షాక్ కొడుతున్న కరెంట్ బిల్లులు.. లబోదిబో మంటున్న ఏపీ జనం..

షాక్ కొడుతున్న కరెంట్ బిల్లులు.. లబోదిబో మంటున్న ఏపీ జనం..

జగన్ రెడ్డి సర్కార్ వారి పాలనలో.. కరెంట్ బిల్లులు ప్రజలకు షాక్ కొడుతున్నాయి. తమ ఇంటి కరెంటు బిల్లులు చూసి జనం లబోదిబోమంటున్నారు. కరెంటు బిల్లులు కొద్దిగా పెరగ వచ్చేమో కాని.. జగన్ రెడ్డి సర్కార్ బాదుడే బాదుడు చూసి.. జనం గగ్గోలు పెడుతున్నారు. ఏపీలో విద్యుత్ శాఖా అధికారులు.. వివిధ రకాల యూజర్ ట్రూ అప్ చార్జీలను మోగించేస్తున్నారు. కనీస 575 రూపాయల కరెంట్ బిల్లులో .. కూడా.. వివిధ రకాల చార్జీలతో పేద , మధ్య తరగతి అనే బేధం లేకుండా.. జగన్ సర్కార్ బాదేస్తోంది. మొత్తం మీద 20% కరెంట్ ఛార్జీలు ఎందుకు పెరిగాయో.. అర్థం కాకుండా .. ఉన్నాయి. దీంతో ఏపీ ప్రజలను.. కరెంట్ బిల్లులు .. పగలు రాత్రి.. నిద్ర పోనియకుండా.. కలవర పెడుతున్నాయి.

నాలుగేళ్లుగా సర్దుబాటు పేరుతో ఒకసారి, ఇంధన ధరల పేరుతో మరోసారి .. కరెంట్ బిల్లులు పెంచడం ఏపీ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. జగన్ రెడ్డి సర్కార్ వచ్చాక.. 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచింది. ఇప్పుడు విద్యుత్ అధికారులు.. చెప్పకుండానే.. ప్రతినెలా.. కరెంటు చార్జీలను ఏదో రూపంలో పెంచుతూనే ఉన్నారు. కరెంట్ బిల్లులను ఒకసారి పరిశీలిస్తే ఎప్పుడు వేసే.. చార్జీలతో పాటు మరో మూడు వివిధ చార్జీలు అదనంగా కలిపారు. అంటే ప్రజల నెత్తిపై ఆరు రకాల సర్ చార్జీలు వేసి.. కరెంట్ యూనిట్లకు ఇవే అదనంగా వడ్డించారు. కరెంట్ బిల్లులో.. ట్రూ అప్ చార్జెస్, బిల్ యూనిట్ చార్జెస్, యూజర్ ఛార్జెస్. లైన్ లాస్ పేరుతో మరో ఛార్జీలు, ఇలా వివిధ రకాల పేరుతో .. పేద, మధ్యతరగతి ప్రజల జేబుకు.. కరెంట్ బిల్లు మోత వాయించేశారు.

ప్రతినెల వాడుతున్న యూనిట్లకు.. నెలవారి కరెంట్ బిల్లు చెల్లిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో యూనిట్ చార్జీలను నేరుగా పెంచితే.. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భావనతో .. ఇలా అడ్డదారులల్లో బిల్లులు పెంచడం .. ఏపీ సర్కార్ కు పరిపాటి అయింది. యూజర్ చార్జెస్ పేరుతో బిల్లులు పెంచడం విడ్డూరంగా ఉందని సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరెంటు బిల్లు పదేళ్ల క్రితం 50 రూపాయలు ఉంటే.. ప్రస్తుతం 1500 రూపాయలు దాటింది. అంటే.. ఇప్పుడున్న జగన్ రెడ్డి సర్కార్ ఎన్ని రేట్లు పెంచిందో.. ఇక చెప్పక్కర్లేదు. కరెంట్ బిల్లు కట్టాలంటే.. డబ్బుల్లేవు.. కట్టకుంటే.. కరెంట్ కట్ చేస్తారు. అసలే.. అరకొరగా ఆర్థిక ఆదాయం ఉన్న.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు కరెంట్ బిల్లు .. ఒక సమస్యగా మారిందని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *