సర్పంచులేవ్వరు పంచాయతీల విద్యుత్‌ బిల్లులు చెల్లించవద్దు : బాబు రాజేంద్రప్రసాద్‌

సర్పంచులేవ్వరు పంచాయతీల విద్యుత్‌ బిల్లులు చెల్లించవద్దు : బాబు రాజేంద్రప్రసాద్‌

సర్పంచులేవ్వరు పంచాయతీల విద్యుత్‌ బిల్లుల చెల్లించవద్దని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ ఛాంబర్‌ అధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్‌, రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం లక్ష్మీ ముత్యాలరావులు తెలిపారు. తాడిగడపలో మాజీ సర్పంచ్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ సర్పంచుల మరియు పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ల ప్రెస్‌ మీట్‌ లో ముఖ్య అతిథిగా పాల్గొని సర్పంచుల పట్ల జగన్మోహన్‌ రెడ్డి యొక్క నిరంకుశత్వాన్ని ఖండిరచారు. ఈ సందర్భంగా బాబు రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని 12918 గ్రామపంచాయతీల సర్పంచులు ఎవ్వరు పంచాయతీల కరెంట్‌ బిల్లులు కట్టవద్దని, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి 14, 15 వ ఆర్థిక సంఘాల ద్వారా పంచాయతీలకి పంపించిన రూ 8660 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళించి తన సొంత అవసరాలకు వాడివేసుకుందన్నారు.

అదేమంటే ఆ డబ్బులు కరెంటు బకాయిల కింద జమ చేసుకున్నామని చెబుతూనే, మరలా కరెంట్‌ బిల్లులు కట్టమని సర్పంచ్ల పై అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు.అయినా అసలు గత ప్రభుత్వాలు గ్రామపంచాయతీలకు ఉచిత విద్యుత్ని ఇచ్చారని, ఈ ప్రభుత్వం దానిని విస్మరిస్తూ ఏవో కుంటి సాకులు చెబుతూ పంచాయతీలకు కేంద్రం పంపిన నిధులు అన్నీ కూడా దారి మళ్ళీ ఇస్తుందని, గతంలో రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన 8660 కోట్లను వెంటనే మా పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని, అలాగే గ్రామపంచాయతీల ఖాతాల్లో ఉన్న అన్ని రకాల నిధులను కరెంటు బిల్లుల క్రింద జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. లేదంటే మా ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందన్నారు.

లక్ష్మీ ముత్యాలరావు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం మా సర్పంచులను పూర్తిగా నిధులు, విధులు లేకుండా ఉత్సవ విగ్రహాలు లాగా మార్చి వేసిందన్నారు. మా నిధులు మా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేయకుంటే, ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని అన్నారు.

అదే విధంగా మా ఆంధ్రప్రదేశ్‌ సర్పంచుల సంఘం యొక్క డిమాండ్లు

1) సర్పంచుల నిధులు ,విధులు, అధికారాల సాధన కోసం మరియు కేంద్ర ప్రభుత్వం 14 ,15వ ఆర్థిక సంఘం ద్వారా 12918 గ్రామాల సర్పంచులకు పంపిన రూ 8660 కోట్ల రూపాయలు తిరిగి సర్పంచుల ఖాతాల్లో జమ చెయ్యాలి.

2) గ్రామ సచివాలయాలను, వాలంటీర్లను సర్పంచుల అధ్వర్యంలోకి తీసుకురావాలి.

3) సర్పంచులకు , ఎంపీటీసీ లకు రూ 15 వేలు – అలాగే ఎంపీపీ లకు, జడ్పిటిసి లకు రూ 30000 వేలు గౌరవ వేతనం ఇవ్వాలి.

4) ఉపాధి హామీ నిధులు కూడా గతంలో మాదిరే సర్పంచులకు ఇవ్వాలి.

5) పాత పద్ధతిలోనే పంచాయతీలకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలి.

6) గత మూడు న్నర సంవత్సరములుగా రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిన గ్రామపంచాయతీల బకాయి నిధులను వెంటనే విడుదల చేయాలి.

ఇలా న్యాయబద్ధమైన మా 12 డిమాండ్ల సాధన కోసం రాజకీయాలకతీతంగా రాష్ట్రంలోని సర్పంచులందరినీ కలుపుకొని ఉద్యమాలు ఉధృతం చేస్తామని రాజేంద్రప్రసాద్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *