అమెజాన్ లో ఉద్యోగాలు ఊడుతున్నాయ్..!

అమెజాన్ లో ఉద్యోగాలు ఊడుతున్నాయ్..!

  • News
  • May 16, 2023
  • No Comment
  • 34

కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో, ఎప్పుడు పోతాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. జాబ్ చేసి సాయంత్రం ఇంటికొచ్చేలోపు కొందరు ఉద్యోగాలు హుష్ కాక్ అవుతున్నాయి. కొన్ని కంపెనీలు నైట్ పార్టీ ఇచ్చి ఉదయాని కల్లా లే ఆఫ్ ప్రకటిస్తూ మెయిల్స్ పంపిస్తున్నాయి. ప్రముఖ టెక్, ఈ-కామర్స్ కంపెనీలు తమ సంస్థల నుంచి భారీ సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నారు. ఈ జాబితాలో ఇప్పటికే అమెజాన్ కూడా చేరింది. గతంలో 18వేల మందిని ఇంటికి పంపించిన అమెజాన్ తాజాగా భారీ సంఖ్యలో లేఆఫ్స్ ప్రకటించింది.

అమెజాన్ భారత్ లో 500మంది ఎంప్లాయిస్ కి ఉద్వాసన పలికింది. రెండో విడతలో భాగంగా 9వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అమెజాన్‌ మార్చిలో ప్రకటించింది. వీరిలో 500 మంది భారత్‌ నుంచి ఉన్నట్లు తాజాగా తెలిసింది.వెబ్‌సర్వీసెస్‌, హ్యూమన్‌ రీసోర్సెస్‌, సపోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. వీరిలో కొంత మంది కంపెనీ గ్లోబల్‌ ఆపరేషన్స్‌కు ఇక్కడి నుంచి పనిచేస్తున్న వారున్నారు.

కరోనా తర్వాత ఈ-కామర్స్‌ కంపెనీల ఆదాయాల్లో వృద్ధి నెమ్మదించింది. మరోవైపు మాంద్యం, వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో వినియోగదారులు కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఫలితంగా చాలా కంపెనీలు వ్యయాలను నియంత్రించుకుంటున్నాయి. అందులో భాగంగా మెటా, గూగుల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. జనవరిలోనూ అమెజాన్‌ 18,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *