
సముద్ర తీరాన హంసల అనసూయ అందాలు
- EntertainmentMoviesNews
- June 5, 2023
- No Comment
- 27
అనసూయ పెళ్లిరోజు సందర్భంగా అనసూయ ఓ వీడియో పోస్ట్ చేసింది. తన భర్తను ఉద్దేశిస్తూ ఎమోషనల్ నోట్ రాసింది. తన భర్త భరద్వాజ్ గురించి.. తనతో ప్రేమ, పెళ్లిపై మనసులోని భావాలను పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరలవుతోంది. భర్తతో కలిసి బీచ్‌లో ఉన్న వీడియో షేర్ చేసిన అనసూయ.. ‘‘2001లో నువ్వు నాకోసం రాసిన మొదటి ప్రేమలేఖ నాకు ఇంకా గుర్తుంది. అప్పుడు నీకు రిప్లై ఇవ్వలేకపోయాను. అందుకే ఇప్పుడు నీపై నాకున్న ప్రేమను వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తాను.. ఇన్నేళ్ల మన జీవితంలో ఎంతో మంది నిన్ను ఎన్నో మాటలు అన్నారు.
వాటిని పట్టించుకోకుండా నాపై ఇంత ప్రేమ చూపుతున్నావు. మన వివాహబంధాన్ని ఎంతో అద్భుతంగా నిలబెడుతున్నావు. ఇప్పటి వరకు నాకోసం ఎన్నో త్యాగాలు చేశావు. ఒక్కోసారి నువ్వు నాపై చూపించే ప్రేమకు, నీ సహనానికి నేను కూడా ఆశ్చర్యపోతుంటాను. మనమిద్దరం ఒకరినొకరం అర్థం చేసుకుంటూ పైకి ఎదుగుతున్నాం. మనం పర్‌ఫెక్ట్ కపుల్ కాదని నాకు తెలుసు.. కానీ కష్టసుఖాల్లో ఒకరికొకరం తోడుంటున్నాం. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఒక్కటిగా ముందుకు సాగుతున్నాం. నన్ను నన్నుగా స్వాగతించినందుకు ధన్యవాదాలు’’అంటూ తన భర్తపై ఉన్న ప్రేమను తెలిపింది.