ఐపీఎల్ తర్వాత అంబటి పొలిటికల్ ఎంట్రీ ?

ఐపీఎల్ తర్వాత అంబటి పొలిటికల్ ఎంట్రీ ?

రాయుడు రాజకీయాల్లోకి వస్తున్నాడు. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటివరకు క్రికెటర్ గా బ్యాట్ ఝులిపించిన అంబటి రాయుడు..ఐపీఎల్ ముగిసిన తర్వాత పొలిటీషియన్ గా మారాలనే నిర్ణయానికి వచ్చాడు. గత కొంతకాలంగా అంబటి రాయుడు రాజకీయ రంగప్రవేశం పై రకరకాల వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్లే, ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికల్లో కథనం వచ్చింది. ప్రజలకు సేవ చేసేందుకు రాయుడు రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటున్నారని పేపర్ లో వచ్చింది. అయితే, ఏ పార్టీలో చేరాలి, ఎప్పుడు చేరాలనే విషయంలో రాయుడు త్వరలోనే ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది.

అంబటి రాయుడు స్వస్థలం గుంటూరు జిల్లా, వెల్లలూరు. అందుకే, ఆయన ఏపీ రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే అంబటి రాయుడుకు ఏపీలోని పలు పార్టీల నుంచి ఆహ్వానాలు‌సైతం అందాయట. బలమైన కాపు కమ్యూనిటీకి చెందిన అంబటి రాయుడు కుటుంబానికి మంచి పేరు ఉంది. గతంలో రాయుడు తాత గ్రామ సర్పంచ్ గానూ పనిచేశారు. ఇటీవల కాలంలో జగన్ స్పీచ్ పై అంబటి రాయుడు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.దాంతో, ఆయన వైసీపీలోకి వెళ్తారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే, ఏ రాజకీయ పార్టీతోనూ తాను చర్చలు జరపలేదని అంబటి చెప్పుకొచ్చారు.

రంజీల్లో హైదరాబాద్ తరఫున అంబటి రాయుడు క్రికెటర్ గా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత టీమిండియాలో చోటు సంపాదించి, జట్టు విజయాల్లో తనదైన పాత్ర పోషించాడు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపిఎల్ లో ఆడుతున్నాడు. 37 ఏళ్లున్న రాయుడు.. ఈ ఏడాదితో ఐపీఎల్ కు గుడ్ బై చెప్పే అవకాశం ఉంది. ఐపీఎల్ తర్వాత అతడు రాజకీయ ప్రకటన చేస్తారనే ప్రచారం జరుగుతోంది. 2024 ఎన్నికల్లో అంబటి రాయుడు పోటీ చేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. గుంటూరు జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు ఊహగానాలు వినిపిస్తున్నాయి.తనకు సరిపోయే నియోజకవర్గాన్ని సూచించాల్సిందిగా తన అభిమానులు, శ్రేయోభిలాషులను అంబటి రాయుడు కోరినట్లు ఓ ఆంగ్ల దినపత్రికలో వార్త ప్రచురించింది.

ఇదిలా ఉంటే, తమ పార్టీలోకి రావాలని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అంబటి రాయుడిని కోరినట్లు తెలుస్తోంది. అయితే, ఏపీ రాజకీయాలపై ఉన్న మక్కువ కారణంగా…ఆయన వైసీపీ, టీడీపీ లేదంటే జనసేనలో చేరే అవకాశముందంటున్నారు. మొత్తంగా, అంబటి పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *