
దేవుడి ఆస్తులు అన్యాక్రాంతం చేసిన ఐఏఎస్ పై హైకోర్టు సీరియస్
- Ap political StoryNewsPolitics
- March 30, 2023
- No Comment
- 34
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక.. దేవాలయాలకు, వాటిలో విగ్రహాలకు, ఆస్తులకు రక్షణ లేకుండా పోతోంది. రథాల దగ్దం, విగ్రహాల ధ్వంసం, ఆస్తుల అన్యాక్రాంతం ఇలా.. హిందూ దేవాలయాలపై ఓ పథకం ప్రకారం అన్నట్టుగా దాడులు జరుగుతున్నాయి. అంతే కాదు.. దేవాలయాలకు వచ్చే ఆదాయాన్ని సైతం ప్రభుత్వం తన అవసరాల కోసం పక్కదారి పట్టిస్తోంది. దీంతో ఎన్నో ఆలయాలు ధూప, దీప నైవేద్యాలకు దూరంగా ఉండిపోతున్నాయి. కానీ.. వీటిని పట్టించుకోని జగన్ సర్కార్.. హిందూ ఆలయాలను కేవలం ఆదాయ వనరుగా మాత్రమే చూస్తోంది. ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా వైసీపీ నేతలు సైతం హిందూ ఆలయాలను టార్గెట్ చేస్తున్నారు. అధికారుల అండదండలతో వాటి ఆస్తులను కాజేయటానికి రక రకాలుగా పన్నాగాలు పన్నుతున్నారు.
ఇక విషయానికి వస్తే.. ఎండోమెంట్ కమిషనర్ గా ఉన్నత పదవిలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి హరి జవహర్‌లాల్ పై రాష్ట్ర హైకోర్టు సీరియస్ అయ్యింది. ప్రైవేటు వ్యక్తులతో చేతులు కలిపి.. దేవస్థాన భూమిని కొట్టేయటానికి ప్రయత్నించిన దొంగలతో పోల్చింది. ఏపీలో దేవాలయాల ఆస్తులను కాపాడే వారే కరువయ్యారంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. అధికార పరిధిలేని ఎండోమెంట్ కమిషనర్ హరి జవహర్ లాల్.. గుంటూరులోని ఏకాంబరేశ్వర స్వామి ఆలయ భూములను నిషేదిత జాబితా నుంచి ఎలా తొలగిస్తారంటూ నిలదీసింది. కమిషనర్ పదవిలో కొనసాగటానికి ఆయన అనర్హుడంటూ ఆగ్రహించిన న్యాయస్తానం.. చర్యలకు సిద్ధపడింది. అయితే.. అడ్వకేట్ జనరల్ శ్రీరాం విజ్ణప్తి మేరకు.. తీవ్ర వ్యాఖ్యలతో సరిపెట్టింది. మొత్తం మీద.. దేవాలయ భూములకు ట్రస్టీలుగా ఉండాల్సిన అధికారులే.. అడ్డదారులు తొక్కటాన్ని భక్తులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.