తమ్మినేని నకిలీ సరిటిఫికేట్ లపై విచారణ జరపాలి  టిడిపి జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి డిమాండ్

తమ్మినేని నకిలీ సరిటిఫికేట్ లపై విచారణ జరపాలి టిడిపి జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి డిమాండ్

సమాచార హక్కు చట్టం ద్వారా ఆధారాల సేకరణ
నాగర్ కర్నూల్ స్టడీ సెంటర్ విద్యార్ధుల జాబితాలో లేని పేరు
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రికార్డులలోనూ మ్యాచ్ కాని పేరు
బికాం డిగ్రీ, ప్రొవిజనల్, మైగ్రేషన్, టీసీ అన్నీ నకిలీవేనా?

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో చదవకుండానే తమ్మినేని సీతారాంకు సర్టిఫికేట్ లు ఎలా వచ్చాయని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి ప్రశ్నించారు? హైదరాబాద్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నర్సిరెడ్డి మాట్లాడారు. సమావేశంలో తన ఆరోపణలకు సంబంధించి పలు డాక్యుమెంట్ లను విడుదల చేశారు. తమ్మినేని సీతారాం డిగ్రీ డిస్ కంటిన్యూ చేశారని, అటువంటప్పుడు మూడేళ్ళ ఎల్ ఎల్ బి కోర్స్ లో ఏవిధంగా అడ్మిషన్ పొందారని నర్సిరెడ్డి ప్రశ్నించారు. తాను సమాచార హక్కు చట్టం ద్వారా పూర్తి సమాచారం తెలుసుకున్నానని, అప్పుడు నకిలీ సరిటిఫికేట్ ల వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయన్నారు.

మహాత్మాగాంధీ లా కాలేజీలో తన మూడేళ్ళ ఎల్ ఎల్ బి కోర్స్ అడ్మిషన్ కు సంబంధించి తమ్మినేని సీతారాం సమర్పించిన సర్టిఫికేట్ కాపీలను సమాచార హక్కు చట్టం క్రింద తాము డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిస్షన్, స్మానియా యూనివర్సిటీ నుంచి సేకరించినట్టు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు సమాచార హక్కు చట్టం ద్వారా తమకు ఇచ్చిన సమాచారం ప్రకారం తమ్మినేని సీతారాం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలోని నాగర్ కర్నూల్ స్టడీ సెంటర్ నుంచి 2015-18 మధ్య (హాల్ టికెట్ నంబరు 1791548430) బికాం పూర్తి చేసినట్టు సర్టిఫికేట్ లు సమర్పించారన్నారు.

అనంతరం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారిని నాగర్ కర్నూల్ స్టడీ సెంటర్ లో 2015 వ సంవత్సరంలో చదివిన మొత్తం విద్యార్ధుల వివరాలు (పేర్లు, హాల్ టిక్కెట్ నంబరు, కోర్స్) సమాచార హక్కు చట్టం ద్వారా అడిగినట్టు చెప్పారు. అయితే నాగర్ కర్నూల్ స్టడీ సెంటర్ (అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ) లో చదివిన మొత్తం 839 మండి విద్యార్ధుల పేర్ల జాబితాలో తమ్మినేని సీతారాం పేరు లేదని నర్సిరెడ్డి తెలిపారు. తమ్మినేని సీతారాం తనదిగా చెబుతున్నా హాల్ టికెట్ నంబరు 1791548430 మాత్రం డి భగవంత్ రెడ్డి, తండ్రి బి స్వామి రెడ్డి అనే పేరు మీద వున్నదని నర్సిరెడ్డి వివరించారు. ఈ వివరాలను బట్టి తమ్మినేని సీతారాం సమర్పించింది నకిలీ సర్టిఫికేట్ అని భావించాల్సి వస్తుందన్నారు.

అనంతరం 2021వ సంవత్సరం జూలీ 28వ తేదీన మూడేళ్ళ ఎల్ ఎల్ బి కోర్సు కోసం తమ్మినేని సీతారాం సమర్పించిన అంబేద్కర్ ఓపెన్ యునివర్సిటి సర్టిఫికేట్ ప్రతులు నిజమైనవా? కావా? తేల్చమని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారికి ఇచ్చి రికార్డులు పరిశీలించి తెలపమని సమాచార హక్కు చట్టం ద్వారా సర్టిఫికేట్ ను దాఖలు పరిచి సమాచారం సేకరించినట్టు నర్సిరెడ్డి వివరించారు. తమ్మినేని సీతారాం సర్టిఫికేట్ లను రికార్డులలో పరిశీలించి తమ రికార్డులలో మ్యాచ్ కావడం లేదని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధికారికంగా ధృవీకరించిందని నర్సిరెడ్డి చెప్పారు.

వీటన్నింటినీ పరిశీలిస్తే తమ్మినేని సీతారాం బికాం డిగ్రీ సర్టిఫికేట్, ప్రొవిజనల్, మైగ్రేషన్, టిసి, అన్నీ నకిలీవని అర్ధమవుతుందన్నారు. తమ్మినేని సీతారాంకు నకిలీ సర్టిఫికేట్ లు ఎలా వచ్చాయి? నకిలీ సరిటిఫికేట్ వ్యవహారంపై సమగ్రమైన దర్యాప్తు జరిపి, అందుకు కారకులైన వారిని చట్టప్రకారం శిక్షించాలని నర్సిరెడ్డి డిమాండ్ చేశారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *