మంత్రి కారుమూరి కారుకూతలు

మంత్రి కారుమూరి కారుకూతలు

ఏపీలో జగన్ రెడ్డికి రైతుల గోడే పట్టడం లేదు. అసలే అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయి మొలకెత్తడంతో లబోదిబోమంటున్నారు రైతులు. ఆదుకోండి మహా ప్రభో అని అధికారులను, పాలకులను చేతిలెత్తి మొక్కుతున్నా పట్టించుకోవడం లేదు. పైపెచ్చు రైతులను ఎర్రిపప్పలారా అంటూ ఓ మంత్రి దుర్భషలాడారు. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరుకు వెళ్లిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ముందు రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

ధాన్యం మొలకలొచ్చి ఎందుకు పనికిరాకుండా పోయిందని చెప్పిన ఓ రైతుపై …పౌరసరఫరాల శాఖ ఫైర్ అయ్యారు. “మొలకలొస్తే నేను ఏం చేస్తా ఎర్రిపప్ప” అంటూ పరుషపదజాలంతో దూషించారు.

మంత్రి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌ కావడం, ఆయన వ్యవహారించిన తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో సమర్థించుకునేందుకు ప్రయత్నించారు. ఎర్రిపప్పా అంటే బుజ్జినాన్న అని అర్థమంటూ కొత్త బాష్యం చెప్పారు. అంతేనా, ఇక అది తమ వాడుక భాష అంటూ మంత్రిగారు సెలవిచ్చారు. ఎర్రిపప్పా.. ఎర్రినాన్న అని అంటామంటూ చెప్పుకొచ్చారు కారుమూరి.

అంతటితో ఆగని మంత్రి, మరోసారి రైతులపై నోరుపారేసుకున్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు, నాచుగుంటలో కారుమూరి పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను మంత్రి వద్ద ఏకరవు పెట్టారు. ఈ క్రమంలో తీవ్ర అసహనానికి గురైన మంత్రి.. అక్కడే ఉన్న ఓ రైతును ఏయ్ నోరు మూసుకో అంటూ మండిపడ్డారు. మరో సందర్భంలో రైతులు ఆయనకు సమస్యలు చెబుతుండగా… వీడియో తీయొద్దంటూ మీడియాను వారించారు.

గోనెసంచులు ఇచ్చే దిక్కులేదు..రైతులను ఆదుకోవడం చేతకాదు గానీ..అన్నంపెట్టే అన్నదాతను దూషించడానికి మాత్రం మంత్రికి నోరు వచ్చింది. కారుమారి నాగేశ్వరరావు తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైస్ మిల్లర్లతో కుమ్మక్కైన మంత్రి, రైతులను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారంటూ ఎమ్మెల్యే మంతెన రామరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుల నుంచి దాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. జిల్లా మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు.. ఎర్రిపప్పకు అర్దం తెలియదా? అని ప్రశ్నించారు. కారుమూరి కారుకూతలు కట్టిపెట్టి, రైతులను ఆదుకునే విషయంలో శ్రద్ధ చూపాలని విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *