ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం – కేంద్రం

ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం – కేంద్రం

విభజన హామీల్లో భాగంగా ఏపీకి దక్కాల్సిన ప్రత్యేక హోదాపై కేంద్రం మరోసారి నీళ్లు చల్లింది. 25 ఎంపీ సీట్లు గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తానని ప్రగల్బాలు పలికిన సీఎం జగన్ రెడ్డి, ఎన్నికల తరవాత ప్లేటు ఫిరాయించారు. పోరాడి సాధించుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం వద్ద సాగిలపడటంతో ప్రత్యేక హోదా కలగానే మిగిలిపోయింది. ఏపీకి ప్రత్యేక హోదాను సీఎం జగన్ రెడ్డి కేంద్రం వద్ద ఎందుకు తాకట్టు పెట్టారు? అసలు ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉందో.. లేదో.. తెలుసుకుందాం..

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు. అది ముగిసిన అధ్యాయం అంటూ కేంద్రం తాజాగా మరోసారి చేసిన ప్రకటన స్పెషల్ స్టేటస్ పై నీళ్లు చల్లింది. ఏపీకి ప్రత్యేక హోదాపై లోక్ సభలో వైసీపీ ఎంపీలు బాలశౌరి, శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సూటిగా సమాధానం చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం. 14వ ఆర్థిక సంఘం సిపారసుల ప్రకారం లోటు ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నాం. దీంతో ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాలకు తేడా లేకుండా పోయింది. ఏపీకి హోదా బదులు, ప్యాకేజీ కూడా ఇచ్చామని కేంద్ర సహాయ మంత్రి నిద్యానందరాయ్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజత పథకాల్లో 90 శాతం నిధులను కేంద్రమే భరిస్తోందని, కేంద్రానికి వచ్చే ఆదాయంలో రాష్ట్రాలకు 42 శాతం పంపిణీ చేస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన లేదని కేంద్ర మంత్రి తేల్చిపడేశారు.

2019 ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి సీఎం జగన్ రెడ్డి ప్రత్యేక హోదా వస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయే ప్రత్యేకంగా సభలు పెట్టిమరీ చెప్పారు. 25 ఎంపీ సీట్లు గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తా అంటూ ఘీంకరించారు. తీరా అధికారంలోకి వచ్చాక యూ టర్న్ తీసుకున్నారు. కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చిందని, ప్రత్యేక హోదా గురించి ప్లీజ్ ప్లీజ్ అని అడగటం తప్ప ఏమీ చేయలేమని జగన్ రెడ్డి స్వయంగా మీడియాకు తెలిపారు. అంటే పోరాడి సాధించుకోవాల్సిన ప్రత్యేక హోదాను, సీబీఐ, ఈడీ కేసుల మాఫీకి, స్పెషల్ స్టేటస్ ను జగన్ రెడ్డి కేంద్ర వద్ద తాకట్టు పెట్టాడనే విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా గురించి రచ్చ చేసిన జగన్ రెడ్డి, 2019 ఎన్నికల ఫలితాలు రాగానే సైలెంట్ అయిపోయారు. దీంతో కేంద్రం కూడా ప్రత్యేక హోదా గురించి ఆలోచన చేయడం మరచిపోయింది.

రాజధాని లేకుండా రాష్ట్రం విడిపోయింది. తీవ్రమైన ఆర్థికలోటు ఉంటుంది. ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ సీనియర్ నేతలు కూడా అరచి మరీ చెప్పారు. బీజేపీ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదాను అటకెక్కించారు. ఏపీలో జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక, కేంద్రంపై ఒత్తిడి చేయడం మానేశారు. అప్పుల కోసం, కేసుల మాఫీకోసం ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవడం తప్ప ప్రత్యేక హోదా కోసం ఒక్కసారి కూడా వారిని కలిసింది లేదు. జగన్ రెడ్డిపై ఉన్న అక్రమ ఆస్థుల కేసులపై సీబీఐ, ఈడీ ఒత్తిడి చేయకుండా ఉండేందుకు ఏపీ ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారంటూ ప్రతిపక్షాలు విమర్శించినా వైసీపీ నేతలకు కనీసం చీమకుట్టినట్టయినా లేకుండా పోయింది. తాజాగా కేంద్రం చేసిన ప్రకటనతో వైసీపీ అధికారంలో ఉండగా ప్రత్యేక హోదా రాదని తేలిపోయింది.

Related post

చంద్రబాబు అరెస్టు పై బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ స్పందన

చంద్రబాబు అరెస్టు పై బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ స్పందన

చంద్రబాబు అరెస్ట్‌ పై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు . చంద్రబాబు అరెస్ట్‌ కక్ష సాధింపులా కనిపిస్తోంది . కక్షసాధింపు రాజకీయాలు సమర్థనీయం కాదు అని అన్నారు…
జగన్ మరో కిమ్ లా ఎందుకు మారాడు?

జగన్ మరో కిమ్ లా ఎందుకు మారాడు?

జగన్ లో ఎందుకింత రాక్షసత్వం ఆవహించింది. అసలు ఆయన రాజకీయ అరంగేట్రమే అవినీతితో మొదలైందని అంటారు. నాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 43వేల కోట్లు వెనకేసుకున్నాడని..సీబీఐ నిర్ధారణ…
లగడపాటి రీఎంట్రీ.. పోటీ ఎక్కడి నుంచో తెలుసా..?

లగడపాటి రీఎంట్రీ.. పోటీ ఎక్కడి నుంచో తెలుసా..?

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రీ ఎంట్రీ ఇవ్వనున్నారా? వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. రాజగోపాల్ రాజకీయాల్లో మళ్లీ యాక్టీవ్ అవుతున్నారు. ఇందుకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *