
ఎన్టీఆర్ కు మరో అరుదైన గౌరవం
- Ap political StoryNewsPolitics
- March 29, 2023
- No Comment
- 35
ఎన్టీఆర్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. అన్న నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 100 రూపాయల ప్రత్యేక నాణెం విడుదలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన అన్నగారి పేరుమీద, 100 రూపాయల నాణెం విడుదలకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవడంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా ప్రధాని మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
ఎన్టీఆర్ ను సన్మానించుకోవడం అంటే తెలుగు ప్రజలందరికీ గౌరవించడమేనని చంద్రబాబునాయుడు ఓ ప్రకటనలో వెల్లడించారు. మింట్ అధికారులు ఇప్పటికే ఎన్టీఆర్ బొమ్మతో 100 రూపాయల నాణెం నమూనాను రూపొందించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు ఎన్టీఆర్ కుంటుంబసభ్యుల అభిప్రాయాలను కూడా తీసుకుని నాణెం ముద్రణలో ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తున్నారు.