
దళిత మహిళను కిరాతకంగా హత్య.. ముఖ్యమంత్రిగా జగన్ స్పందించరా..?
- Ap political StoryNewsPolitics
- June 7, 2023
- No Comment
- 24
వైసీపీ అధికారంలోకి వస్తే.. అక్కా చెల్లెమ్మలకు అండగా ఉంటానని జగన్ వరాలు గుప్పించాడు. 2019 నుంచి వైసీపీ అధికారంలోకి వచ్చాక.. అసలు మహిళలకు రక్షణే లేకుండా పోయింది. జగన్ రెడ్డి పాలనలో మహిళలపై అఘాయిత్యాలు నితృకృత్యమయ్యాయి. అంగన్ వాడీ కార్యకర్త హనుమాయమ్మ దారుణ హత్య .. జగన్ అసమర్థ పాలనకు మచ్చుతునక. నాలుగేళ్లుగా మహిళలు అత్యాచారానికి గురైనా.. అబలలపై హత్యలు జరుగుతున్నా.. పోలీసులకు.. కనీసం చీమకుట్టినట్టైనా ఉండటం లేదు. కేవలం కేసులు నమోదు చేసి.. చేతులు దులుపుకుంటున్నారు తప్ప చేసిందేమీ లేదు. జగన్ రెడ్డి .. దిశ చట్టం తెచ్చాడని.. చెబుతున్నా.. మునుపెన్నడూ చూడని ఘోరాలు, దారుణాలు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.
వైసీపీ దౌర్జన్యాల్లో మహిళలు, ఎస్సి, ఎస్టీ, బిసి, మైనారిటీల వర్గాల బాధితులు అవుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో అంగన్ వాడి కార్యకర్త హనుమాయమ్మ హత్య అందరి హృదయాలను కలచివేస్తోంది. రావివారిపాలెంలో వైసీపీ నాయకుడు కొండలరావు… దళిత మహిళ హనుమాయమ్మను అత్యంత దారుణంగా చంపడం వైసీపీ అరాచకాలకు పరాకాష్టగా నిలిచింది. సినిమాలలో కూడా చూపని విధంగా ఘోరమైన, అతి కిరాతకమైన పద్ధతిలో వైసీపీ నాయకులు.. ట్రాక్టర్ల నాగళ్లతో హనుమాయమ్మను చంపడం.. చూస్తే.. ఏపీలో మహిళలకు ఎలాంటి రక్షణ ఉందో అర్థమవుతోంది.
కొండెపి టీడీపీ నేత సుధాకర్ భార్య హనుమాయమ్మ రాయవారిపాలెంలో అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తోంది. కొద్ది రోజుల క్రితం..మరుగుదొడ్ల నిర్మాణం టీడీపీ, వైసీపీ మధ్య వివాదం రాజేసింది. టీడీపీ ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి వైసీపీ నేతలు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేకు మద్దతుగా రాయవారిపాలెం గ్రామ టిడిపి నాయకుడైన ఆమె భర్త సుధాకర్ పార్టీ కార్యక్రమం నిమిత్తం ఉదయమే టంగుటూరుకు వెళ్లారు. తన ఇంటి సమీపంలో.. అతని భార్య.. హనుమాయమ్మ బోరు నుండి నీరు తెచ్చుకుంటుండగా సమీప బంధువు, వైసిపి నాయకుడు కొండలరావు ఆమెను చూసి..కక్షతో.. ట్రాక్టర్‌తో ఢీ కొట్టగా ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఆ ఘటనలో అక్కడ గోడ కూలి.. శిథిలాల కింద పడిపోయింది. అయినా.. కనికరం లేకుండా.. మళ్లీ.. గోడ శిథిలాల కింద పడిపోయిన హనుమాయమ్మ పై నుంచి ట్రాక్టర్ పోనిచ్చారంటే.. ఎంత దారుణంగా .. క్రూరంగా వైసీపీ నేతలు వ్యవహరించారో తెలుస్తోంది.
అంగనవాడీ కార్యకర్త హనుమాయమ్మ పొత్తికడుపుపై దున్ని చంపడాన్ని చూస్తే వైసీపీ నేతలు ఎంతకు బరితెగించారో అర్థమవుతోంది. అనాగరిక ప్రాంతాల్లో కూడా ఈ విధంగా ప్రవర్తించరు. రాష్ట్రంలో పోలీసులు హంతకులను, కిరాయి రౌడీలను, వైసీపీ గూండాలను, గంజాయి సరఫరా చేసేవారికి అండగా ఉంటోందే తప్ప చట్టాన్ని, న్యాయాన్ని కాపాడటానికి ఏపీ పోలీసులు పూర్తిగా చేతులెత్తేశారని అర్థమవుతోంది. పార్టీలు చూడం.. మతం చూడం.. ప్రాంతం చూడం .. అందరికీ సమన్యాయం చేస్తామన్న.. జగన్ రెడ్డి.. హనుమాయమ్మను హతమార్చిన వైసీపీ గూండాల విషయంలో .. ఎందుకు నోరు ఎత్తడం లేదని.. ప్రజలు ప్రశ్నిస్తున్నారు.