
క్రైం టెర్రర్.. ఏపీని నేరాంధ్రప్రదేశ్ గా మార్చిన జగన్ రెడ్డి
- Ap political StoryNewsPolitics
- June 18, 2023
- No Comment
- 20
జగన్ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ ను ఓ క్రైమ్ స్టేట్ గా మార్చేశాడు. గతంలో బీహార్ నేరాలకు అడ్డాగా ఉండేది. ఇప్పుడు అంతకుమించి ఏపీలో నేరాలు, ఘోరాలు జరిగిపోతున్నాయి. నాలుగేళ్లుగా రాష్ట్రంలో అసాంఘిక శక్తులు పెట్రేగిపోతున్నాయి. పోలీసులు అధికార పార్టీ నేతల సేవలో తరిస్తున్నారు. గూండాలు, కిడ్నాపర్లు, స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఉద్యోగులు, ప్రతిపక్షాలను అణగదొక్కడంపై ఉన్న శ్రద్ధ… ప్రభుత్వానికి ప్రజల భద్రతపై లేకుండా పోయింది. దాని ఫలితంగానే, నెల్లూరులో ఓ యువతిపై పట్టపగలే సామూహిక అత్యాచారం, ఏలూరులో యాసిడ్ దాడి, పులివెందులలో దళితుడి హత్య, బాపట్లలో టెన్త్ విద్యార్థి సజీవదహనం, విశాఖలో ఏకంగా ఎంపీ కుటుంబసభ్యుల కిడ్నాప్ లాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంత పరాకాష్టకు చేరాయో.. ఈనాలుగైదు రోజుల్లో జరిగిన దారుణ ఘటనలు అద్దం పడుతున్నాయి.
పరిపాలన పడకేసింది. ప్రభుత్వ యాంత్రాంగం చేతులెత్తేసింది. నేరగాళ్లపై నిఘా కొరవడింది. దీంతో, రాష్ట్రవ్యాప్తంగా హత్యలు, అపహరణలు, మానభంగాలు, మహిళలు, దళితులపై దాడులు నిత్యకృత్యంగా మారాయి. విశాఖపట్నం వైసీపీ ఎంపీ ఎంవీవీ భార్య, కుమారుడు, ముఖ్యమంత్రికి సన్నిహితుడైన ఆడిటర్ జీవీని… రౌడీషీటర్లు ఎంపీ ఇంట్లోనే 48 గంటలు పాటు బంధించారు. అయినా, పోలీసులు తెలుసుకోలేకపోయారంటేనే వారి నిఘా వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో తెలుస్తుంది.
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న తోబుట్టువుకు సాయం చేయటం కోసం శ్రీకాకుళం నుంచి నెల్లూరుకు వెళ్లిన ఓ యువతిని కొంతమంది వ్యక్తులు పట్టపగలే కిడ్నాప్ చేశారు. మెడిసిన్ కోసం ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన ఆమెను నిర్బంధించి…నగర శివారు ప్రాంతాల్లోకి తీసుకెళ్లి తొమ్మిదిమంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తన చెల్లెలి జోలికి రావొద్దంటూ హెచ్చరించినందుకు ఏలూరులో మహిళపై ఓ వ్యక్తి యాసిడ్ దాడి చేయించాడు. ప్రస్తుతం బాధితురాలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పులివెందులలో దళితుడు కృష్ణయ్యను దుండగులు దారుణంగా హతమార్చారు. బాపట్లలో పదో తరగతి బాలుడిని పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. నేరస్తుల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం, ఉదాసీనంగా వ్యవగరించడం వల్లే ఈ ఘారాలన్నీ జరిగిపోతున్నాయి.
భూ వివాదాలు, దందాల్లో కీలకంగా ఉంటున్న వైసీపీ నాయకులు నేరగాళ్లను పెంచి పోషిస్తున్నారు. దీంతో, పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారు. మొన్న ప్రకాశం జిల్లాలో దళిత మహిళ హనుమాయమ్మ ను ట్రాక్టర్ తో తొక్కించి చంపిన నిందితుడు వైసీపీ నాయకుడే. నెల్లూరులో టీడీపీ నేత ఆనంపై దాడికి పాల్పడింది వైసీపీ నాయకులే. రాజంపేటలో ఓ యువకుడిని కిడ్నాప్ చేసిన దుండగులు వైసీపీ ఎమ్మెల్యే భూమన అనుచరులే. ఎన్టీఆర్ జిల్లాలో పర్యాటకులపై మంత్రి జోగి రమేష్ అనుచరులమంటా దాడికి తెగబట్టారు. ఇలా వైసీపీ గూండాలు, వారు పెంచి పోషిస్తున్న అరాచకశక్తులపై పోలీసులు కేసులు పెట్టేందుకు జంకుతున్నారు. దాంతో, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించిపోతున్నాయి.