ప్రమోషన్ కి అంత సాహసం అవసరమా అంటే.. అఖిల్ రియాక్షన్

ప్రమోషన్ కి అంత సాహసం అవసరమా అంటే.. అఖిల్ రియాక్షన్

అక్కినేని అఖిల్ యాక్షన్ హీరోగా చేసిన మూవీ ఏజెంట్ ఢిల్లీ బ్యూటీ సాక్షి వైద్య హీరోయిన్ , సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ సినిమా ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా కోసం అఖిల్ తో పాటు ఇతర యూనిట్ సభ్యులు దాదాపు రెండు సంవత్సరాల పాటు కష్టపడ్డారు. సినిమా మేకింగ్ కోసం కష్టపడ్డట్లుగానే ప్రమోషన్ కార్యక్రమాల కోసం కూడా టీమ్ చాలా కష్టపడుతోంది.

అఖిల్ మూవీస్ గతం లో ఎప్పుడు చెయ్యనట్లు గా హత రెండు మూడు వారాలుగా చిత్ర యూనిట్ సభ్యులు సినిమాను ప్రమోట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు . సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో అఖిల్ ఏకంగా 172 అడుగుల ఎత్తున్న భవనం నుండి కిందకు దూకడం ప్రమోషన్ లో భాగమే . ఐతే సినిమా ప్రమోషన్ కోసం మరీ ఇంతటి వైల్డ్ స్టంట్ చేయడం అవసరమా అంటూ కొందరు విమర్శించారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో అఖిల్ ప్రమోషనల్ వైల్డ్ స్టంట్ గురించి మాట్లాడుతూ.. ప్రేక్షకులు మా సినిమాపై చాలా నమ్మకం పెట్టుకుని ఉంటారు. అందుకు తగ్గట్లే సినిమా ఉంటుందని చెప్పడానికే ఇలాంటి ఒక సాహసం చేశామని అఖిల్ అన్నాడు. కొందరు ఆ స్టంట్ ను వద్దని వారించారు. కానీ మా ప్రయత్నం గురించి ప్రేక్షకులకు తెలియాలనే ఉద్దేశ్యంతో అంతటి సాహసం చేశామని అఖిల్ పేర్కొన్నాడు.

చిత్రంలో అలాంటి స్టంట్స్ చాలానే ఉంటాయి. వాటికి ఎంతగా అయితే జాగ్రత్తలు తీసుకుంటారో అంతే జాగ్రత్తలను ఈ స్టంట్ కు కూడా తీసుకుని చేయడం జరిగింది. జనాలు అతి అనుకున్నా కూడా జనాల్లోకి సినిమాను తీసుకు వెళ్లడానికి ఇలాంటివి చేయడం అనేది మంచిదే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఐతే ఆకలిమీదున్న పులికి జింక దొరికినట్లు . హిట్స్ లేకుండా సప్పగా ఉన్న అఖిల్ సినీ లైఫ్ లో ఒక ఆశ ఏజెంట్ రూపంలో కనిపించింది అందుకోసమే ఎంత రిస్క్ ిన తీసుకుంటున్నాడు అఖిల్ అని కొందరు కామెంట్ చేస్తున్నారు

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *