యుగ పురుషుడు ఎన్టీఆర్‌ : కింజరాపు అచ్చెన్నాయుడు

యుగ పురుషుడు ఎన్టీఆర్‌ : కింజరాపు అచ్చెన్నాయుడు

యుగ పురుషుడు, తెలుగు వారి ఆరాధ్య దైవం, విశ్వవిఖ్యాత నటసార్వ భౌముడు, తెలుగు దేశం పార్టీ స్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలు ఆ మహానుభావుడి సొంత ఊరిలో జరుపు కోవడం సంతోషకరం, గర్వకారణమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. నిమ్మకూరులో జరిగిన ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ.. తెలుగువారి ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారు పుట్టిన ఊరికి రావడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. ఎంతోమంది నాయకులు పుట్టారు.. గిట్టారు. కానీ పుట్టిన 100సంవత్సరాల తర్వాత కూడా ప్రజల గుండెల్లో కొలువైన దైవం.. ప్రపంచ చరిత్రలో స్వర్గీయ ఎన్టీఆర్‌ మాత్రమే.

తెలుగువారు నేడు ప్రపంచ వ్యాప్తంగా అన్నిరంగాల్లో రాణిస్తున్నారు అంటే దానికి కారణం స్వర్గీయ ఎన్టీఆర్‌, చంద్రబాబులే. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరపడానికి తెలుగువారు, టీడీపీ నేతలు కార్యకర్తలు ఉత్సాహం చూపుతున్నారు. తెలుగు దేశం పార్టీ తరుపున ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో 100 బహిరంగ సభలు నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు గారు నిర్ణయించారు. తొలి సభను హైదరాబాద్‌ లో నిర్వహించారు. రెండో సభను నేడు నిమ్మకూరులో నిర్వహించుకుంటున్నాం. 100వ సభను రాజమహేంద్రవరంలో తెలుగు జాతి కనీవినీ ఎరుగని రీతిలో ప్రపంచం గర్వించేలా నిర్వహించాలని పార్టీ అధ్యక్షుల వారు నిర్ణయం తీసుకున్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *