. రైతులు ఏనాడూ తిండికి, బట్టకు, పిల్లల చదువులకు, వైద్య ఖర్చులకు ఇబ్బంది లేకుండా జీవనం గడిపారు. నేడు రాజధానికి భూములిచ్చిన వేలాది మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లలను చదివించుకోలేక, అనారోగ్య సమస్యలు వచ్చినా ఆసుపత్రికి వెళ్లేందుకు కూడా చేతిలో చిల్లిగవ్వలేకుండా పోయిందని రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

గత ప్రభుత్వం రాజధానికి భూములిచ్చిన రైతులకు, రైతు కూలీలకు ఫించను సదుపాయం కల్పించింది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనీసం ఆరు నెలలకు ఒకసారి కూడా పెన్షన్ అందించడం లేదని రైతులు చెబుతున్నారు. రైతుల భూములకు ఇవ్వాలని కౌలు కూడా చెల్లించకపోవడంతో రైతులు కోర్టులను ఆశ్రయించాల్సి వస్తోందని రైతులు తెలిపారు.

అమరావతి రాజధాని అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని వైసీపీ ప్రభుత్వం, రైతుల భూములు వేలం వేసి సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అమరావతి రాజధాని పరిధిలో 16 ఎకరాల భూములను ప్లాట్లుగా విభజించి అమ్మేందుకు ప్రకటనలు ఇచ్చింది. ప్రభుత్వం గజం 17వేల ధర నిర్ణయించినా వాటిని కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. రాజధానిని మూడు ముక్కలు చేసి, అమరాతిలో తట్టమట్టి కూడా ఎత్తని జగన్ రెడ్డి తమ భూములు ఎలా అమ్ముకుంటాడని రైతులు ప్రశ్నిస్తున్నారు…

అమరావతి రాజధానిలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి పనులు చేపట్టలేదు. ఇక విశాఖను ఉద్దరిస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. జులై నుంచి విశాఖ కేంద్రంగా పాలన సాగిస్తామంటూ సీఎం జగన్ రెడ్డి ప్రకటనలు చేస్తున్నారు. అమరావతిపై హైకోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ సుప్రీంలో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. అయితే హైకోర్టు తీర్పును యధాతధంగా అమలు చేసేలా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ సుప్రీంను అమరావతి రైతులు ఆశ్రయించారు. ఇంతకు ముందే కేంద్రం దాఖలు చేసిన అమరావతి విభజన చట్టం ప్రకారమే ఏర్పడిందంటూ అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం. మూడు రాజధానుల గురించి తమకు తెలియదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని విచారణ సందర్భంగా ధర్మాసనాన్ని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోరారు. అమరావతి కేసులపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు జూలై 11వ తేదీకి వాయిదా పడటంతో ఏపీ ప్రభుత్వానికి నిరాశ ఎదురయింది.. అయినా.. రాజధాని మార్పు వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేసు తేలకముందే విశాఖకు రాజధాని తరలిపోతోందంటూ చేస్తున్న అసంబద్ద ప్రకటనలు రైతుల్లో మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

Related post

ఫొటోస్ : కృతి శెట్టి గ్లామర్ ఫోటోస్

ఫొటోస్ : కృతి శెట్టి గ్లామర్ ఫోటోస్

ఫొటోస్ : కృతి శెట్టి గ్లామర్ ఫోటోస్
చీకటి కార్యకలాపాలకు అడ్డగా.. నాడాబ్ చెత్త శుద్ధి కేంద్రాలు

చీకటి కార్యకలాపాలకు అడ్డగా.. నాడాబ్ చెత్త శుద్ధి కేంద్రాలు

రైతులకు తక్కువ ధరలో వ్యవసాయ పోషకాలను అందించడానికి ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎంతో కృషి చేశారు. 2016లో రైతులకు ఉచిత ఎరువు పంపిణీ కోసం.. శుద్ధి కేంద్రాలు…
OG ఫాన్స్ కి ఆకలి తీర్చిన హంగ్రీ చీతా

OG ఫాన్స్ కి ఆకలి తీర్చిన హంగ్రీ చీతా

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్‌ డే ట్రీట్‌ ఫ్యాన్స్‌ కి అదిరిపోయేట్లు ఇచ్చేసాడు సూజిత్‌.. భయ్యా.. ఈ రిలీజ్‌ అయిన ఓజి గ్లింమ్స్‌లో ఎవరికి ఫస్ట్‌ ప్లేస్‌…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *