
టీటీడీ తీరుపై వైరల్ అవుతున్న వైసీపీ ఎమ్మెల్యే ఘాటు వ్యాక్యలు..
- Ap political StoryNewsPolitics
- March 27, 2023
- No Comment
- 33
పవిత్రమైన తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రాన్ని భ్రష్టు పట్టించారు. ఇదేదో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు కావు. స్వయానా వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు చేస్తున్న ఆరోపణలు. ఇప్పటికే సామాన్యులకు స్వామి వారి ఉచిత దర్శన భాగ్యం దూరం చేశారు. కనీసం, ఎమ్మెల్యేలను కూడా టీటీడీ ఈవో పట్టించుకోవడం లేదని అధికార పార్టీ నేతలు బహిరంగ విమర్శలకు దిగుతున్నారు.
వీఐపీలు, వీవీఐపీల సేవలో తరిస్తున్న టీటీడీ ఛైర్మన్, ఈవో, కనీసం ఎమ్మెల్యేలను కూడా ఖాతరు చేయకపోవడం ఆ పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తోంది. టీటీడీ ఈవో తీరుపై అధికార వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తిరుమల స్వామివారి దర్శనాన్ని వ్యాపారంగా మార్చి, ఆదాయం పెంచుకోవడమే పరమావధిగా టీటీడీ ఈవో, చైర్మన్ పనిచేస్తున్నారని అధికార పార్టీ నేతలే విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.