పంచాయతీ ఖాతాలు ఖాళీ..  ఏకగ్రీవ నిధులూ విద్యుత్తు ఛార్జీలకే!

పంచాయతీ ఖాతాలు ఖాళీ.. ఏకగ్రీవ నిధులూ విద్యుత్తు ఛార్జీలకే!

ఏపీలో గ్రామ పంచాయతీలు ఆర్థిక స్వాతంత్య్రం కోల్పోయాయి. గ్రామ పంచాయతీలకు మొదట్నుంచి షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. రెండేళ్ల క్రితం జరిగిన స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవమైన 2,001 పంచాయతీలకు ప్రభుత్వం ఏడాది క్రితం 134 కోట్ల రూపాయలు ప్రోత్సాహక నిధులు విడుదల చేసింది. 2,000 లోపు జనాభా ఉన్న పంచాయతీలకు 5 లక్షల రూపాయలు.. 2,001 నుంచి 5,000 లోపు ఉన్న వాటికి 10 లక్షల రూపాయలు.. 5,001 నుంచి 10,000 లోపు వాటికి 15 లక్షలు, 10,000కు మించి జనాభా కలిగిన పంచాయతీలకు 20 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించింది. వాటిని సాధారణ నిధుల ఖాతాకు జమచేసినట్లు అధికారులు ప్రకటించినా.. కొన్ని జిల్లాల్లో మాత్రం పంచాయతీల పేరుతో ఉన్న ఆర్థిక సంఘం నిధుల పీడీ ఖాతాల్లో వేశారు. తర్వాత వాటిని విద్యుత్‌ బకాయిలు కింద సర్దుబాటు చేశారు.

వైఎస్సార్ జిల్లాతో పాటు.. అన్నమయ్య జిల్లాల్లో 120కి పైగా పంచాయతీల్లో సర్పంచులకు ప్రోత్సాహక నిధులు వచ్చాయి అనే విషయం తెలిసేలోపే పీడీ ఖాతాలు ఖాళీ అయ్యాయి. వచ్చిన ఆర్థిక సంఘం నిధులను మొత్తం విద్యుత్తు బకాయిలకు సర్దుబాటు చేయడంతో గ్రామపంచాయతీల పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. దాదాపు 10 జిల్లాల్లో ఇలాంటి సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. నిధుల సర్దుబాటు విషయం సర్పంచులు చెబుతున్నా.. జిల్లా అధికారులు ధ్రువీకరిస్తున్నా.. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం మాత్రం దీనిని అంగీకరించడం లేదు.

ఏకగ్రీవంగా ఎన్నికైన అన్ని పంచాయతీలకు ప్రోత్సాహక నిధులు కేటాయించామని ప్రభుత్వం చెబుతోంది. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లోని చాలా పంచాయతీలకు.. రెండేళ్లైనా.. ఇంకా నిధులు విడుదల చేయలేదు. ప్రోత్సా హక నిధులతో కొన్ని ముఖ్యమైన పనులు చేద్దామని ఆశపడిన సర్పంచులు.. ఖాతాల్లో నిధులు కనిపించక ఆందోళన చెందుతున్నారు.

Related post

శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

హిందువులకు అత్యంత ముఖ్యమైన ఆరాధ్య దైవం విఘ్నేశ్వరుడు. సకల శుభంకరుడు.. సకల గణాలకు నాయకుడు గణేశుడు. అంతే కాదు.. లయకారుకుడైన ఆదిశంకరుడు, జగన్మాతల ముద్దుబిడ్డ వినాయకుడు. శివుని ఆదేశాలతో…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…
ఫొటోస్ : రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోస్

ఫొటోస్ : రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోస్

ఫొటోస్ : రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *