అవినాష్ రెడ్డి పారిపోతే నీకు,నాకు పనేంటి?

అవినాష్ రెడ్డి పారిపోతే నీకు,నాకు పనేంటి?

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం మీడియాపై చిందులు తొక్కారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి గురించి అడిగిన మీడియా ప్రతినిథులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాష్ పారిపోతే సీబీఐ చూసుకుంటుంది..నీకు, నాకు పనేంటి అంటూ ఫైర్ అయ్యారు. నీకు చెప్పాలా? నువ్వేమైనా సీబీఐ చీఫ్‌వా?’ అంటూ మీడియా పై స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు.

రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి తమ్మినేని మీడియాపై దురుసుగా ప్రవర్తించడాన్ని పలువురు తీవ్రంగా తప్పుబడుతున్నారు. స్పీకర్ తమ్మినేని శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ చిర్రుబుర్రులాడారు.

వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రపై సీబీఐ విచారణ జరుగుతోంది. ఇప్పటికే పలుమార్లు ఆయనను సీబీఐ ప్రశ్నించగా.. మరోసారి విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. సీబీఐ నోటీసులు ఇచ్చిన ప్రతిసారి విచారణకు వస్తున్నానని చెప్పి, అవినాష్ రెడ్డి డుమ్మా కొడుతున్నారు. ఈ క్రమంలోనే మీడియా అడిగిన ప్రశ్నపై స్పందిస్తూ స్పీకర్ ఆవేశంతో ఊగిపోయారు.

 

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *