ఆదిరెడ్డి అప్పారావు, శ్రీవివాస్‌ల అరెస్ట్‌ దుర్మార్గం : అచ్చెన్నాయుడు

ఆదిరెడ్డి అప్పారావు, శ్రీవివాస్‌ల అరెస్ట్‌ దుర్మార్గం : అచ్చెన్నాయుడు

వైసీపీ కేడీలకు సీఐడీ అధికారులకు తేడా లేకుండా పోయిందని టిడిపి రాష్ట్ర అద్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ కేడీలు టీడీపీ కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారన్నారు. సీఐడీ అధికారులు సోదాల పేరుతో టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, శ్రీవివాస్‌ల అక్రమ అరెస్ట్‌ దుర్మార్గమన్నారు. జగన్‌….. ఆదిరెడ్డి కుటుబం నీతి నిజాయితీ ఏంటో రాజమండ్రి ప్రజల్ని అడగండి చెబుతారని,జగన్‌ ఎంతమందిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్‌ చేసినా భయపడేది లేదన్నారు. జగన్‌ అరాచక ప్రభుత్వాన్ని గోదావరి నదిలో కలిపేంత వరకు విశ్రమించేది లేదని, అరెస్టు చేసిన ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్‌ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

బీసీలను అణగదొక్కేందుకు జగన్‌ రెడ్డి కుట్ర: యనమల రామకృష్ణుడు

జగన్మోహన్‌ రెడ్డి తాటాకు చప్పుళ్లకు తెలుగుదేశం పార్టీ భయపడదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. అక్రమ కేసులు, అరెస్ట్‌లకు భయపడి ప్రజా సమస్యలపై వెనక్కు తగ్గమన్నారు. వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనపై పోరాటం ఆపేదే లేదని హెచ్చరించారు. టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబసభ్యుల అక్రమ అరెస్ట్‌ పిరికిపంద చర్య అన్నారు. ఆదిరెడ్డి అప్పారావు, వాసు చిట్‌ ఫండ్‌ కంపెనీ నిర్వహించడం జగన్‌ దృష్టిలో నేరమా? వాళ్లేమీ జగన్మోహన్‌ రెడ్డిలా సూట్‌ కేసు కంపెనీలు పెట్టి వేల కోట్లు దోచుకోలేదే? రాజకీయ లబ్ధి కోసం సొంత బాబాయ్‌ ని గొడ్డలివేటుకు బలిచేయలేదే? ఏం తప్పు చేశారని వారిని అరెస్ట్‌ చేశారు? సీఐడీని అడ్డుపెట్టుకుని ఎంతమందిని అరెస్ట్‌ చేస్తారు? అని సూటిగా ప్రశ్నించారు.

మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆదిరెడ్డి భవానీ టీడీపీకి ఓటు వేయకుండా అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారన్నారు. అది విఫలం కావడంతో కక్ష పెట్టుకున్నారని మండిపడ్డారు. దీనికితోడు రాజమండ్రిలో జరగనున్న మహానాడు నిర్వహణలో ఆదిరెడ్డి కుటుంబం చురుగ్గా పాల్గొనకూడదని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తండ్రి వైఎస్‌ లాగే జగన్‌ కూడా బీసీలను అణగదొక్కుతున్నారన్నారు. బీసీలపై దౌర్జన్యకాండకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ బీసీలను నేతలుగా తయారుచేస్తే జగన్‌ వారికి రాజకీయ అవకాశాలు దూరం చేస్తున్నారని విమర్శించారు. బీసీలంటే జగన్‌కు ఎందుకంత చిన్నచూపు?బీసీలు నేతలుగా ఎదగకూడదా? బీసీలు వ్యాపారం చేసుకోకూడదా? అని తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించారు. బీసీల ఇళ్లు ధ్వంసం చేశారు. వారి భూములు బలవంతంగా లాక్కున్నారు. అక్రమ అరెస్ట్‌లతో వేధిస్తున్నారు. ఆదిరెడ్డి భవానీ కుటుంబసభ్యుల అరెస్ట్‌కు జగన్‌ రెడ్డి తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *