ఉద్యోగులకు తీరని శోకం

ఉద్యోగులకు తీరని శోకం

2019లో ప్రతి నియోజకవర్గంలో.. జగన్ చెప్పిన మాట.. నేను విన్నాను.. నేను ఉన్నాను అని. ఉద్యోగులను ఆకట్టుకునేందుకు.. ఇష్టం వచ్చినట్లు .. వరాల జల్లు కురిపించారు. ముఖ్యమంత్రి అవ్వగానే.. అదే ఉద్యోగులపై వేధింపుల పర్వం. సీపీఎస్ రద్దు చేస్తామన్నారు. డీఏ, పీఆర్​సీ బకాయిలైతే.. నాలుగేళ్లుగా చెల్లిస్తామంటూ .. కాలం గడిపారు. ప్రతినెలా.. ఒకటవ తారీఖున జీతాలు అందుకోవడం మరిచి పోయి.. చాలా కాలమైంది. ఉద్యోగులు నిరసనలకు దిగితే.. వారిపై 1600 కేసులు పెట్టారు. మళ్లీ ఉద్యోగులను దారి తెచ్చుకునేందుకు.. ఓవైపు ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరపడం.. మరోవైపు ఉద్యోగుల ఇళ్లకు పోలీసులను పంపడం నిత్యకృత్యమైంది. జగన్ తత్వం బోధ పడేసరికి.. కాలం గడిచి పోయింది.

ఉద్యోగులకు మంచి చేస్తామని నమ్మించి..మోసం చేసి.. కేసులు పెట్టిన ఘనత.. జగన్ రెడ్డికే దక్కుతుంది. పీఆర్సీ నుంచి.. డీఏల వరకు అన్నీ బకాయిలే. ఆర్జిత సెలవులకు దరఖాస్తు చేస్తే ఎప్పుడొస్తుందో చెప్పలేని దుస్థితి. డీఏల బకాయిలు ఇవ్వకుండానే ఆదాయపు పన్ను మినహాయించుకున్న ఘనత జగన్‌దే. ప్రభుత్వ పెన్షన్ దారులకైతే.. చెప్పలేని కష్టాలు. నాలుగేళ్ల పాటు సమయానికి జీతాలివ్వకుండా ఉద్యోగులను.. చాలా ఇబ్బందులకు గురి చేశారు. జీతం ఇవ్వమని అడిగినా.. హక్కుల కోసం ఉద్యమించినా.. ఉద్యోగ, ఉపాధ్యాయులను ఉక్కుపాదంతో అణచివేశారు. వారిపై బైండోవర్‌ కేసులు పెట్టారు.నాలుగేళ్లుగా దక్కాల్సిన ఆర్థిక ప్రయోజనాలను అటకెక్కించి నరకం చూపించారు.

జగన్ అధికారంలోకి వచ్చాక.. ఉద్యోగుల 11వ పీఆర్సీ పేస్కేల్స్‌ పట్టించుకోలేదు. ఐఆర్‌ 27 శాతం ఉంటే ఫిట్‌మెంట్‌ 23 శాతం ఇచ్చింది. అంటే 4 శాతం కోత పెట్టింది. సచివాలయ ఉద్యోగులకు గత ప్రభుత్వంలో 30% హెచ్‌ఆర్‌ఏ ఉండగా.. దాన్ని.. 24 శాతానికి తగ్గించేసింది. జిల్లా కేంద్రాల్లో గతంలో 20% హెచ్‌ఆర్‌ఏ ఉండగా 16 శాతానికి తగ్గించింది. 2018 జూన్‌ నుంచి .. ఏప్రిల్‌ 2020లోపు పదవీ విరమణ చేసిన వారికి.. రూ.12 లక్షల నుంచి రూ. 16 లక్షలకు పెరిగిన.. గ్రాట్యుటీని ఇంతవరకు పింఛన్‌దారులకు ఇవ్వలేదు.పైగా 11వ పీఆర్సీ అంశాలు ఇంకా పెండింగ్‌లో ఉండగా.. పరిష్కరించకుండానే.. జగన్ సర్కార్ .. 12వ పీఆర్సీ వేసింది.

ఏపీ ఉద్యోగులకు.. జగన్ సర్కార్.. 2018 జులై, 2019 జనవరి డీఏ బకాయిలు చెల్లించకుండానే జీతాల నుంచి ఆదాయపు పన్ను మినహాయించేసింది. రాని ఆదాయానికి ఉద్యోగులు పన్ను కట్టారంటే.. జగన్‌ పాలన ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ట్రెజరీలో డీఏ బిల్లులు అయినా ..ఇంతవరకు చాలామందికి చెల్లించలేదు. పీఆర్సీతో జీతం పెరిగిందని చూపించేందుకు.. అందులో కలిపిన .. జనవరి, జులై 2020, 2021 సంవత్సరాల డీఏ బకాయిలు ఇంతవరకు ఇవ్వలేదు. 2022 జనవరి డీఏకు మే నెలలో ఉత్తర్వులు ఇచ్చి.. జులై నుంచి అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇలా చేయడం ఏపీ చరిత్రలో మొదటిసారి. పీఆర్సీ, డీఏ బకాయిలను నాలుగేళ్లల్లో .. 16 విడతల్లో చెల్లిస్తామని .. ఈ మధ్య ఉద్యోగ సంఘాల నాయకులతో జరిగిన చర్చల్లో ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం డీఏ బకాయిలే రూ. 2 వేల కోట్ల వరకు ఉంటే.. ఆ భారాన్ని.. వచ్చే ప్రభుత్వాలపై మోపుతోంది.

ఆర్జిత సెలవుల కింద ఉద్యోగులకు చెల్లించాల్సినవి రూ.1,200 కోట్ల వరకు ఉన్నాయి. రూ.లక్షకుపైగా చెల్లించాల్సిన వాటిని పెండింగ్‌లో పెట్టారు. సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పింఛన్‌ విధానం అమలు చేయకపోగా.. వారికి దక్కాల్సిన ప్రయోజనాలను అందించడం లేదు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సీపీఎస్‌ ఉద్యోగులకు రాష్ట్రం వాటాగా 14% చెల్లించాల్సి ఉండగా.. 10% మాత్రమే చెల్లిస్తున్నారు. డీఏ బకాయిలను 90 శాతం నగదు రూపంలో చెల్లించాల్సి ఉన్నా.. జగన్ సర్కార్ వీటిని ఇవ్వడం లేదు. ఏప్రిల్‌ 2020 నుంచి డిసెంబరు 2021 వరకు ఉన్న పీఆర్సీ బకాయిలు చెల్లించలేదు.

అన్ని ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామన్న.. జగన్ ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేర్చలేదు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ సంఖ్యను తగ్గించుకునేందుకు.. 2014 జూన్‌కు ఐదేళ్ల సర్వీసు ఉండాలనే నిబంధన పెట్టారు. తెలంగాణలో 2014 జూన్‌ వరకు ఉన్న వారందర్నీ క్రమబద్ధీకరించగా.. ఇక్కడ గడువు విధించారు. దీంతో లబ్ధి పొందేవారి సంఖ్య సగానికి తగ్గిపోయింది. సీపీఎస్‌ రద్దు చేయాలంటే నిమిషం పని.. కానీ జగన్ సర్కార్ .. నాలుగేళ్లుగా పట్టించుకోలేదు. ఓపీఎస్‌ అమలైతే.. ప్రభుత్వ ఖజానాపై మోయలేని భారం పడుతుందని.. ప్రభుత్వ సలహాదారు సజ్జల మీడియాతో చెప్పారు. పాదయాత్ర లో హామీ ఇచ్చారు కదా… అన్న ప్రశ్నకు.. జగన్ .. ఈ విషయాలపై అవగాహన లేక మాటిచ్చారన్నారు. అధికారంలోకి వచ్చాక.. నెరవరేని హామీ ఇవ్వడం అంటే.. ఉద్యోగులను మోసం చేయడమే కదా..ఇప్పుడు జీపీఎస్‌ అంటూ..ఉద్యోగులను ఇరకాటంలో పడేసింది.

వైసీపీ మేనిఫెస్టోలోని.. ప్రతి మాటను నిలబెట్టుకుంటామన్న జగన్.. తీరా అధికారంలోకి వచ్చాక.. ఉద్యోగులందర్నీ నట్టేట ముంచారు. ఉద్యోగులందరికీ.. మాట ఇచ్చిన జగన్‌ సీఎం అయ్యాక మాట తప్పి, మడమ తిప్పేశారు. ఆర్థిక భారమంటూ పాత పెన్షన్‌ అమలు చేయకుండా.. జీపీఎస్ తెచ్చి ఉద్యోగులను తీరని కోత మిగిల్చారు. హక్కుల కోసం ఉద్యమాలు చేసిన ఉద్యోగులపై కేసులు పెట్టి వేధించారు. జగన్ ను గెలిపించి.. ఏరికోరి తెచ్చుకున్నఉద్యోగులకు.. శోకమే మిగిలింది తప్ప.. ఏ ఒక్కటీ దక్కలేదన్నది నిజం.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *