ఇదేనా జగన్ మార్క్ పాలన?

ఇదేనా జగన్ మార్క్ పాలన?

కరెంటు బిల్లులను జగన్ ఎలా బాదేస్తున్నారో చూశారా

అసలు కంటే కొసరే మూడు రెట్లు ఎక్కువ వడ్డించేస్తున్నారు..

ప్రైవేటు సంస్థల నుంచి  ఎక్కువ రేటుకు కొని..

ఆ భారమంతా ఇప్పుడు జనంపై రుద్దుతున్నారు…

అసలు వందరూపాయలుంటే అదనపు ఛార్జీలతో కలిపి 500బాదేస్తున్నారు

ఇంధన సర్‌చార్జీ, కన్జ్యూమర్‌ చార్జీ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ అంటూ ..

ఒకేసారి మూడు సర్దుపోటు ఛార్జీలతో బాదుడే బాదుడు

ఏపీలో ముట్టుకుంటే కరెంట్ షాక్ కొడుతుందని పాదయాత్రలో ప్రచారం చేశారు. తానొస్తే ధరలు తగ్గిస్తానని, 200యూనిట్ ల వరకు ప్రతీ ఒక్కరికీ ఉచిత కరెంటు ఇస్తానని హామీ ఇచ్చారు జగన్. కానీ, ఇప్పుడు చేస్తుందేంటి? ఏటా షాక్ పెడుతున్నారు . 8సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచేసి జనం నడ్డివిరిచారు. ప్రస్తుతం ఏపీలో పవర్ షాక్ మామూలుగా లేదు. మోత మోగుతున్న కరెంట్ బిల్లులను చూసి జనం కళ్లుతిరిగిపోయే పరిస్థితులున్నాయి. అసలు కంటే కొసరు అధికంగా ఉంటోంది. ఎప్పటికప్పుడు వడ్డిస్తున్న ‘సర్దుబాటు’కు తోడు… ఇంధన సర్‌చార్జీ, కన్జ్యూమర్‌ చార్జీ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ పేర్లతో షాకులు ఇస్తున్నారు. ఇప్పటిదాకా ట్రూప్ అప్ చార్జ్ నెలకు 200 యూనిట్లు పైబడి కరెంటును వాడేవారిపైనే పడుతుందని సామాన్యులు భావించారు. కానీ, ఇప్పుడు సగటు వినియోగదారుడిపైనా ఆ భారం పడుతోంది.

యూనిట్ కు 5రూపాయలకు ఇచ్చే జాతీయ సంస్థలను కాదని…అడ్డగోలుగా ప్రైవేటు సంస్థలనుంచి పది రూపాయల చొప్పును కరెంటును కొంటున్నారు. ఆ భారాన్ని ఇప్పుడు జనం నెత్తిన మోపుతున్నారు. విజయవాడలో ఓ వినియోగదారుడు 101 యూనిట్లు వినియోగించుకున్నారు. మొత్తం బిల్లు రూ.519. అందులో మే నెలలో విద్యుత్‌ వాడకానికి సంబంధించిన చార్జీ రూ.124.71 మాత్రమే. ఫిక్స్‌డ్‌ చార్జీలు, కస్టమర్‌ చార్జీలు, మూడు సర్దుబాట్లు కలిపేసరికి అది రూ.519 అయ్యింది. అధిక ధరలకు విద్యుత్ ను కొనేసి..దాన్ని సామాన్యుల నుండి పిండుతున్న జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

అసలు వాడకానికి తోడు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న జగన్ సర్కార్…. త్వరలోనే స్మార్ట్ మీటర్ల బాదుడు షురూ చేస్తోంది. స్మార్ట్ గా ప్రజల జేబులకు చిల్లులు పెడుతోంది. ఇప్పటికే వ్యవసాయ మోటార్లకు మీటర్ల పేరుతో పీల్చిపిప్పిచేస్తున్నారు. పక్కరాష్ట్రాల్లో 10వేలకు దొరికే మీటర్ ను 30వేలకు పైగా బాదేస్తున్నారు. తద్వారా 17వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారనే విమర్శలు వ్యక్తమవుతునన్నాయి. మోటార్ల కంటే మీటర్లు రెండింతలు ఉండడం మరీ విడ్డూరం. జగన్ మీటర్ల మాటున భారీ కుంభకోణానికి తెరలేపారని టీడీపీ మండిపడుతోంది. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ మీటర్లు, మోటార్ల కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తోంది.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *