రైతుల పంటలు నీళ్లల్లో ! వైకాపా నాయకులు ఇళ్లల్లో!!

ఏపీలో పది రోజులుగా వెంటాడుతోన్న వర్షాలు రైతులకు తీవ్ర నష్టం మిగిల్చాయి. అకాల వర్షాలకు ఈదురుగాలులు తోడు కావడంతో రబీ వరి, మొక్కజొన్న, జొన్న పంటలతోపాటు, మామిడి, మిర్చి, బొప్పాయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు విరుచుకుపడటంతో రైతులు కుదేలయ్యారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేష్టలుడికి చూస్తోంది. కనీసం పంటనష్టం అంచనాలు రూపొందించే కార్యక్రమం కూడా చేపట్టలేదు.

లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయినా వైసీపీ నాయకులు రైతులను కనీసం పలకరించిన పాపాన పోలేదు. అకాల వర్షాలకు రైతులు, పంటలు నీళ్లల్లో నానుతుంటే, వైసీపీ నాయకులు ఇళ్లల్లో కులుకుతున్న వైనంపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు రైతును నిలువునా ముంచాయి. అకాల వర్షాలు, పెను గాలులకు సుమారు 6 లక్షల ఎకరాల్లో 6 వేల కోట్ల విలువైన పంట నష్టం వాటిల్లింది. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు ప్రతి జిల్లాలో అకాల వర్షాలకు అనేక పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో చేతికి అందాల్సిన వరి పంట నీటిపాలైంది. అక్కడ 4 లక్షల ఎకరాల్లో రబీ వరిపంటలకు తీవ్ర నష్టం జరిగింది. కొందరు రైతులు పంట నూర్పిడి చేసి కళ్లాల్లో, రోడ్లవెంట ధాన్యం ఆరబెట్టారు.

నెల రోజులు గడుస్తున్నా…. వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసి మొలకలు వచ్చేశాయి. అకాల వర్షాలకు ప్రభుత్వ నిర్లక్ష్యం తోడు కావడంతో రైతులు మరింత నష్టపోయారు. ఒక్కో రైతుకు ఎకరాకు 50 నుంచి లక్షదాకా నష్టాలను చవిచూశారు. వెంటనే పంట నష్టం అంచనాలు రూపొందించాల్సిన రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. పంట నష్టం పరిహారం చెల్లింపుపై కూడా సీఎం జగన్ రెడ్డి ఇంత వరకు స్పష్టమైన ప్రకటన చేయకపోవడం రైతాంగంలో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.

ఇక.. అకాల వర్షాలకు కౌలు రైతులు మరింత ఎక్కువగా నష్టపోయారు. రెండో పంటలోనైనా కనీసం పెట్టుబడులు వస్తాయని ఆశించారు. పది రోజుల్లో పంట అమ్మి డబ్బులు చేతికి వచ్చే సమయంలో విరుచుకుపడిన అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయారు. ఉభయగోదావరి జిల్లాలతోపాటు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రబీ వరిసాగు రైతులు తీవ్రంగా నష్టపోయారు. నూర్పిడి చేసి కళ్లాల్లో ఆరబెట్టిన ధాన్యం రాశులు కూడా అధిక వర్షాలకు కొట్టుకుపోయాయి. ధాన్యం మొలకెత్తడంతో కొనేవారు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు.

రైతులు ఇంత దారుణంగా నష్టపోయినా తడిసిన ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు. పంటలు నష్టపోయిన సమయంలో రైతులకు అండగా నిలిచి భరోసా ఇవ్వాల్సిన వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అడ్రస్ లేకుండా పోయారు. కనీసం పరిహారం చెల్లించి, తడసిన ధాన్యం కొనుగోలు చేస్తే రైతుకు కొంత ఊరట లభిస్తుంది. కానీ వైసీపీ నేతలు మొద్దునిద్ర నటిస్తున్నారు. సీఎం జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నతాధికారులతో తూతూ మంత్రంగా పంట నష్టంపై సమీక్ష నిర్వహించి వదిలేశారు.

రాష్ట్రంలో 22 లక్షల ఎకరాల్లో రబీ వరి సాగు చేపట్టారు. ముఖ్యంగా గోదావరి డెల్టాతోపాటు, కృష్ణా డెల్టా, నెల్లూరు జిల్లాలో రబీ వరి సాగవుతోంది. అకాల వర్షాలకు చాలా పొలాల్లో పంట నేలకొరిగింది. 33 శాతం పంటనష్టం వాటిల్లితేనే పరిహారం అందిస్తామని అధికారులు చెబుతున్నారు. వరిపైరులో ఎకరాకు 20 బస్తాల దిగుబడి తగ్గే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. అయినా పరిహారం ఇచ్చేందుకు కూడా వ్యవసాయ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేయకపోవడం గమనార్హం.

రబీ వరి సాగు చేసిన రైతుకు ఎకరాకు 30 వేల నష్టం వాటిల్లింది. దీనికి అదనంగా ఎకరాకు 20 వేలు కౌలు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంమీద 5 ఎకరాల్లో వరి సాగు చేసిన రైతుకు రెండున్నర లక్షల నష్టం జరిగింది. ఇన్ ఫుట్ రాయితీలు, పరిహారం చెల్లించి, తడసిన, మొలకెత్తిన ధాన్యం కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం ఉలుకు పలుకు లేకుండా పడకేయడంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు…

అకాల వర్షాలకు అన్ని రకాల పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయం పండగ చేస్తామని డబ్బాలు కొట్టిన జగన్ రెడ్డికి, కనీసం నష్టపోయిన రైతులను పలకరించి ధైర్యం చెప్పే సమయం కూడా లేకపోవడం దారుణం. బాబు వస్తే కరువొస్తుంది, జగన్ వస్తే వర్షాలు వస్తాయని భజన చేసే వైసీపీ బృందం కనిపించకుండా పోయింది. అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రైతును ఆదుకోవాల్సిన ప్రభుత్వం మొత్తం మీద చేతులెత్తేసిందనే చెప్పాల్సి ఉంటుంది.

ఏపీలో పది రోజులుగా వెంటాడుతోన్న వర్షాలు రైతులకు తీవ్ర నష్టం మిగిల్చాయి. అకాల వర్షాలకు ఈదురుగాలులు తోడు కావడంతో రబీ వరి, మొక్కజొన్న, జొన్న పంటలతోపాటు, మామిడి, మిర్చి, బొప్పాయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు విరుచుకుపడటంతో రైతులు కుదేలయ్యారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేష్టలుడికి చూస్తోంది. కనీసం పంటనష్టం అంచనాలు రూపొందించే కార్యక్రమం కూడా చేపట్టలేదు. లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయినా వైసీపీ నాయకులు రైతులను కనీసం పలకరించిన పాపాన పోలేదు. అకాల వర్షాలకు రైతులు, పంటలు నీళ్లల్లో నానుతుంటే, వైసీపీ నాయకులు ఇళ్లల్లో కులుకుతున్న వైనంపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు రైతును నిలువునా ముంచాయి. అకాల వర్షాలు, పెను గాలులకు సుమారు 6 లక్షల ఎకరాల్లో 6 వేల కోట్ల విలువైన పంట నష్టం వాటిల్లింది. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు ప్రతి జిల్లాలో అకాల వర్షాలకు అనేక పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో చేతికి అందాల్సిన వరి పంట నీటిపాలైంది. అక్కడ 4 లక్షల ఎకరాల్లో రబీ వరిపంటలకు తీవ్ర నష్టం జరిగింది. కొందరు రైతులు పంట నూర్పిడి చేసి కళ్లాల్లో, రోడ్లవెంట ధాన్యం ఆరబెట్టారు.

నెల రోజులు గడుస్తున్నా…. వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసి మొలకలు వచ్చేశాయి. అకాల వర్షాలకు ప్రభుత్వ నిర్లక్ష్యం తోడు కావడంతో రైతులు మరింత నష్టపోయారు. ఒక్కో రైతుకు ఎకరాకు 50 నుంచి లక్షదాకా నష్టాలను చవిచూశారు. వెంటనే పంట నష్టం అంచనాలు రూపొందించాల్సిన రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. పంట నష్టం పరిహారం చెల్లింపుపై కూడా సీఎం జగన్ రెడ్డి ఇంత వరకు స్పష్టమైన ప్రకటన చేయకపోవడం రైతాంగంలో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది..

ఇక.. అకాల వర్షాలకు కౌలు రైతులు మరింత ఎక్కువగా నష్టపోయారు. రెండో పంటలోనైనా కనీసం పెట్టుబడులు వస్తాయని ఆశించారు. పది రోజుల్లో పంట అమ్మి డబ్బులు చేతికి వచ్చే సమయంలో విరుచుకుపడిన అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయారు. ఉభయగోదావరి జిల్లాలతోపాటు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రబీ వరిసాగు రైతులు తీవ్రంగా నష్టపోయారు. నూర్పిడి చేసి కళ్లాల్లో ఆరబెట్టిన ధాన్యం రాశులు కూడా అధిక వర్షాలకు కొట్టుకుపోయాయి. ధాన్యం మొలకెత్తడంతో కొనేవారు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు.

రైతులు ఇంత దారుణంగా నష్టపోయినా తడిసిన ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు. పంటలు నష్టపోయిన సమయంలో రైతులకు అండగా నిలిచి భరోసా ఇవ్వాల్సిన వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అడ్రస్ లేకుండా పోయారు. కనీసం పరిహారం చెల్లించి, తడసిన ధాన్యం కొనుగోలు చేస్తే రైతుకు కొంత ఊరట లభిస్తుంది. కానీ వైసీపీ నేతలు మొద్దునిద్ర నటిస్తున్నారు. సీఎం జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నతాధికారులతో తూతూ మంత్రంగా పంట నష్టంపై సమీక్ష నిర్వహించి వదిలేశారు.

రాష్ట్రంలో 22 లక్షల ఎకరాల్లో రబీ వరి సాగు చేపట్టారు. ముఖ్యంగా గోదావరి డెల్టాతోపాటు, కృష్ణా డెల్టా, నెల్లూరు జిల్లాలో రబీ వరి సాగవుతోంది. అకాల వర్షాలకు చాలా పొలాల్లో పంట నేలకొరిగింది. 33 శాతం పంటనష్టం వాటిల్లితేనే పరిహారం అందిస్తామని అధికారులు చెబుతున్నారు. వరిపైరులో ఎకరాకు 20 బస్తాల దిగుబడి తగ్గే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. అయినా పరిహారం ఇచ్చేందుకు కూడా వ్యవసాయ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేయకపోవడం గమనార్హం.

రబీ వరి సాగు చేసిన రైతుకు ఎకరాకు 30 వేల నష్టం వాటిల్లింది. దీనికి అదనంగా ఎకరాకు 20 వేలు కౌలు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంమీద 5 ఎకరాల్లో వరి సాగు చేసిన రైతుకు రెండున్నర లక్షల నష్టం జరిగింది. ఇన్ ఫుట్ రాయితీలు, పరిహారం చెల్లించి, తడసిన, మొలకెత్తిన ధాన్యం కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం ఉలుకు పలుకు లేకుండా పడకేయడంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు…

అకాల వర్షాలకు అన్ని రకాల పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయం పండగ చేస్తామని డబ్బాలు కొట్టిన జగన్ రెడ్డికి, కనీసం నష్టపోయిన రైతులను పలకరించి ధైర్యం చెప్పే సమయం కూడా లేకపోవడం దారుణం. బాబు వస్తే కరువొస్తుంది, జగన్ వస్తే వర్షాలు వస్తాయని భజన చేసే వైసీపీ బృందం కనిపించకుండా పోయింది. అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రైతును ఆదుకోవాల్సిన ప్రభుత్వం మొత్తం మీద చేతులెత్తేసిందనే చెప్పాల్సి ఉంటుంది.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *