బేబి మూవీ రివ్యూ

బేబి మూవీ రివ్యూ

బేబి పెక్యూలర్‌ ఢిఫరెంట్‌ స్టోరీ కాదు రెగ్యూలర్‌ మనం రోజు చూసే, వినే కథనే.. ఇంకా గట్టిగా చెప్పాలంటే మన ఫ్రెండ్‌ సర్కిల్‌లోనో.. మనకో కచ్చింగా ఇలాంటి ఎక్స్‌పిరియర్స్‌ చేసి ఉంటాం. అదే కథనే కెమెరాలో బంధించి సెల్యూలాయిడ్‌ ప్రజెంట్‌ చేస్తే అది బేబి సినిమా అవుతుంది. ట్రైలర్‌ ఏం చూపించాడో తెర పై కూడా అదే చూపించాడు డైరెక్టర్‌. స్కూల్‌ ఏజ్‌ నుంచే తన ఎదురింట్లో ఉండే హీరో ఆనంద్‌ని లవ్‌ చేస్తుంది హీరోయిన్‌ వైష్ణవి. దాని తరువాత ఆనంద్‌, వైష్ణవిని అంతకంటే ఎక్కువగా ప్రాణంగా ప్రేమిస్తాడు. కొన్ని సిట్యూవేషన్స్‌ వల్ల ఆనంద్‌ ఆటో డ్రైవర్‌గా అవుతాడు. అప్పటి వరకు అంతా బాగానే ఉంటుంది. ఎప్పుడైతే వైష్ణవి ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో జాయిన్‌ అవుతుందో విరాజ్‌ పరిచయం అయ్యాడో అప్పటి నుంచే లవ్‌లో పెయిన్‌ స్టార్ట్‌ అవుతుంది. ఆనంద్‌ని తాగుబోతుని చేస్తుంది.. వైష్టవి లైఫ్‌లో టర్న్‌ తీసుకుంటుంది. ఈ పాయింట్‌ని మనం చాలా సార్లు చూస్తాం. కానీ డైరెక్టర్‌ సాయి రాజేష్‌ చెప్పితే మళ్ళీ చూడాలనిపింది. దానికి తోడుగా ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, పర్ఫార్మెన్స్‌ అయితే స్టానింగ్‌ అనిపించాయి. కంట్లోనీళ్ళు తిరగడమే కాదు గుండేను కూడా పించ్‌ చేస్తుంది.

ప్రేమించేది ఆనంద్‌ని కానీ ముద్దులిచ్చేది మాత్రం విరాజ్‌కు.. హీరోయిన్‌ క్యారెక్టరైజేషన్‌ లో ఇన్‌స్టెబుల్టి అనే పాయింట్‌ని బాగా ఎలివేట్‌ చేశాడు డైరెక్టర్‌. ఓ యాంగిల్‌లో చేస్తే హీరో పాలిట హీరోయిన్‌యే విలన్‌ల కనిపిస్తుంది. ముఖ్యంగా సినిమాలో డైలాగ్స్‌ గురించి మాట్లాడుకోవాలి. ట్రైలర్‌లో రెండు మూడు సాంపిల్స్‌ వదిలాడు. అమ్మాయిలతో ఫ్రెండ్‌షిప్‌ అంటే తుడిచి పెట్టి అన్ని సమర్చించాలి అనే డైలాగ్స్‌ థియేటర్‌లో ఓ రేంజ్‌లో పేలాయి. హీరో క్యారెక్టర్‌లో ఎమోషన్‌, హీరోయిన్‌ చంచల మైండ్‌సెట్ సినిమాని నెక్ట్‌ లెవెల్‌కు తీసుకువెళ్ళాయి. కరెంట్‌ జనరేషన్‌లో కాలేజ్‌ లవ్‌స్టోరీలు ఎలా ఉన్నాయే చెప్పడంలో సాయి రాజేష్‌ సక్సెస్‌ అయ్యాడు. వాళ్ళు చేసే చిన్న చిన్న తప్పులకు లైఫ్‌ బ్యాలెన్స్‌ అవుట్‌ అవ్వడం లాంటి సిన్స్‌ సినిమాకే హైలెట్‌గా ఉన్నాయి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయింది. ఆనంద్ దేవరకొండ నటన సూపర్బ్‌ గా ఉంది. లవ్‌ ఫెయిల్యూర్‌ రోల్‌లో ఇన్వాల్‌ అయ్యాడు. హీరోయిన్ వైష్ణవి చైతన్య కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఆ పెయిన్ అర్ధమయ్యేలా కేవలం తన కళ్లల్లో పలికించిన హావభావాలు హైలెట్‌. హార్ట్‌ టాచ్చింగ్‌గా అనిపింస్తుంది బేబి. అలాగే కీలక పాత్రలో నటించిన విరాజ్ అశ్విన్ ఒకే అనిపిస్తాడు. తండ్రి రోల్‌లో నాగబాబు కూడా బాగా నటించాడు. మిగత నటినటులు వాళ్ళ క్యారెక్టర్‌కు వరకు బాగా చేశారు.

మొత్తంగా సాయి రాజేష్ రాసిన కథ, క్యారెక్టరులు కూడా నేటి యువత లైఫ్‌లో ఇన్సిడెంట్స్‌ని, సిట్యూవేషన్స్‌ని బేస్ చేసుకుని సెన్సిబుల్‌గా స్టోరీని రన్‌ చేస్తు ప్రేమతో పాటు ఆ ప్రేమలోని ఎమోషన్ని, పెయిన్ని కూడా హైలెట్ అయ్యే విధంగా కొన్ని సీన్‌లు చాలా బాగా డిజైన్‌ చేశాడు. అక్కడక్కడ స్లో నరేషన్‌ సాగాదిసినట్లు ఉండే కొన్ని సీన్స్‌,అలాగే హీరోయిన్ ట్రాక్ లోని కొన్ని సీన్స్ కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని లవ్ సీన్స్ కూడా ల్యాగ్ అనిపిస్తాయి. సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ అందించిన పాటలు ఆకట్టుకున్నాయి. ఆనంద్ దేవరకొండ పై వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సూపర్బ్‌గా అనిపిస్తుంది. సినిమాలో సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ప్రేమ కథకు అనుగుణంగా విజువల్స్ ను చాలా అందంగా చూపించారు. ఓవరల్‌గా బేబి హార్ట్‌ టచ్చింగ్‌ ఎమోషనల్‌ డ్రామా.. యూత్‌కి ఈ సినిమా బాగా కనెక్ట్‌ అవుతుంది.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *