స్మార్ట్ దోపిడీకి రంగం సిద్దం

స్మార్ట్ దోపిడీకి రంగం సిద్దం

కేంద్రం అమలు చేస్తున్న రీవాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌ స్కీమ్‌ ను ఏపీ ప్రభుత్వం తెలివిగా వాడుకుంటోంది. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగిస్తే అదనంగా అప్పులు చేసుకునే వెసులుబాటు కల్పిస్తామంటూ కేంద్రం ఆఫర్ ఇచ్చింది. జగన్ రెడ్డి సర్కార్ ఇలాంటి అవకాశాలను ఎందుకు వదులుకుంటుంది . వైసీపీ పెద్దలు వెంటనే రంగంలోకి దిగిపోయారు. శ్రీకాకుళం జిల్లాలోని 37వేల వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించారు. మీటర్లు బిగించడం ద్వారా ఉత్తమ ఫలితాలు వచ్చాయంటూ ప్రచారం కూడా మొదలు పెట్టేశారు. ఇక రాష్ట్రం మొత్తం వ్యవసాయపంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించే బాధ్యతను జగన్ రెడ్డి బంధువు సంస్థ అయిన షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ కు కట్టబెట్టారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల భారాన్ని ప్రభుత్వం భరిస్తుంది. షిర్డిసాయికి బిల్లుల చెల్లింపు మాత్రం వెంటనే జరిగిపోతుంది. ఒక్కో స్మార్ట్ మీటరుకు 35 వేలు అని ముందుగా టెండర్ వేశారు. ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడంతో కొంచెం తగ్గారు. కొన్ని రాష్ట్రాల్లో వ్యవసాయపంపు సెట్లకు కేవలం 6 వేలకే స్మార్టు మీటర్లు బిగించారు. దీంతో జగన్ రెడ్డి సర్కార్ కూడా ఓ అడుగు వెనక్కు వేసి, ఒక్కో మీటరు 12 వేలకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. టెండర్లు పిలిచారు. అందులో షిర్డిసాయి, అదానీ, నాగార్జున కంపెనీలు పాల్గొన్నాయి. అందరూ ఊహించినట్టుగానే షిర్డిసాయికి టెండర్లు దక్కాయి. ఇక వారు వచ్చే నెల నుంచి రంగంలోకి దిగనున్నారు.

స్మార్ట్ దోపిడీలో అదానీకి కూడా రెడ్ కార్పెట్ పరిచారు. నెలకు 200 యూనిట్ల కన్నా ఎక్కువ విద్యుత్ ఉపయోగించుకునే గృహ వినియోగదారులు, పరిశ్రమలకు స్మార్టు మీటర్లు బిగించే బాధ్యతను అదానీ కంపెనీకి కట్టబెట్టారు. ఇలా రాష్ట్రంలో 45 లక్షల మీటర్లు మార్చనున్నారు. ఒక్కో మీటరు ఖరీదు 12090గా నిర్ణయించారు. ఈ మొత్తం ఓకేసారి జనం నుంచి వసూలు చేస్తే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. దీన్ని గమనించిన ప్రభుత్వం రాబోయే 93 నెలల పాటు నెలకు 130 వసూలు చేయాలని నిర్ణయించారు. కరెంటు బిల్లులోనే స్మార్ట్ మీటరు ధర కూడా నెలనెలా వసూలు చేసుకునే వెసులుబాటు అదానీకి కట్టబెట్టారు. ఇప్పటికే విద్యుత్ వినియోగదారులు డిజిటల్ మీటర్లు వాడుతున్నారు. ఇవి చక్కగా పనిచేస్తున్నాయి. వాటిని పీకివేసి కొత్తగా స్మార్ట్ మీటర్లు పెట్టాలని చూడటం అంటే ప్రభుత్వ సొమ్మును కాంట్రాక్టర్లకు దోచిపెట్టడమేనని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికే 8 సార్లు పెరిగిన కరెంటు ఛార్జీలతో జనం అల్లాడి పోతున్నారు. దీనికి అదనంగా స్మార్ట్ మీటరు బాదుడు మొదలైతే వినియోగదారులపై మరింత భారం పడే ప్రమాదం ఉంది.

రాష్ట్రంలో 18.57 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ మీటర్లను మార్చేందుకు ప్రభుత్వం 2201 కోట్లు షిర్డిసాయికి చెల్లించనుంది. 2022 డిసెంబరులో సీపీడీసీఎల్‌ పరిధిలో 783 కోట్లకు, ఈపీడీపీసీఎల్‌ పరిధిలో 628 కోట్లకు, ఎస్పీడీసీఎల్‌ పరిధిలో 790 కోట్లకు మొత్తంగా 2201 కోట్లకు స్మార్ట్‌ మీటర్ల కోసం మళ్లీ టెండర్లు పిలిచారు. ఈ టెండర్లలోనూ షిర్డిసాయి, అదానీ, నాగార్జున కంపెనీలు బిడ్లు వేశాయి. అయితే టెండర్లు ఎంతకు వేశారు. రివర్స్ టెండర్ విధానం అమలు చేశారా? లేదా? అనే విషయాలను మాత్రం మీడియా కంట పడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక రాష్ట్రంలో నెలకు 200 యూనిట్లు పైబడి వాడే 27.26 లక్షల ఇళ్లు, పరిశ్రమలకు స్మార్ట్‌ మీటర్లు బిగించే బాధ్యలను మాత్రం అదానీకి అప్పగించారు. ఈ సంస్థ వచ్చే నెల నుంచి స్మార్ట్ మీటర్లు బిగించి కరెంటు బిల్లుకు అదనంగా 130 వసూలు చేయనుంది.

Related post

బీజేపీ, జగన్ కు షాక్ ఇచ్చిన పవన్..?

బీజేపీ, జగన్ కు షాక్ ఇచ్చిన పవన్..?

ఏపీలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తో వైసీపీ అధినేత జగన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటివరకు ఎవరి రాజకీయం వారు చేసిన…
జగన్ మాస్టర్ ప్లాన్ మిస్ ఫైర్ అయ్యిందా..?

జగన్ మాస్టర్ ప్లాన్ మిస్ ఫైర్ అయ్యిందా..?

ఏపీలో ముఖ్యమంత్రి జగన్ ఎన్ని జగన్నాటకాలు ఆడాలో అన్ని ఆడేస్తున్నారు. ఇప్పటికే దొంగలా టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తోన్న జగన్ అండ్ కో… 2024 ఎన్నికల్లో గెలవలేమనే…
జగన్ మరో కిమ్ లా ఎందుకు మారాడు?

జగన్ మరో కిమ్ లా ఎందుకు మారాడు?

జగన్ లో ఎందుకింత రాక్షసత్వం ఆవహించింది. అసలు ఆయన రాజకీయ అరంగేట్రమే అవినీతితో మొదలైందని అంటారు. నాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 43వేల కోట్లు వెనకేసుకున్నాడని..సీబీఐ నిర్ధారణ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *