ఏపీ ప్రజలకు జగన్ కరెంట్ షాక్ – మోతమోగుతున్న బిల్లులు

ఏపీ ప్రజలకు జగన్ కరెంట్ షాక్ – మోతమోగుతున్న బిల్లులు

దేవుని దయ, మీ ఆశీస్సులతో తాము అధికారంలోకి రాగానే అన్ని ధరలు తగ్గిస్తాం. ఎన్నికలకు ముందు, పాదయాత్రలో ప్రతీ మీటింగ్ లో జగన్ చెప్పిన మాట. కానీ, అధికారంలోకి వచ్చాక మాత్రం రివర్స్ గేమ్ మొదలు పెట్టారు. ధరలు తగ్గించకపోగా, రెట్టింపు చేసి నాలుగేళ్లుగా ప్రజలపై పెనుభారం మోపుతున్నారు. ఏపీలో కరెంట్ బిల్లులు షాక్ కొడుతున్నాయి. వైసీపీ సర్కార్ ఈ నాలుగేళ్లలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి జనం నడ్డి విరిచింది. గతం కన్నా కరెంటు ఛార్జీలను డబులు చేశారు. ఇలా నాలుగేళ్లలో జనంపై రూ.35వేల కోట్ల విద్యుత్ బిల్లుల భారం వేశారు. ఇప్పటికే ఇంటిపన్ను, నీటి పన్ను రెట్టింపు చేయడంతోపాటు ఏటా 15 శాతం పెంచుకుంటూ పోతున్నారు. వీటికి చెత్త పన్ను తోడైంది.ఇది చాలదన్నట్లు అదనంగా ఇంధన ధరలు పెంచుకుంటూ పోతున్నారు. నాలుగేళ్లలో ఆరు సార్లు పెంచారు. అటు బస్సు ఛార్జీలు బాదారు. నిత్యాలసరాల ధరలయితే మండిపోతున్నాయి. ఇలా జగన్ రెడ్డి బాదుడుతో రాష్ట్ర ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

నేరుగా ఎక్కడా విద్యుత్ ఛార్జీలు పెంచినట్టు చూపకపోయినా, రకరకాల జిమ్మిక్కులతో బాదుడే బాదుడు కార్యక్రమానికి జగన్ రెడ్డి తెరలేపారు. స్లాబులు మూడుసార్లు మార్చారు. పేదలు, మద్యతరగతి సామాన్యులు సైతం గృహ వినియోగానికి యూనిట్ విద్యుత్ కు 6 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. జాతీయ పవర్ గ్రిడ్ నుంచి యూనిట్ 3 రూపాయలకు కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం జనాలకు మాత్రం 6 రూపాయలకు సరఫరా చేస్తోంది. పరిశ్రమలు, వాణిజ్య అవసరాలకు అయితే యూనిట్ కు 8 రూపాయలపైనే బాదుతున్నారు. గతంలో యూనిట్ విద్యుత్ కు పావలా పెంచితే రోడ్డెక్కి నానాయాగీ చేసే కమ్యూనిస్టులు కూడా నాలుగేళ్లుగా జెండా మూలనపడేశారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏటా 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినా కమ్యూనిస్టులు రోడ్డొక్కిన పాపాన పోలేదు. ఎంత పెంచినా జనం కిమ్మనడం లేదని, ప్రభుత్వం కూడా ఎడాపెడా విద్యుత్ ఛార్జీలు పెంచేస్తోంది. ఇక కలర్ టీవీల్లో సీరియల్స్ ఎక్కువగా చూడటం వల్లే విద్యుత్ బిల్లులు రెట్టింపు వస్తున్నాయని, అప్పట్లో మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

వ్యవసాయ పంపుసెట్లకు, ఇళ్లకు స్మార్ట్ మీటర్ల పేరుతో…. వైసీపీ ప్రభుత్వం తన అన్యాయాలకు రూ. 14 వేల కోట్ల విలువైన టెండర్లు కట్టబెట్టింది. 6 వేలకు వచ్చే స్మార్ట్ మీటరును, జగన్ రెడ్డి బంధువుల కంపెనీ నుంచి 13వేలకు కొనుగోలు చేసి..ఆ మొత్తం వినియోగదారుల నుంచి నెలనెలా కరెంటు బిల్లులో కలిపి వసూలు చేసే కుట్రకు తెరలేపారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించారు. రాబోయే 8 నెలల్లో అన్ని జిల్లాల్లో స్మార్ట్ మీటర్లు బిగించేందుకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేశారు.స్మార్ట్ మీటర్ల వ్యవహారంలో పెద్ద కుంభకోణం దాగి ఉందని టీడీపీ మండిపడుతోంది. ప్రభుత్వ అరాచకాలను ఆధారాలతో సహా టీడీపీ నేత పట్టాభి బయటపెడ్డంతో అధికారులు నీళ్లు నములుతున్నారు.

జగన్ రెడ్డి బాదుడు కారణంగా ప్రజలు రోడ్డునపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జనంపై పన్నుల భారం మోపి జలగలా పీడిస్తున్న జగన్, మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు నేనే మీ నమ్మకం అంటూ స్టిక్కర్లు వేయించే కార్యక్రమానికి పూనుకున్నారు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. నీవే మా దరిద్రం జగన్ అంటూ రూపొందించిన స్టిక్కర్లు జగన్ ప్రజావ్యతిరేక పాలనను స్పష్టం చేస్తున్నాయి.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *