జగన్ సర్కార్‌కు హైకోర్ట్ షాక్.. జీఓ నెంబర్ 1 కొట్టివేత

జగన్ సర్కార్‌కు హైకోర్ట్ షాక్.. జీఓ నెంబర్ 1 కొట్టివేత

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విపక్షాల సభలను, రోడ్ షోలను అడ్డుకూంట జగన్ సర్కార్ జారీ చేసిన అడ్డగోలు జీవో నెంబర్ వన్‌ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా జీవో నెంబర్ వన్ ఉందంటూ.. హైకోర్టు అభిప్రామయ పడింది.

ఇలాంటి జీవోల వల్ల ప్రజల ప్రాథమిక హక్కులు దెబ్బతింటాయని వ్యాఖ్యానించింది. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఉన్న జీవో నెంబర్ వన్ ను కొట్టేస్తున్నట్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది.

ప్రతిపక్షాల సభలకు విపరీతంగా జనం తరలి వస్తున్నారన్న కారణంతో ఈ ఏడాది జనవరి 2వ తేదీన ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1 ను జారీ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. యువనేత లోకేష్ తో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ యాత్రలను అడ్డుకునేలా ఇందులో నిబంధనలు పెట్టారు. పోలీస్ యాక్ట్ 30 కు భిన్నంగా ఈ నిబంధనలు ఉన్నాయని విపక్షాలు అభ్యంతరం చెప్పినా.. జగన్ సర్కార్ వెనక్కు తగ్గలేదు. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షో లకు సైతం ఈ జీఓ నెంబర్ 1ను సాకుగా చూపి అడ్డు తగిలారు.

నారా లోకేష్ పాదయాత్రకు నేటికీ ఆటంకాలు కల్పిస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ వారాహి బస్సుకు సైతం బ్రేకులు వేశారు. ఇలా అడ్డగోలు జీవోతో విపక్షాలను ఎన్ని రకాలుగా వేధించాలో అన్ని రకాలుగానూ వేధించారు.

అయితే.. విపక్షాల గొంతు నొక్కేలా ఉన్న జీఓ నెంబర్ 1 పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు టీడీపీ నేత కొల్లు రవీంద్ర తదితరులు హైకోర్టులో అప్పీల్ చేశారు. దీనిపై సుదీర్ఘంగా విచారించిన న్యాయస్థానం.. తాజాగా తీర్పు వెలువరించింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ వన్ రాజ్యాంగ విరుద్ధంగా ఉందంటూ కొట్టేసింది. దీంతో.. పోలీసులను అడ్డుపెట్టుకుని విపక్షాల గొంతు నొక్కాలనకున్న జగన్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్లు తెరిచి.. అడ్డగోలు జీవోలు తేవటం మానుకోవాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.

 

 

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *