జైలుకెళ్లి వచ్చిన సిఎంకు  పోలీసులు కాపలానా? అయ్యన్న

జైలుకెళ్లి వచ్చిన సిఎంకు పోలీసులు కాపలానా? అయ్యన్న

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో జరిగిన బీసీ ఐక్య కార్యాచరణ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలను అణగదొక్కుతున్నారని, 2500 మంది పోలీసులు లేనిదే ముఖ్యమంత్రి బయటికి రాలేని పరిస్థితని విమర్శించారు. జైలుకు వెళ్లి వచ్చిన సీఎంకు పోలీసులు కాపలా..? అంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ సెంటిమెంట్‌ చర్లపల్లి జైలుకు వెళ్లిరావడమేనని అన్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు పోలవరంపై అవగాహన లేదని విమర్శించారు. ఏపీలో బీసీ మంత్రుల పేర్లు ఎంతమందికి తెలుసునని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.

నాలుగేళ్లలో రూ. 45వేల కోట్లు విలువ చేసే ప్రైవేట్‌ భూములు బలవంతంగా లాక్కున్నారని ఇదేనా పరిపాలన విధానమని అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలను సీఎం జగన్‌ రూ. 25వేల కోట్లకు బ్యాంకుల్లో తాకట్టు పెట్టారని ఆరోపించారు. చివరికి బ్రాందీ షాపులను కూడా బ్యాంకుల్లో తాకట్టు పెట్టారని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో మద్యం షాపులు బంద్‌ అని జగన్‌ పాదయాత్రలో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా అయ్యన్న గుర్తు చేశారు. ఒక్క మాట నిలబెట్టుకోలేదని, అబద్దాలతో రాష్ట్ర ప్రజలను జగన్మోహన్‌ రెడ్డి మోసం చేసిన దుర్మార్గుడని అన్నారు.

ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపుతున్నందుకు టీడీపీ నేతలపై కేసులు పెట్టి.. జైలుకు పంపుతున్నారని, తనపై ఏకంగా 14 కేసులు పెట్టారని అన్నారు. కాకపోతే ఒక కేసు విషయంలో బాధపడ్డానన్నారు. ఈ వయసులో తనపై రేప్‌ కేసు పెట్టారని అన్నారు. ఇటువంటి దైర్భగ్యపరిపాలన రాష్ట్రంలో జరుగుతోందని, న్యాయం చేయాల్సిన పోలీస్‌ డిపార్టుమెంట్‌ కూడా అలాగే ఉందని అయ్యన్న తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.

Related post

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జ్‌ ,మాజీమంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రమాదేవి కలిసి పలు చోట్ల.. వినాయక స్వామివారిని…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…
చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం..  విడుదల అయ్యేంత వరకు పోరాటం

చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం.. విడుదల అయ్యేంత వరకు పోరాటం

నాలుగున్నర దశాబ్దాల పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవినీతికి తావు లేకుండా.. టీడీపీ అధినేత చంద్రబాబు పరిపాలన చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం.. నిరంతరం అభివద్ధే ధ్యేయంగా పని చేసిన చంద్రబాబుపై…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *